కిళాంబి కృష్ణమాచార్యులు
కిళాంబి కృష్ణమాచార్యులు (మే 5, 1900 - జూలై 27, 1959) రంగస్థల నటుడు, దర్శకుడు, నాట్యాచార్యుడు.[1]
కిళాంబి కృష్ణమాచార్యులు | |
---|---|
జననం | మే 5, 1900 |
మరణం | జూలై 27, 1959 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | రంగస్థల నటుడు, దర్శకుడు , నాట్యాచార్యుడు |
తల్లిదండ్రులు | సుబ్బయ్య, సుబ్బమ్మ |
జననం
మార్చుకృష్ణమాచార్యులు 1900, మే 5న ధర్మాచార్యుల, చూడమాంబ దంపతులకు సామర్లకోటలో జన్మించాడు.
నాటకరంగ ప్రస్థానం
మార్చుపండితుల కుటుంబం కనుక కృష్ణమాచార్యులుకు సంగీత సాహిత్యాలు వంశపారంపర్యంగా వచ్చాయి. చిన్నతనంలోనే ఆరాధనోత్సవాలలో పాటలు పాడుతూ సంగీతాన్ని అభివృద్ధి పరుచుకున్నాడు. అంతేకాకుండా, నాటక లక్షణ గ్రంథాలు చదివి నాటకకళలో ప్రావీణ్యం సంపాదించుకున్నాడు. చిన్న వయసులోనే కాకినాడకు వెళ్లి, వెదురుమూడి శేషగిరిరావు, ముప్పిడి జగ్గరాజు, ఆలమూరు పట్టాభిరామయ్య మొదలైన మహానటులతో కలిసి నటించడమేకాకుండా, అనకాపల్లి లోని లలితా సమాజం ప్రదర్శించిన ప్రదర్శనలలో నటించాడు. 1917లో లలితా సమాజానికి కొంతకాలం ఉపాధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేశాడు. నటులకు శిక్షణ ఇవ్వడంలో తగిన ప్రతిభ కలవాడు. ఈయన శిక్షణలో రూపొందిన నటులు నాటక, సినీరంగాలలో రాణించారు. ఈయన నాటక కృషిని గుర్తించి ఆంధ్ర నాటక కళా పరిషత్తు 1950లో ఘనంగా సన్మానించింది.
దర్శకత్వం చేసినవి
మార్చు- అనార్కలి
- చాణక్య
- ఆంధ్రశ్రీ
- వేనరాజు
- కురుక్షేత్రం
నటించిన పాత్రలు
మార్చు- శ్రీరాముడు
- శ్రీకృష్ణుడు
- కంసుడు
- రుక్మాంగదుడు
- విశ్వామిత్రుడు
- ధర్మరాజు
- భవానీ శంకరుడు
- బిల్వమంగళుడు
- లింగరాజు
- శర్మ (మధుసేవ)
- అక్బర్
- భరతుడు
- దుర్యోధనుడు
- అర్జునుడు
మరణం
మార్చు1957లో కృష్ణమాచార్యులుకు చక్కెర వ్యాధి రావడంతో కుడికాలు తొలగించవలసివచ్చింది. 1959, జూలై 27న మరణించాడు.
మూలాలు
మార్చు- ↑ కిళాంబి కృష్ణమాచార్యులు, నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.263.