కుంతీపుత్రుడు

కుంతీపుత్రుడు దాసరి నారాయణరావు దర్శకత్వంలో 1993లో విడుదలైన చిత్రం. ఇందులో మోహన్ బాబు, విజయశాంతి ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని మోహన్ బాబు తన స్వంత నిర్మాణ సంస్థయైన లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై నిర్మించాడు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించాడు. ఒక జమీందారీ వంశానికి చెందిన వాడు తన తల్లికి పెళ్ళికి ముందే మరో వ్యక్తితో సంబంధం వల్ల పుట్టాడని తెలుసుకుంటే అతని జీవితం ఎలా ఉంటుంది అనే అంశం పై కథ అల్లుకున్నారు.

కుంతీపుత్రుడు
Kunthi Putrudu.jpg
సినిమా పోస్టర్
దర్శకత్వందాసరి నారాయణరావు
తారాగణంమోహన్‌బాబు,
విజయశాంతి
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1993
భాషతెలుగు

ఈ సినిమా మలయాళ సినిమా దేవాసురమ్ అనే చిత్రానికి పునర్నిర్మాణం. 1990 వ దశకంలో ఈ చిత్రం మలయాళంలో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అంతేగాక దర్శకుడు ఐ. వి. శశి, నటుడు మోహన్ లాల్ కు మంచి పేరు తెచ్చి పెట్టిన చిత్రం ఇది.[1]

కథసవరించు

రాంబాబు ఒక జమీందారు బిడ్డ. తన విచ్చలవిడి తనంతో మైథిలి ఒక నృత్యకళాకారిణిని అవమానిస్తాడు. ఆమె అతన్ని అసహ్యించుకుని అతని నాశనాన్ని కోరుకుంటుంది. ఇంతలో రాంబాబుకు తన పుట్టుక గురించి ఒక రహస్యం తెలుస్తుంది. దాంతో మైథిలికి కూడా అతని మీద జాలి కలుగుతుంది. కానీ అతని రాంబాబు ప్రత్య్రర్థులు అతన్ని ఊరికే ఉండనివ్వరు. వారి బారి నుంచి తనను ఎలా కాపాడుకున్నాడన్నది మిగతా కథ.

తారాగణంసవరించు

పాటలుసవరించు

ఈ చిత్రానికి ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించాడు.

  • లేలే బాబా నిద్దురలేవయ్యా

మూలాలుసవరించు

  1. "Remembering a legend: Five iconic IV Sasi movies that shaped Mollywood". www.indulgexpress.com. Retrieved 2020-07-15.