కాసుల బాల్‌రాజ్
కాసుల బాల్‌రాజ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు బాన్సువాడ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌గా పని చేశాడు.
కాసుల బాల్‌రాజ్ | |||
| |||
ఆగ్రో పరిశ్రమల కార్పొరేషన్ ఛైర్మన్
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 జులై 8 - ప్రస్తుతం | |||
ముందు | తిప్పన విజయ సింహారెడ్డి | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1960 బాన్సువాడ, కామారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | ప్రజారాజ్యం పార్టీ | ||
నివాసం | బాన్సువాడ |
జననం, విద్యాభాస్యం
మార్చుకాసుల బాల్‌రాజ్ 01 జనవరి 1960లో తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, బాన్సువాడలో జన్మించాడు. ఆయన ఎస్‌ఎస్‌సి వరకు చదువుకున్నాడు.
రాజకీయ జీవితం
మార్చుకాసుల బాల్‌రాజ్ 1985లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1985 నుంచి 1990 వరకు బాన్సువాడ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, 1990 నుంచి 1998 వరకు బాన్సువాడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, 1992 నుంచి 1995 వరకు బాన్సువాడ మార్కెట్ కమిటి అధ్యక్షుడిగా, 1995 నుంచి 2001 వరకు బాన్సువాడ సర్పంచ్‌గా, 22 జులై 2006 నుండి 17 ఆగష్టు 2008 వరకు బాన్సువాడ ఎంపిపి పని చేశాడు.
కాసుల బాల్‌రాజ్ 2009లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయాడు. ప్రజారాజ్యం పార్టీ 2011లో కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన 2014, 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి టీఆర్‌ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేతిలో ఓడిపోయాడు.[1]
ఆయనను 2024 జులై 8న ఆగ్రో పరిశ్రమల కార్పొరేషన్ ఛైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.[2]
మూలాలు
మార్చు- ↑ Sakshi (19 November 2018). "అభ్యర్థుల ప్రొఫైల్". Archived from the original on 27 November 2021. Retrieved 27 November 2021.
- ↑ Eenadu (8 July 2024). "తెలంగాణలో వివిధ కార్పొరేషన్లకు నూతన ఛైర్మన్ల నియామకం". Archived from the original on 8 July 2024. Retrieved 8 July 2024.