కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ

2015లో ఆర్. చంద్రు దర్శకత్వంలో విడుదలైన తెలుగు చలనచిత్రం.

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 2015, జూన్ 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీధర్ లగడపాటి[1][2] నిర్మాణ సారథ్యంలో ఆర్. చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుధీర్ బాబు, నందిత రాజ్ నటించగా హరి సంగీతం అందించాడు.[3] ఈ చిత్రంలోని పాటలను బండారు దానయ్య కవి రాశాడు. 2013లో కన్నడంలో చంద్రు దర్శకత్వం వహించిన చార్మినార్ చిత్రానికి రీమేక్ ఇది, ఒడియా వెర్షన్ గపా హెలే బి సాతా ఈ చిత్రానికి వారంరోజుల ముందు విడుదలైంది.

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ
దర్శకత్వంఆర్. చంద్రు
రచనసాయినాథ్ తోటపల్లి
కథఆర్. చంద్రు
నిర్మాతశ్రీధర్ లగడపాటి
తారాగణంసుధీర్ బాబు, నందిత రాజ్
ఛాయాగ్రహణంకె.ఎస్. చంద్రశేఖన్
కూర్పురమేష్ కొల్లూరి
సంగీతంహరి
పంపిణీదార్లురామలక్ష్మీ సినీ క్రియేషన్స్
విడుదల తేదీ
19 జూన్ 2015
దేశంభారతదేశం
భాషతెలుగు

ప్రతిష్ఠాత్మక జైపూర్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి పోటీకి ఎంపికయింది. ఈ చిత్రోత్సవానికి ప్రపంచవ్యాప్త సినిమాలు పోటి పడ్డాయి.[4][5] జైపూర్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో బెస్ట్ రొమంటిక్ సినిమా విభాగంలో పురస్కారాన్ని కూడా గెలుచుకుంది.[6][7][8]

కథానేపథ్యం

మార్చు

కృష్ణా నది ఒడ్డునున్న కృష్ణాపురం పల్లెటూరులో పుట్టి పెరిగిన కృష్ణ (సుధీర్ బాబు) ఇంజనీరింగ్ చదివి అమెరికాలో సెటిల్ అవుతాడు. ఒక రోజు పేపర్లో కృష్ణ ఫోటో చూసిన అతని చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరినీ ఒకచోట చేర్చి ఒక ఫంక్షన్ చేయాలనుకొని,అమెరికాలో వున్న కృష్ణకి ఫోన్ చేస్తారు. అమెరికా నుండి ఇండియా వచ్చిన కృష్ణ, కారులో వస్తున్న సమయంలో తన గత జ్ఞాపకాలలోకి వెళ్తాడు. తనని చదివించడం ఇష్టంలేని తండ్రి గొర్రెలు కాసుకుంటూ వుండమని చెప్తుంటాడు. అదేసమయంలో తమ స్కూల్లో, తమ క్లాస్లో రాధ అనే అమ్మాయి చేరుతుంది. రాధ అంటే ఇష్టం ఏర్పడిన కృష్ణ తనే లోకంగా ఊహించుకుంటాడు. చదువంటే ఇంట్రెస్ట్ లేని కృష్ణ, రాధ పరిచయంతో, ఆమె ఇన్స్పిరేషన్ వల్ల ఇంటర్ వరకు వస్తాడు.కృష్ణ ఒకరోజు ప్రేమలేఖ రాసి రాధకు అందేలా ప్లాన్ చేస్తాడు. కానీ, అది రాధ తల్లికి, ఆమె నుంచి కాలేజ్ ప్రిన్సిపాల్ (పోసాని)కి చేరుతుంది. రాధకి కృష్ణ మీద ప్రేమ వుందా? లేదా? అనే విషయాన్ని తేల్చేందుకు కృష్ణను చాటుగా వుండమని రాధని అడుగుతాడు. సి.ఎ. చెయ్యడం తన జీవితాశయమని, తనకి తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ తప్ప మరేదీ తెలీదని చెప్తుంది. అప్పుడు కృష్ణని జీవితం అంటే ఏమిటి అనే విషయంలో ఎడ్యుకేట్ చేస్తాడు. ఆ తర్వాత రాధకు దూరమవుతాడు కృష్ణ. రాధకు దూరమవ్వాలన్న నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? మళ్ళీ రాధకు తన ప్రేమ గురించి చెప్పే ప్రయత్నం చేశాడా? రాధ నిజంగానే కృష్ణని ప్రేమించలేదా? ఆ తర్వాత కృష్ణ జీవితంలో జరిగిన సంఘటనలు ఏమిటి? రాధ తను అనుకున్నట్టు సి.ఎ. చేసిందా? చివరికి కృష్ణ ప్రేమ ఫలించిందా? అనేది మిగతా కథ.

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
 • కథ, దర్శకత్వం: ఆర్. చంద్రు
 • నిర్మాత: శ్రీధర్ లగడపాటి
 • రచన: సాయినాథ్ తోటపల్లి
 • సంగీతం: హరి
 • ఛాయాగ్రహణం: కె.ఎస్. చంద్రశేఖన్
 • కూర్పు: రమేష్ కొల్లూరి
 • పంపిణీదారు: రామలక్ష్మీ సినీ క్రియేషన్స్

పాటలు

మార్చు
 1. వీలుంటే (నకుల్ అభ్యంకర్)
 2. రాధే రాధే (హరిచరణ్)
 3. ఓలా ఓలా (హరి, హేమచంద్ర)
 4. మధన మోహన (ప్రణవి, ఎస్. పి. చరణ్)
 5. తూహి తూహి (హరిచరణ్, సునీల్ కష్యప్, లిప్సిక)
 6. నా రాధ తొలిసారి (కార్తీక్)
 7. నాలో ప్రేమే (హరి)

నిర్మాణం

మార్చు

లగడపాటి శ్రీధర్, కన్నడ చిత్రం చార్మినార్ను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాడు.[10] కన్నడ సినిమా దర్శకుడు చంద్రు, సంగీత దర్శకుడు హరి ఈ సినిమాతో తెలుగు చిత్రాలలో తొలిసారిగా అడుగుపెట్టారు. 2013లో ప్రేమకథా చిత్రమ్ సినిమాలో నటించిన సుధీర్ బాబు, నందిత ఈ సినిమాలో జంటగా నటించారు. తెలుగు వెర్షన్‌లో కృష్ణా నదికి తగినట్లుగా ఈ చిత్రాన్ని రూపొందించారు.[11]

మూలాలు

మార్చు
 1. http://dff.nic.in/writereaddata/wbst.pdf
 2. Krishnamma Kalipindi Iddarini Review http://www.aptoday.com/moviereviews/krishnamma-kalipindi-iddarini-review/128/ Archived 2018-10-19 at the Wayback Machine
 3. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (5 July 2015). "మూడోవారంలోకి అడుగుపెట్టిన 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ'!". www.andhrajyothy.com. Archived from the original on 17 మార్చి 2020. Retrieved 17 March 2020.
 4. "Krishnamma selected for Jaipur Film festival-Latest Te". Archived from the original on 6 జనవరి 2016. Retrieved 17 March 2020.
 5. iQlik Movies. "KKI @ Jaipur International Film Festival". iQlikmovies. Retrieved 17 March 2020.
 6. "JIFF - Jaipur International Film Festival". Retrieved 17 March 2020.
 7. Varun P. "Telugu Cinema Gets Rare Honour". Archived from the original on 10 మార్చి 2016. Retrieved 17 March 2020.
 8. "Dasari felicitates KKI team for winning JIFF award". ap7am.com. Archived from the original on 17 మార్చి 2020. Retrieved 17 March 2020.
 9. "Krishnamma Kalipindi Iddarini review by jeevi - Telugu cinema review - Sudheer Babu & Nanditha". Archived from the original on 2019-12-03. Retrieved 2020-03-18.
 10. "Sudheer Babu, Nanditha's next titled Krishnamma Kalipindi Iddarini?". The Times of India. Retrieved 18 March 2020.
 11. "Interview with Lagadapati Sridhar about Krishnamma Kalipindi Iddarinee - Telugu cinema actor". Archived from the original on 15 డిసెంబరు 2019. Retrieved 18 March 2020.

ఇతర లంకెలు

మార్చు