కులాంతర వివాహం
వధూవరులు ఒకేమతంలోని వేరు వేరు కులాలకు చెందిన వారైతే, వారి వివాహాన్ని కులాంతర వివాహము అంటారు. వధూవరులు వేరు వేరు మతాలకు చెందిన వారైతే, వారి వివాహాన్ని మతాంతర వివాహము అంటారు.
పరిచయం
మార్చుసాంప్రదాయక భారతీయ కుటుంబాలలో కులాంతర వివాహాలను ప్రోత్సహించరు. మతాంతర వివాహాలకు అసలు ఒప్పుకోరు. అయితే ప్రతికాలంలోనూ కొంతమంది అభ్యుదయవాదులు, మానవతావాదులు, హేతువాదులు ఇటువంటి ఆదర్శ వివాహాలు చేసుకుంటున్నారు. ప్రస్తుత భారతీయ సమాజంలో మరింత హెచ్చుసంఖ్యలో కులాంతర వివాహాలు జరుగుతున్నా, జనబాహుళ్యపు ఆమోదాన్ని చూరగొనలేదు.
కారణాలు 1. ఒక కులం లేదా మతం మనుషులు మరొక కులం వారి కంటే ఎక్కువ తక్కువని అనుకోవటం 2. మనుషులందరు సమానులు కాదనుకోవటం 3.అంటరానితనాన్ని పాటించటం...లాంటివి. ప్రభుత్వం కులాంతర మతాంతర వివాహాలకు ప్రోత్సాహకాలనిస్తోంది. రిజర్వేషన్ల కోసం కులపోరాటాలు తగ్గాలంటే మరింత హెచ్చుసంఖ్యలో కులాంతర వివాహాలు జరగాలి. ప్రస్తుతం ప్రభుత్వం కులాంతర మతాంతర వివాహాలకు ఇచ్చేప్రోత్సాహక మొత్తాన్ని 25000 నుండి 50000 రూపాయలకు పెంచాలని నిర్ణయించినట్లు కేంద్ర సామాజిక న్యాయశాఖా మంత్రి మీరాకుమార్ చేప్పారు. బీజం క్షేత్రం ఏది ముఖ్యం ?: తండ్రి ఏ మతానికి లేదా కులానికి చెందుతాడో పిల్లలు కూడా అదే మతానికి లేదా కులానికి చెందేది బీజప్రధానసాంప్రదాయం. తల్లి ఏ మతానికి లేదా కులానికి చెందుతుందో పిల్లలు కూడా అదే మతానికి లేదా కులానికి చెందేది క్షేత్రప్రధానసాంప్రదాయం.
- ఇటీవల పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కుల మతాల అడ్డుగోడలను ప్రేమ సమ్మెటతో బద్దలుకొట్టారు. తమ పిల్లల ప్రేమకు పట్టంకట్టారు. వారిలో ఇద్దరు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు .జన్నత్ హుస్సేన్ సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి. ఆయన కుమారుడు ప్రేమించింది ఓ బ్రాహ్మణ అమ్మాయిని. వీరిద్దరి ప్రేమను పెద్దలు ఆశీర్వదించారు. సీఎం ఆఫీసులో స్పెషల్ కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి. ఆయన కూతురు అమెరికాలో చదువుతూ కమ్మ వర్గానికి చెందిన యువకుడిని ప్రేమించింది.వాళ్ల పెద్దలు పెళ్ళికి అభ్యంతర పెట్టలేదు.జీఏడీలో పొలిటికల్ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న ఆర్ఎం గోనెల కాపు వర్గానికి చెందిన వారు. ఆయన కూతురు ఒక ముస్లిం యువకుడిని ప్రేమించింది. అటువైపు, ఇటువైపు పెద్దలు వీరి ప్రేమకు 'జై' కొట్టారు. యువజన, క్రీడల శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న ఏకే ఫరీడా ఒరిస్సాకు చెందిన అగ్ర కులస్థుడు. మదన్‌లాల్ అనే ఐపీఎస్ అధికారి ఎస్సీ వర్గానికి చెందిన వారు. ఫరీడా కూతురు, మదన్‌లాల్ కుమారుడు ప్రేమించుకున్నారు. వీరి పెళ్ళి పెద్దల ఆమోదంతోనే జరిగింది.[1]
కులాంతర,మతాంతర వివాహాలకు ప్రోత్సాహకాలు
మార్చుకులాంతర, మతాంతర వివా హాలు చేసుకున్న వారికి ప్రభుత్వం కొన్ని ప్రోత్సాహకాలను, రాయితీలను ప్రకటించింది. ఇందుకు సంబంధిం చిన దరఖా స్తుఫారాలు సంక్షేమ శాఖ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయి.కులాంతర వివాహం చేసుకున్న జంటలో ఎవరో ఒకరు కచ్చితంగా షెడ్యూల్డు కులాల కు, వెనుకబడిన తరగతులకు చెందిన వారై ఉండాలి.మతాంతర వివాహాలైతే రెండు భిన్న మతా లకు చెందిన వారి మధ్య వివాహం జరగాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్ల మధ్య జరిగే వివా హాన్ని మతాంతర వివాహాంగానే గుర్తించారు. భార్యా భర్తల్లో ఏ ఒక్క రైనా షెడ్యూల్డు కులాలకు చెంది ఉండాల్సిన అవసరం లేదు. ప్రోత్సాహక బహుమతిని వస్తు రూపంలో (గృహో పకరణాలు, తదితరాలు) రాయితీలను సబ్సిడీ, మార్జిన్ మనీ, నగదుగా రూ.25వేల వరకు మొత్తం ఇస్తారు. రిజిస్ట్రార్ కార్యాలయం కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న జంటలకు వివాహ పత్రం జారీ చేస్తుంది. జంటల కులాలను పేర్కొంటూ వివాహపత్రం జారీ చేస్తా రు. దీని ఆధారంగా కలెక్టర్ ప్రోత్సా హకాలను రాయితీలను అంద జేస్తారు.కులాంతర వివాహం చేసుకున్న జంటల పిల్లలకు ఉపకార వేతనాలు, ఇతర విద్యాసంబంధ రాయితీలు, హాస్టల్ వసతులు కల్పిస్తారు. (జీవో నెం.583, సాంఘిక సంక్షేమశాఖ తేదీ 24.7.1974), 15.7.1974 గానీ, ఆ తరు వాత గానీ వివాహం చేసుకున్న వారే అర్హులు. కులాంతర వివాహం చేసుకున్న వారి పిల్లల కులాన్ని ప్రభుత్వం విచా రణ జరిపి నిర్ధారించిన మీదట అర్హులుగా ప్రకటిస్తారు. అంతే కానీ ఇరువురి కులాల్లో ఒక కులాన్ని వారి పిల్లలకు వెంటనే వర్తింపచేయరు. ఒకసారి కులాంతర, మతాంతర వివాహం చేసుకుని ప్రభుత్వ పోత్సా హకాలు, రాయితీలు పొందిన వారు, జంటలో ఎవరైనా రెండవసారి (ఒకరు విడిపోయినా, చని పోయినా) కులాం తర మతాంతర వివాహం చేసు కుంటే వారు ప్రభుత్వ ప్రోత్సాహకాలకు అనర్హులు. కుల మతాలు లేవంటూనే కులాలపరంగా మతాల పరంగా మనుషులను విడదీస్తూ రాజకీయ నాయకులు రాజకీయం చేస్తున్నారు. ఆదర్శ జంటలకు ప్రోత్సాహకం అంటున్న మన ప్రభుత్వాలు ఆదర్శ జంటలకు చేయి అందించి అభివృద్ధి పరచడంలో చాలా చాలా వెనుకబడి ఉన్నాయి. జన్మించిన పిల్లలకు ఏ కులం వర్తిస్తుంది అన్న డైలమాలో పడ్డారు ఆదర్శ దంపతులు.
భారత దేశంలో కొందరు ప్రముఖ కులాంతర మతాంతర వివాహితుల జాబితా
మార్చు- సరోజినీ దేవి చటోపాధ్యాయ (బెంగాలీ బ్రాహ్మణ) -డా.గోవిందరాజులు నాయుడు (ఆంధ్రుడు),
- మొగలాయి చక్రవర్తి అక్బరు (ముస్లిం) - రాజపుత్రులు
- ఇందిరా గాంధీ (కాశ్మీరీ బ్రాహ్మణ్) - ఫిరోజ్ గాంధీ (జొరాస్ట్రియన్)
- రాజీవ్ గాంధీ - సోనియా గాంధీ (ఇటలీ వనిత)
- డా.లక్ష్మి సలీం
- టైగర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి (క్రికెటర్-ముస్లిం) - షర్మిలా టాగోర్ (హిందీ సినీనటి)
- సునీల్ దత్ (హిందీ నటుడు-హిందువు) - నర్గిస్ దత్ (హిందీ నటి-ముస్లిం)
- ఆసిఫ్ అలీ - అరుణా అలీ (పూర్వ కాంగ్రెసు నాయకులు)
- కె.యల్.మెహతా- ఐ యఫ్ యస్ - నవాబ్ జాది ఆఫ్ హైదరాబాదు
- షారుక్ ఖాన్ (నటుడు-ముస్లిం) - గౌరి ( నటి-హిందువు )
- హృతిక్ రోషన్ (హిందీ నటుడు -హిందువు) - సుజానే ఖాన్ (హిందీనటుడు సంజయ్ ఖాన్ కూతురు - షియా ముస్లిం)
- జ్యొత్స్న - ఇలియాస్ జంట ( వార్తా చదువరులు )
- అజహరుద్దీన్ (క్రికెటర్-ముస్లిం) - సంగీతా బిజిలాని (హిందీ నటి-హిందువు) (ద్వితీయ వివాహము)
- జాకీష్రాఫ్ - ఆయేషా దత్
- సునీల్ శెట్టి - మనా ఖాద్రి
- సలీం ఖాన్ - హెలెన్ (ద్వితీయ వివాహము)
- రాజ్ బబ్బర్ - నాదిరా బబ్బర్
- నటి ఇలియానా తల్లి (ముస్లిం) తండ్రి (క్రిస్టియన్)
- అమీర్ ఖాన్- కిరణ్ రావ్ (ద్వితీయ వివాహము)
- సంజయ్ దత్ (హిందువు) - మాన్యత (, ముస్లిమ్) (ద్వితీయ వివాహము)