కాళేశ్వర క్షేత్రం

(కాళేశ్వర క్షేత్రము నుండి దారిమార్పు చెందింది)

కాళేశ్యర క్షేత్రము కరీంనగర్ జిల్లా మంథని మండలంలో ఉంది. కాళేశ్యర క్షేత్రము శివుడి ఆలయానికి ప్రసిద్ధి. ఇక్కడ సరస్వతి దేవి ఆలయం కూడ ఉంది. ఇక్కడి శివాళయం ప్రత్యేకత నాలుగు ద్యారల మద్య నాలుగు ముకాల శివలింగం ఉంటుంది. ఈ ఆలయంలో యమకోణం ఉన్నది, భక్తులు ఆ యమకోణం నుండి వెల్లినట్లయితే తమకున్నటువంటి యమగండాలు తొలగి పొతాయని నమ్ముతారు. ఈ ఆలయం గోదావరి నదీ ఒడ్డున ఉండటం వలన పుణ్యస్నానానికి ప్రజలు ఎక్కువ సంక్యలో వచ్చి స్నానాలు చేసి దైవ దర్శనం చేసుకొని వెలతారు.

ఇక్కడికి వెళ్లుటకు ఆర్.టి.సి. బస్సు సౌకర్యము మంథని నుండి కలదు. రైలు సదుపాయం పెద్దపల్లి లేదా రామగుండంలో దిగి మల్లి బస్సు ద్వారా వెల్లాలి.

ప్రస్తుతం ఈ నది మీద వంతెన నిర్మాణం జరుగుతున్నది. ఈ వంతెన పూర్తి అయినట్లయితే మహారాష్ర్టకి రోడ్డు మార్గం చాలా దగ్గరవుతుంది. అలాగే రామగుండం, మంచిర్యాల నుండి విశాఖపట్టణం వెళ్లుటకు రోడ్డు మార్గం దాదాపు 400 కి.మీ. తగ్గుతుంది.