కాళ్ల సత్యనారాయణ

కాళ్ల సత్యనారాయణ ఒక తెలుగు చిత్రకారుడు. వందలకొద్దీ నవలలకు ముఖచిత్రాలను రూపొందించాడు.[1] ఈయన చిత్రాల్లో ఎక్కువగా శ్రామిక జీవితాలు కనిపిస్తాయి. కమ్యూనిస్టు భావజాలంతో ప్రభావితుడై తన చివరి శ్వాస దాకా నిరాడంబర జీవితం గడిపాడు.[2] కొంతకాలం ప్రజానాట్యమండలి లో కూడా పనిచేశాడు. విమర్శకులు ఈయన జీవితాన్ని స్పానిష్ చిత్రకారుడు ఫ్రాన్సిస్కో గోయా తో పోలుస్తారు.[1]

కాళ్ల సత్యనారాయణ
జననం(1948-04-10)1948 ఏప్రిల్ 10
మరణం2018 నవంబరు 24(2018-11-24) (వయసు 70)
ఖమ్మం
వృత్తిచిత్రకారుడు
జీవిత భాగస్వామికోటమ్మ
పిల్లలుముగ్గురు కుమారులు

వ్యక్తిగత జీవితం

మార్చు

సత్యనారాయణ 1948 ఏప్రిల్ 10 న విజయ నగరం జిల్లాలో జన్మించాడు. తండ్రి రిక్షా కార్మికుడు. తల్లి కూలిపని చేసేది. సత్యనారాయణ బాల్యం నుంచి చిత్రకళపై అనురక్తి పెంచుకున్నాడు.[3] బతుకుదెరువు కోసం ఏలూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో నివసించాడు. కానూరి హరీశ్ ప్రోత్సాహంతో ఖమ్మం చేరుకున్న ఆయన విభిన్న శైలిలో చిత్రాలను గీస్తూ సాధన చేశాడు. కేశవరెడ్డి నవలలకు, శివసాగర్ కవితలకు బొమ్మలు గీశాడు. సాహితీవేత్త నర్రా వెంకటేశ్వరరావు, సినీ దర్శకుడు ధవళ సత్యం ఆయనకు సమకాలికులు.

ఆయన భార్య కోటమ్మ. వీరికి ముగ్గురు కుమారులు. ఇందులో ఇద్దరు చిత్రకారులు. కాళ్ల సత్యనారాయణ 2018 నవంబరు 24 న ఖమ్మంలో మరణించాడు.[4]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 సాహితీసుధ (2019). తెలుగు వెలుగు. హైదరాబాదు: రామోజీ ఫౌండేషన్. p. 27. Archived from the original on 2019-02-09. Retrieved 2019-02-28.
  2. "ప్రముఖ చిత్రకారుడు సత్యనారాయణ కన్నుమూత". నవతెలంగాణ. 25 November 2018.
  3. "కాళ్ల సత్యనారాయణ.. రాయని ఆత్మకథ". సాక్షి. 26 November 2018.
  4. "ప్రముఖ చిత్రకారుడు కాళ్ల సత్యనారాయణ కన్నుమూత". ఆంధ్రజ్యోతి. 25 November 2018.[permanent dead link]

మూస:Https://www.andhrajyothy.com/artical?SID=671995 {మూలాలజాబితా}}