కురవి వీరభద్రస్వామి దేవాలయం

(కురవి వీరభద్రస్వామి దేవాలయము నుండి దారిమార్పు చెందింది)

మహబూబాబాదు జిల్లా,కురవి గ్రామ పంచాయితీ పరిధిలో ఈ దేవాలయం ఉంది. సకల శక్తిమూర్తి, వరప్రదాత అయిన శ్రీ వీరభద్రస్వామి శ్రీ భద్రకాళి సమేతంగా కొలువుండటం వల్ల ఈ ఆలయాన్ని 'శ్రీ వీరభద్రేశ్వరాలయం'గా కూడా పిలుస్తారు.

కురవి వీరభద్రస్వామి దేవాలయము
కురవి వీరభద్రస్వామి ఆలయ ముఖద్వారం
కురవి వీరభద్రస్వామి ఆలయ ముఖద్వారం
కురవి వీరభద్రస్వామి దేవాలయము is located in Telangana
కురవి వీరభద్రస్వామి దేవాలయము
కురవి వీరభద్రస్వామి దేవాలయము
తెలంగాణ లో ప్రాంతం
భౌగోళికాంశాలు :17°32′43″N 80°01′42″E / 17.545189°N 80.028419°E / 17.545189; 80.028419
పేరు
ప్రధాన పేరు :కురవి వీరభద్రస్వామి దేవాలయము
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:మహబూబాబాదు
ప్రదేశం:కురవి గ్రామం.
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:వీరభద్రేశ్వర స్వామి
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :కాకతీయ, చాళుక్య; హిందూ

ఆలయ చరిత్ర

మార్చు

వేంగి రాజధానిగా ఆంధ్రదేశాన్ని పాలించిన రోజుల్లో రాష్ట్రకూటులచేత పరాజితుడైన భీమరాజు కురవి నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్న కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. నాటి వేంగి చాళుక్యుల తర్వాత తొలి కాకతీయ రాజైన ఒకటో బేతరాజు ఈ ఆలయాన్ని పునరుద్దరించారు.

ఆలయ నిర్మాణం

మార్చు

కురవి దేవాలయం అష్టాదశ స్తంభాల మహామండపంతో మూడు గర్భాలయాలతో విస్తరించి ఉంది. ఈ ఆలయంలో శిల్పకళ ఉట్టిపడుతోంది. గర్భగుడిలో మూలవిరాట్ వీరభద్రస్వామి త్రినేత్రుడై దశహస్తాలతో దౌర్రరూపంగా ఉండటం విశేషం. స్వామివారి నోటికిరువైపులా రెండు కోరలు, పాదాల చెంత నందీశ్వరుడి విగ్రహం ఉండగా ఎడమవైపు శ్రీ భద్రకాళి అమ్మవారి విగ్రహం ఉంటుంది.

ప్రతియేటా మహాశివరాత్రి నాడు జాతర ప్రారంభమై ఉగాదికి ముగుస్తుంది. ఈ కాలంలో వివిధ ప్రాంతాల నుండి దాదాపు పదిహేను లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. శివరాత్రి పర్వదినం తర్వాతి రోజు తెల్లవారజామున స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ జాతరను తెలంగాణలో మేడారం జాతర తర్వాత అతి ఎక్కువ మంది భక్తులు హాజరయ్యే గిరిజన జాతరగా పరిగణిస్తారు.

చిత్రమాలిక

మార్చు
 
ఆలయంలోని నంది
 
ఆలయంలోని విమాన భద్రుడు

మూలాలు

మార్చు

ఇతర లింకులు

మార్చు