పూర్ణియా

బీహార్ రాష్ట్రం లోని పట్టణం

పూర్ణియా బీహార్ . ఇది ఈశాన్య బీహార్‌ ప్రాంతమైన కోసి - సీమాంచల్ ప్రాంతం లోని అతిపెద్ద నగరం. ఇది పూర్ణియా ఉకు ముఖ్యపట్టణం, పూర్ణియా డివిజన్కు కేంద్ర స్థానం. పూర్ణియా పట్టణ ప్రాంతపు మొత్తం భౌగోళిక విస్తీర్ణం 92 చ.కి.మీ. పాట్నా తరువాత బీహార్‌లో ఇదే అతి పెద్దది. నగరంలో జనసాంద్రత కిలోమీటరుకు 3058 మంది. జనాభా ప్రకారం ఇది బీహార్ లోకెల్లా 5 వ అతిపెద్ద నగరంగా నిలిచింది . ఇది పాట్నా నుండి దాదాపు 302 కిలోమీటర్ల దూరంలో ఉంది, అలాగే సిలిగురి నుండి 171 కి.మీ, భాగల్పూర్ నుండి 90 కి.మీ. గువహతి నుండి సుమారు 640 కి.మీ.,  కోల్‌కతా నుండి 450 కి.మీ. దూరంలో ఉంది. పూర్ణియా జిల్లా విస్తీర్ణం 3202.31 చ.కి.మీ. 

పూర్ణియా

पूर्णिया
నగరం
పూర్ణియా
ముద్దుపేరు(ర్లు): 
మినీ డార్జిలింగ్[1] Jute City[ఆధారం చూపాలి]
పూర్ణియా is located in Bihar
పూర్ణియా
పూర్ణియా
బీహర్ పటంలో నగర స్థానం
నిర్దేశాంకాలు: 25°46′41″N 87°28′34″E / 25.778°N 87.476°E / 25.778; 87.476Coordinates: 25°46′41″N 87°28′34″E / 25.778°N 87.476°E / 25.778; 87.476
దేశం India
రాష్ట్రంబీహార్
ప్రాంతంమిథిల (ప్రాంతం) కోసి-సీమాంచల్ (ఉప ప్రాంతం)
జిల్లాపూర్ణియా
స్థాపన1770 ఫిబ్రవరి 14
విస్తీర్ణం
 • నగరం92 km2 (36 sq mi)
 • పట్టణ
60 km2 (20 sq mi)
సముద్రమట్టం నుండి ఎత్తు
36 మీ (118 అ.)
జనాభా వివరాలు
 • నగరం310,817
 • విస్తీర్ణం
282,248
కాలమానంUTC+5:30 (IST)
టెలిఫోన్ కోడ్+91 6454
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లుBR-11
అక్షరాస్యత74.09%
జాలస్థలిpurnea.bih.nic.in

భారత సైన్యం, భారత వైమానిక దళాల స్థావరాలతో పాటు, భారతదేశకేంద్ర సాయుధ బలగాలకు చెందిన ఐదు శాఖలలో మూడు - బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్), సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బి), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి) ల స్థావరాలు జిల్లాలో ఉన్నాయి.

జనాభా వివరాలుసవరించు

2011 జనాభా లెక్కల ప్రకారం, పూర్ణియా మునిసిపల్ కార్పొరేషన్ మొత్తం జనాభా 2,82,248 కాగా, వారిలో 1,48,077 మంది పురుషులు, 1,34,171 మంది మహిళలు ఉన్నారు. [2] లింగనిష్పత్తి 906. ఆరేళ్ళ లోపు పిల్లల సంఖ్య 43,050. ఏడేళ్ళకు పైబడిన వారిలో అక్షరాస్యత 73.02%. జాతీయ సగటుతో (74.04%) పోలిస్తే ఇది తక్కువ [3] పూర్ణియా మునిసిపల్ కార్పొరేషన్, కస్బా నగర పంచాయతీ లతో కూడిన పూర్ణియా పట్టణ ప్రాంతంలో, [4] 2011 లో 3,10,817 జనాభా ఉంది. [5]

2011 లో జనాభా 75.2% హిందూ, 23.3% ముస్లింలు. పూర్ణియాలో మైథిలి జనాభా ఎక్కువ.

శీతోష్ణస్థితిసవరించు

పూర్ణియా సానుకూలమైన శీతోష్ణస్థితికి ప్రసిద్ధి చెందింది; ఈ కారణంగా దీనికి "మినీ డార్జిలింగ్ " అనే పేరు వచ్చింది. పూర్ణియాలో ఎక్కువగా తేమతో కూడిన శీతోష్ణస్థితి ఉంది, బీహార్ రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం ఇక్కడే ఉంటుంది. తేమ 70% పైన ఉంటుంది. శీతాకాలం, నవంబరు నుండి ఫిబ్రవరి వరకు, వేసవి కాలం మార్చి నుండి జూన్ వరకు ఉంటాయి. రుతుపవనాల కాలం జూన్ ప్రారంభంలో మొదలై, సెప్టెంబరు వరకూ ఉంటుంది. మొత్తం వార్షిక వర్షపాతంలో 82% వర్షాకాలంలోనే పడుతుంది.

జనవరి, అత్యంత శీతలమైన నెల. సగటు రోజువారీ కనిష్ట ఉష్ణోగ్రత 5 నుండి 10°C వరకు ఉంటుంది. సగటు రోజువారీ గరిష్ట ఉష్ణోగ్రత 20 నుండి 25°C వరకు ఉంటుంది. వర్షాకాలం కాని సీజన్లలో గాలి సాధారణంగా తేలికగా ఉంటుంది, కానీ రుతుపవనాల సమయంలో, బంగాళాఖాతంలో ఉద్భవించే తుఫానులు, మాంద్యాలు భారీ వర్షాలకు, బలమైన గాలులకూ కారణమవుతాయి.

శీతోష్ణస్థితి డేటా - Purnia (1981–2010, extremes 1901–2009)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 29.3
(84.7)
35.3
(95.5)
40.6
(105.1)
43.3
(109.9)
43.9
(111.0)
43.0
(109.4)
38.9
(102.0)
38.2
(100.8)
37.4
(99.3)
36.6
(97.9)
34.8
(94.6)
31.6
(88.9)
43.9
(111.0)
సగటు అధిక °C (°F) 23.2
(73.8)
27.0
(80.6)
32.2
(90.0)
35.2
(95.4)
34.9
(94.8)
34.4
(93.9)
32.9
(91.2)
33.2
(91.8)
32.9
(91.2)
32.3
(90.1)
29.9
(85.8)
25.8
(78.4)
31.2
(88.2)
సగటు అల్ప °C (°F) 8.7
(47.7)
11.3
(52.3)
15.7
(60.3)
20.2
(68.4)
23.1
(73.6)
25.0
(77.0)
25.4
(77.7)
25.6
(78.1)
24.7
(76.5)
21.0
(69.8)
14.9
(58.8)
10.1
(50.2)
18.8
(65.8)
అత్యల్ప రికార్డు °C (°F) 1.3
(34.3)
1.7
(35.1)
5.4
(41.7)
10.4
(50.7)
15.0
(59.0)
17.8
(64.0)
20.7
(69.3)
19.6
(67.3)
18.0
(64.4)
10.0
(50.0)
4.6
(40.3)
2.1
(35.8)
1.3
(34.3)
సగటు వర్షపాతం mm (inches) 9.0
(0.35)
8.1
(0.32)
11.1
(0.44)
41.8
(1.65)
155.2
(6.11)
306.0
(12.05)
399.6
(15.73)
320.5
(12.62)
321.9
(12.67)
80.8
(3.18)
5.6
(0.22)
5.6
(0.22)
1,665.2
(65.56)
సగటు వర్షపాతపు రోజులు 0.8 1.0 1.0 2.7 6.6 10.8 15.1 13.1 11.4 3.5 0.5 0.6 67.0
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 75 62 48 50 63 74 82 82 83 80 78 79 71
Source: India Meteorological Department[6][7]

రవాణాసవరించు

వైమానికసవరించు

చునాపూర్ విమానాశ్రయం (ఎయిర్‌ఫోర్స్ స్టేషన్) అనే పూర్ణియా విమానాశ్రయం, కంటోన్మెంటు ప్రాంతంలో ఉంది. అయితే ఇది సైన్యం వినియోగానికి మాత్రమే పరిమితం. ఈ విమానాశ్రయం నుండి షెడ్యూల్డు విమానాలను కూడా నడపడానికి రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ప్రతిపాదనలున్నాయి. ఇటీవలే స్పిరిట్ ఎయిర్ పూర్ణియా నుండి పాట్నాకు విమానాలను ప్రారంభించే ప్రయత్నాలు చేసింది.

సమీప వాణిజ్య విమానాశ్రయం, సుమారు 150 కి.మీ. దూరం లోని బాగ్డోగ్రా విమానాశ్రయం. ఇది డార్జిలింగ్ జిల్లాలోని బాగ్డోగ్రా వద్ద ఉంది. జయప్రకాష్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయం (పాట్నా విమానాశ్రయం) 310 కి.మీ. దూరంలో, బీహార్ రాజధాని పాట్నాలో ఉంది.

రైలుసవరించు

పూర్ణియాlO పూర్ణియా జంక్షన్ (స్టేషన్ కోడ్: పిఆర్ఎన్ఎ ), పూర్ణియా కోర్ట్ (స్టేషన్ కోడ్: పిఆర్ఎన్సి) అనే రెండు రైల్వే స్టేషన్లున్నాయి. ఇవి ఒకదానికొకటి 5 కి.మీ. దూరంలో ఉన్నాయి.. పూర్ణియా జంక్షన్ ఖుస్కిబాగ్, గులాబ్బాగ్, తూర్పు పూర్ణియా ప్రాంత వాసులకు దగ్గరగా ఉంది. పూర్ణియా కోర్ట్ రైల్వే స్టేషన్ నగరపు పశ్చిమ భాగంలో ఉంది. ఇది మధుబని, జనతా చౌక్, మధ్య, పశ్చిమ పూర్ణియా వాసులకు సౌకర్యంగా ఉంటుంది. పూర్ణియా జంక్షను ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వేకు చెందిన బరౌని-కటిహార్ మార్గం లోకి, తూర్పు మధ్య రైల్వే జోన్ కు చెందిన సహర్సా పూర్ణియా విభాగంలోకీ వస్తుంది. ఇక్కడి నుండి కటిహార్, జోగ్‌బని, సహర్సా, బరౌని, కోల్‌కతా, ఢిల్లీ, పాట్నా, రాంచీ, ముజఫర్‌పూర్, మోతీహారి, లక్నో, కాన్పూర్, గోరఖ్‌పూర్, గయా లతో పాటు సమీపంలోని ఇతర నగరాలకు రోజువారీ రైళ్ళు, వారపు రైళ్లూ ఉన్నాయి.

జాతీయ రహదారులు   NH 31 ,  NH 27 ,  NH 231 ,  NH 131A పూర్ణియా నుండి సమీప నగరాలకు, ఇతర రాష్ట్రాల ప్రదేశాలకూ రోడ్డు సౌకర్యం కలిపిస్తున్నాయి. రాష్ట్ర రహదారులు ఇతర పొరుగు నగరాలు, గ్రామాలను ప్రధాన నగర ప్రాంతానికి కలుపుతాయి. కొత్తగా నిర్మించిన   NH 27 పూర్ణియాను ఉత్తర బీహార్ లోని కొన్ని ముఖ్యమైన పట్టణాలైన దర్భాంగా, ముజఫర్పూర్ నగరాలకు నేరుగా కలుపుతాయి. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా ముజఫర్‌పూర్ చేరుకోవడానికి దాదాపు 5 గంటలు పడుతుంది. కొత్తగా నిర్మించిన కోసి మహాసేతు వంతెన గుండా వెళ్ళే ఈ ఎక్స్‌ప్రెస్ రహదారి ముజఫర్‌పూర్ వద్దకు చేరి అక్కడినుండి పాట్నా వరకూ కొనసాగుతుంది. పాట్నాకు ఇదొక ప్రత్యామ్నాయ మార్గంగా మారింది. ఎప్పుడూ ట్రాఫిక్కుతో బిజీగా ఉండే NH31 పై వత్తిడి తగ్గించడంలో సహాయపడింది.

అస్సాం లోని సిల్చార్ నుండి గుజరాత్ వరకు వెళ్ళే తూర్పు-పడమర కారిడార్   NH 27 పూర్ణియా గుండా వెళుతుంది. ఇది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) నిర్మించిన ఆధునిక నాలుగు లేన్ల రహదారి. రాష్ట్ర రహదారులు 60, 62, 65, 77 & 90 కూడా పూర్ణియా గుండా వెళతాయి.

మూలాలుసవరించు

  1. "गर्म हो रहा मिनी दार्जिलिंग का मिजाज". Dainik Jagran. Archived from the original on 11 May 2018. Retrieved 11 May 2018.
  2. District Census Handbook - Purnia (PDF). censusindia.gov.in. 2014. p. 24. Archived from the original (PDF) on 16 May 2017. Retrieved 9 May 2018.
  3. "Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Archived (PDF) from the original on 7 May 2012. Retrieved 2012-04-16.
  4. "Constituents of urban Agglomerations Having Population 1 Lakh & above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Archived from the original (PDF) on 6 March 2016. Retrieved 2012-04-16.
  5. "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Archived from the original on 26 December 2018. Retrieved 2012-04-16.
  6. "Station: Purnea Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 631–632. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 24 August 2020.
  7. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M37. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 24 August 2020.


"https://te.wikipedia.org/w/index.php?title=పూర్ణియా&oldid=3121909" నుండి వెలికితీశారు