కిషన్‌గంజ్ జిల్లా
బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో కిషన్‌గంజ్ జిల్లా ఒకటి. కిషన్‌గంజ్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. కిషన్‌గంజ్ జిల్లా పూర్ణియా డివిజన్‌లో భాగం.
కిషన్‌గంజ్ జిల్లా किशनगंज जिला,ضلع کشن گنج | |
---|---|
![]() బీహార్ పటంలో కిషన్‌గంజ్ జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | బీహార్ |
డివిజను | పూర్ణియా |
ముఖ్య పట్టణం | కిషన్‌గంజ్ |
ప్రభుత్వం | |
• లోకసభ నియోజకవర్గాలు | కిషన్‌గంజ్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,884 km2 (727 sq mi) |
జనాభా వివరాలు (2011) | |
• మొత్తం | 16,90,948 |
• సాంద్రత | 900/km2 (2,300/sq mi) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 57.04 % |
• లింగ నిష్పత్తి | 946 |
ప్రధాన రహదార్లు | NH 31 |
జాలస్థలి | అధికారిక జాలస్థలి |
పేరువెనుక చరిత్రసవరించు
ఖగాడ నవాబ్ సమయంలో మొహమ్మద్ ఫక్రుద్దీన్ కాలంలో ఈ ప్రాంతానికి ఒక సన్యాసి వచ్చడు. ఆయన చాలా అలసి ఉన్నాడు కనుక ఈ ప్రాంతాన్నీ తాను విశ్రమించడానికి కావాలని అడిగాడు. ఆయన ఈ ప్రాంతం పేరు అలంగంజ్ అనీ ఇక్కడ ప్రవహిస్తున్న నది పేరు రంజాన్ అనీ జమీదర్ పేరు ఫకురుద్దీన్ అని తెలుసుకున్న తరువాత ఆయన అలంగజ్‌లోకి ప్రవేశించడానికి నిరాకరించాడు. అది తెలుసుకున్న నవాబు రంజాన్ పూల్ గంధి ఘాట్ వద్ద ఉన్న కొంత ప్రాంతాన్ని కృష్ణ్ - కుంజ్ అని నామకరణం చేసాడు. కాలక్రమంలో అది కిషన్‌గంజ్‌గా మారింది.
చరిత్రసవరించు
పూర్ణియా జిల్లాలో కిషంగంజ్ పురాతనమైనదీ, ప్రాముఖ్యత కలిగిన ప్రాంతగా గుర్తింపును పిందింది. ఈ ప్రాంతంలోని సాంఘిక కార్యకర్తలు, రాజకీయవాదులు, పాత్రికేయులు, వ్యాపారులు, వ్యవసాయదారుల వంటి ప్రజలు పలువురి 7 సంవత్సరాల ఎడతెగని పోరాటం కారణంగా 1990 జనవరి 14 న కిషన్‌గంజుకు జిల్లా అంతస్తు వచ్చింది.[1] ముగల్ పాలనా కాలంలో ఈ ప్రాంతం నేపాల్ దేశంలో భాగంగా ఉంటూ వచ్చింది. దీనిని నేపాల్గర్ అని పిలిచేవారు. ముగల్ చక్రవర్తుల సూచనలను అనుసరించి మొహమ్మద్ రేజా నేపాల్గర్ కోటను స్వాధీనం చేసుకున్నాడు. తరువత ఈ ప్రాంతానికి అలంగంజ్ అని పేరు మార్చబడింది. తరువాత ఇది కిషన్‌గజ్‌గా మార్చబడింది. [1]
భౌగోళికంసవరించు
కిషన్‌గంజ్ జిల్లా వైశాల్యం 1884 చ.కి.మీ.[2] ఇది యునైటెడ్ స్టేట్స్‌లోని అరారియా జిల్లాకు సమానం. .[3] కిషన్‌గంజ్ 25-0-20 నుండి 26-0-30 ఉత్తర అక్షాంశం 87 -0 - 7 నుండి 88-0-19 రేఖాంశంలో ఉంది.[1] జిల్లాలో మాహానందా నది, కంకై నది, మెచి నది, డోంక్ నది, రతుయా ఖోలా, రంజాన్ నదులు ప్రవహిస్తున్నాయి.[1]
సరిహద్దులుసవరించు
కిషన్‌గంజ్ జిల్లా పశ్చిమ సరిహద్దులో అరారియా జిల్లా, నైరుతీ సరిహద్దులో పూర్ణియా జిల్లా, తూర్పు సరిహద్దులో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఉత్తర దీనాజ్‌పూర్ జిల్లా,, ఉత్తర సరిహద్దులో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్ జిల్లా, నేపాల్ దేశం ఉన్నాయి.[4]
ఆర్ధికంసవరించు
2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో కిష్న్‌గంజ్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[5] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[5]
విభాగాలుసవరించు
- జిల్లాలో ఒకేఒక ఉపవిభాగం ఉంది: కిషంగంజ్.
- విభాగంలో 7 మండలాలు ఉన్నాయి : దిగల్బ్యాంక్, భహంతూర్ గంజ్, కొచధమన్, పొథియా, తెరహంగచ్చ, ఠాకూర్గంజ్.
విద్యసవరించు
2014 జనవరి 30 న సోనియాగాంధి చేత " కిషంగంజ్ కాంపస్ ఆఫ్ అలిగర్ ముస్లిం యూనివర్శిటీ " స్థాపనకు శంకుస్థాపన చేయబడిది.[6]
2001 లో గణాంకాలుసవరించు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,690,948,[7] |
ఇది దాదాపు. | గునియా- బిస్సౌ దేశ జనసంఖ్యకు సమానం.[8] |
అమెరికాలోని. | ఇడాహో నగర జనసంఖ్యకు సమం.[9] |
640 భారతదేశ జిల్లాలలో. | 293 వ స్థానంలో ఉంది.[7] |
1చ.కి.మీ జనసాంద్రత. | 898 .[7] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 30.44%.[7] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 946:1000 [7] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 57.04%.[7] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
ప్రజలుసవరించు
జిల్లాలో ప్రజలు అధికంగా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా ముస్లిములు అధికంగా ఉన్నారు. జిల్లాలో ముస్లిములు 70% ఉన్నారు.,[7] జిల్లాలో హిందువులలో అధికంగా సూరజపురీలు ఉన్నారు. జిల్లాలో కొంతమంది సంతల్ ప్రజలు ఉన్నారు.[10][11]
భాషలుసవరించు
కిషన్‌గంజ్ ప్రజలు అధికంగా సూరజ్పురి భాష వాడుకలో ఉంది. అదనంగా జిల్లాలో బెంగాలీ భాషను అధికంగా పోలి ఉన్న రాజ్భంగ్షి భాష వాడుకలో ఉంది. 2001 గణాంకాల అనుసరించి. కిషన్‌గంజ్ అక్షరాస్యత 31.02. (బీహార్ రాష్ట్ర 47.53). బిహార్ రాష్ట్ర అక్షరాస్యత భారతీయ అక్షరాస్యత (64.84%) కంటే తక్కువగా ఉంది. అంతేకాక దేశంలోని ఇతర రాష్ట్రాల అక్షరాస్యత కంటే తక్కువగా ఉంది. కిషన్‌గజ్ జిల్లా పురుషుల అక్షరాస్యత 42.8%. స్త్రీల అక్షరాస్యత 18.49%. (దేశంలో అతి తక్కువ) [11][12]
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 1.2 1.3 "Kishanganj District (బీహార్)". Kishanganj district administration. Archived from the original on 2010-11-14. Retrieved 2010-10-08.
- ↑ Srivastava, Dayawanti (2010). "States and Union Territories: బీహార్: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
- ↑ "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2015-12-01. Retrieved 2011-10-11.
Maui 1,888km2
- ↑ "Kishanganj district map". Maps of India. Retrieved 2010-10-08.
- ↑ 5.0 5.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
- ↑ http://timesofindia.indiatimes.com/city/patna/Sonia-to-lay-foundation-of-AMU-Kishanganj-unit-today/articleshow/29571536.cms
- ↑ 7.0 7.1 7.2 7.3 7.4 7.5 7.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Guinea-Bissau 1,596,677 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Idaho 1,567,582
- ↑ "The Socio-Economic and Political Scenario of Kishanganj District". Azad India Foundation. Retrieved 2010-10-08.
- ↑ 11.0 11.1 "Kishanganj: బీహార్'s most backward district in quest for AMU centre". TwoCircles.net. Retrieved 2010-10-08.
- ↑ "District-specific Literates and Literacy Rates, 2001". Registrar General, India, Ministry of Home Affairs. Retrieved 2010-10-05.
బయటి లింకులుసవరించు
- Kishanganj Information Portal Archived 2011-04-30 at the Wayback Machine