బీరకాయ

(బీర నుండి దారిమార్పు చెందింది)
బీరకాయ
బీరకాయ
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
లుఫ
జాతులు
  • లుఫ్ఫా అక్యూటాంగ్యులా (బీర)
  • లుఫ్ఫా ఈజిప్టియాక (Smooth luffa, Egyptian luffa)
  • లుఫ్ఫా ఓపర్క్యులేట (Sponge cucumber)

బీరకాయ , Ridge Guard మార్చు

 
Luffa operculata
 
Luffa aegyptiaca

మొక్క గురించి మార్చు

గుమ్మడి కుటుంబమునకు చెందినది. బీరతీగ గుమ్మడి కుటుంబము లోని జాతులలో విస్తరణమున మధ్యమము. నులితీగలు 2 - 5 శాఖలు కలిగి యుండును. ఆకును 5 - 7 కోణములు లేక స్పష్టమగు తమ్మెలు గలిగి ఆయారకములలో మధ్యమ పరిమాణము కలిగి కానీ పెద్దవిగా కానీ యుండును. మగ పూవులు గుత్తులుగ బయలుదేరును. ఇందు 5 తమ్మెలుగల పుష్పకోశమును, ఐదు పసిమి రంగుగల రక్షతపత్రములు ఉండును. కింజల్కములు మూడు. ఆడు పూవున కూడా పుష్పకోశమును, దళవలయమును, మగపూవునందువలెనే యుండును. ఇవి ఉచ్చములు, అనగా అండాశయముపై అమరియుండును. కీలము మూడు అగ్రములు కలిగి కురుచగ ఉండును. మూడు మానమాత్రపు కింజల్కములు కూడా నుండును. బీర పూవులు సాయంకాలము 5 - 6 గంటల మధ్య విడచును. కాయలలో పొడవు 10 - 60 సెం.మీ ఉండును. లావు 2.5 - 3. 5 సెం.మీ ఉండును. పైన స్ఫుటమయిన కోణములు తేరి డోరియాలు కలిగి ఉండును. సామాన్యముగా ఈ కోణములు పది యుండును. కాయ ఎండిన వెనుక పై చర్మము పీచుకట్టుటయే కాక లోన కూడా కొన్ని పక్షుల గూళ్ళవలె పీచుతో నల్లబడిన అరలు కలిగి యందు పెక్కు గింజలు ఉండును.

బీరలో రకములు మార్చు

గుమ్మడి కుటుంబమునకు చెందినది. బీరతీగ గుమ్మడి కుటుంబము లోని జాతులలో విస్తరణమున మధ్యమము. నులితీగలు 2 - 5 శాఖలు కలిగి యుండును. ఆకును 5 - 7 కోణములు లేక స్పష్టమగు తమ్మెలు గలిగి ఆయారకములలో మధ్యమ పరిమాణము కలిగి కానీ పెద్దవిగా కానీ యుండును. మగ పూవులు గుత్తులుగ బయలుదేరును. ఇందు 5 తమ్మెలుగల పుష్పకోశమును, ఐదు పసిమి రంగుగల రక్షతపత్రములు ఉండును. కింజల్కములు మూడు. ఆడు పూవున కూడా పుష్పకోశమును, దళవలయమును, మగపూవునందువలెనే యుండును. ఇవి ఉచ్చములు, అనగా అండాశయముపై నమరియుండును. కీలము మూడు అగ్రములు కలిగి కురుచగ ఉండును. మూడు మానమాత్రపు కింజల్కములు కూడా నుండును. బీర పూవులు సాయంకాలము 5 - 6 గంటల మధ్య విడచును. కాయలలో పొడవు 10 - 60 సెం.మీ ఉండును. లావు 2.5 - 3. 5 సెం.మీ ఉండును. పైన స్ఫుటమయిన కోణములు తేరి డోరియాలు కలిగి ఉంండును. సామాన్యముగా ఈ కోణములు పది యుండును. కాయ ఎండిన వెనుక పై చర్మము పీచుకట్టుటయే కాక లోన కూడా కొన్ని పక్షుల గూళ్ళవలె పీచుతో నల్లబడిన అరలు కలిగి యందు పెక్కు గింజలు ఉండును. రకములు పందిరి బీర : దీనినే పెద్ద బీర, పొడవు బీర అని అంటారు. ఇవి చాలా పొడవు పెరుగును, అనగా సుమారుగా 20-30 సెం.మీ పెరుగును, అనుకూల పరిస్థితులలో అవి 60 సెం.మీ వరకూ పెరుగును. పందిరి ఎక్కించుటవల్ల వీనిని పందిరి బీఋఅ అని అంటారు. పొట్టి బీర : ఇవి 12-20 సెం.మీ వరకు పెరుగును. కానీ ఇది లావుగా ఉండును. నేతి బీర : ఇది బీర జాతిలలో ఒక ప్రత్యేక జాతి, తీగ సామాన్యముగా బీర జాతికన్నా మోటుగా పెరుగును. తరచు స్వతస్సిద్ధముగా పుట్టి చెట్ల మీద ప్రాకుచుండును. ఆకులు గుండ్రముగా ఐదు తమ్మెలేర్పడియుండును. పూవులు పెద్దవి. పసుపు పచ్చగా ఉండును. మగ పూవులలో కింజల్కములు ఇతర జాతులలోవలె ఉండును. నాలుగు నుండి ఐదు సెంమీ. వరకు లావు అవును. నునుపుగా ఉండును. కానీ సామాన్యపు బీరలోవలెనే పది కోణముల ఆనవాళ్ళూ మాత్రము కనపడును.ఇది అంత రుచికరముగా ఉండదు, కానీ చూడటానికి మాత్రము బహు రమ్యముగా ఉంటుంది. నేతి బీరలోని నేతి చందముగా అని ఓ సామెత ఉంది కదా మనకు. గుత్తిబీర : ఈ బీరకాయలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి.

వైద్యపరమైన ఉపయోగాలు : మార్చు

 
బీరకాయ పప్పు

బీర పాదు ఆకులు మెత్తగా నూరి, రసం తీసి కళ్లలో వేస్తే కళ్ల మంటలు, కంజెక్టివైటిస్ తగ్గుతుంది. బీరకాయ సులువుగా జీర్ణమవుతుంది. విరేచన కారి కూడా. అందువల్లనే పథ్యంగా బీరకాయ చాలామంచిది. బీరకాయ అరుచిని కూడా పొగొడుతుంది. లేత బీరపొట్టు వేపుడు జ్వరం పడి లేచిన వారికి హితవుగా వుంటుంది. కలువ గింజలకు చలువ చేసే గుణం ఉంది. వీటిని పచ్చివిగా కానీ, కూరగా కాని చేసకుని తీసుకోవచ్చు. నెలసరి నొప్పితో బాధపడేవారు పుదీనా ఆకులను నీళ్లలో వేసి మరిగించి, వడకట్టి, ఆ నీటిని సేవించడం వల్ల ఫలితం వుంటుంది. అదే విధంగా పుదీనా ఆకులు, ఉప్పు కలిపి, నీటిలో మరిగించి, ఆ ఆవిరి పడితే గొంతు మృదువుగా మారుతుంది. ఉసిరి పచ్చడి, తేనెలో నానపెట్టిన ఉసిరి నిత్యం పద్ధతి ప్రకారం సేవిస్తే, దృష్టిలోపం తగ్గుతుంది. ఉసిరి పొడిని, నిత్యం పరకడుపున తేనెతో కలిపి సేవించడం మంచిది. దీని వల్ల వత్తిడి, అలసట తగ్గుతుంది. వేసవిలో ఎండు ద్రాక్షలు, లేదా కిస్‌మిస్‌లు వాడడం మంచిది. వీటికి చలువ చేసే గుణం ఉంది. గ్లాసుడు నీళ్లలో ఎండు ద్రాక్షలు వేసి, నానపెట్టి, ఆ నీటిని తీసుకుంటే, వడదెబ్బ నుంచి రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఇది చాలా మంచిది. సీతాఫలం విత్తనాలు, ఆకులు మెత్తగా నూరి పట్టిస్తే, పేలు పోతాయి. అరటిపండు, తేనెతో కలిపి తీసుకంటే క్షయవ్యాధిగ్రస్తులకు మంచిది. నేరేడు ఆకులు నీటిలో మరిగించి, వడగట్టి, ఆ నీటిని పుక్కిలిస్తే నోటిపూతలు తగ్గుతాయి. రెండు, మూడు రోజుల పాటు రెండు మిరియాల గింజలు, మెలమెల్లగా నములుతూ, ఆ రసం మింగితే దగ్గు తగ్గుతుంది. గోధుమలు, బియ్యం, పెసలు, రాగులు, సోయాగింజలు, జొన్నలు అరకిలో వంతున కలిపి, 50 గ్రాముల నువ్వులు, 20 గ్రాముల జీలకర్ర జోడించి, దోరగా విడివిడిగా వేయించాలి. ఆపై మరపట్టించి రొట్టెలు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పిండితో జావ కూడా చేసుకోవచ్చు. వేప చెట్టు బెరడును పెనంపై బాగా కాల్చి, మెత్తగా పొడి చేయాలి. ఆ పొడికి కొద్దిగా కొబ్బరి నూనె చేర్చి, కురుపులపై రాస్తే ఉపశమనం వుంటుంది. వేపాకు రసం, దానికి సమాన భాగంలో పెరుగు జోడించి, కాస్త నిమ్మరసం కలిపి తలకు పట్టిస్తే చుండ్రు తగ్గుతుంది.

రకములు మార్చు

 
బీరకాయ పీచు

పందిరి బీర మార్చు

దీనినే పెద్ద బీర, పొడవు బీర అని అంటారు. ఇవి చాలా పొడవు పెరుగును, అనగా సుమారుగా 20-30 సెం.మీ పెరుగును, అనుకూల పరిస్థితులలో అవి 60 సెం.మీ వరకూ పెరుగును. పందిరి ఎక్కించుటవల్ల వీనిని పందిరి బీర అని అంటారు.

 
బీరకాయలు., పాకాల సంతలో)

పొట్టి బీర మార్చు

ఇవి 12-20 సెం.మీ వరకు పెరుగును. కానీ ఇది లావుగా ఉండును.

నేతి బీర మార్చు

ఇది బీర జాతిలలో ఒక ప్రత్యేక జాతి, తీగ సామాన్యముగా బీర జాతికన్నా మోటుగా పెరుగును. తరచు స్వతస్సిద్ధముగా పుట్టి చెట్ల మీద ప్రాకుచుండును. ఆకులు గుండ్రముగా ఐదు తమ్మెలేర్పడియుండును. పూవులు పెద్దవి. పసుపు పచ్చగా ఉండును. మగ పూవులలో కింజల్కములు ఇతర జాతులలోవలె ఉండును. నాలుగు నుండి ఐదు సెంమీ. వరకు లావు గానూ, నునుపుగా ఉండును. కానీ సామాన్యపు బీరలోవలెనే పది కోణముల ఆనవాళ్ళూ మాత్రము కనపడును. ఇది అంత రుచికరముగా ఉండదు, కానీ చూడటానికి మాత్రము బహు అందముగా ఉంటుంది. నేతి బీరలోని నేతి చందముగా అని ఓ సామెత ఉంది కదా మనకు.

గుత్తిబీర మార్చు

సాగు చేయు విధము మార్చు

బీరపాదులు వర్షాకాలమున బాగుగా పెరిగి కాయును. కానీ వర్షాకాలమున హెచ్చుగా వర్షాలు వచ్చినచో ఈ పాదులు చెడిపోవును. తొలకరి మొదలకొని వర్షాకాలము ముగియువరకు ఈ పాదులు పెట్టుచుండవచ్చును. బీరపాదులన్ని విధముల నేలలోను సులభముగా పెరుగును, కానీ యిసుక పొడి నెలలలో తగినంత సత్తువ జేసిన కానీ పెరగవు

విశేషములు మార్చు

  • తెలుగు దేశములో సారా సీసాలు బీర కాయలులా ఉండుటవల్ల వాటిని బీర కాయ అని ముద్దుగా రహస్యముగా పిలుచుట ఉంది.
  • అమెరికాలో, తెలుగు వారిలో, బీరకాయ అంటే బీరు సీసా (సారా వేరు, బీరు వేరు) అని ముద్దు పేరు.
  • దోసకాయలలో లాగ బీర కాయలలో కూడా కొన్ని బీరకాయలు కొంచెం చేదుగా వుంటాయి. అందుకని కోసేముందు ఒక చిన్న ముక్కను నోట్లో వేసుకుని రుచి చూచి వండుకుంటారు.

మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=బీరకాయ&oldid=2987155" నుండి వెలికితీశారు