కృష్ణవేణి (సినిమా)

ా 1974: కృష్ణవేణి చిత్రాన్ని గోపీకృష్ణ మూవీస్ పతాకంపై , వి.మధుసూదనరావు దర్శకత్వంలో నిర్మించారు. ఈచిత్రంలో కృష్ణంరాజు, వాణిశ్రీ, బాలయ్య, రాజబాబు , రమాప్రభ మున్నగు వారు నటించారు. ఈ చిత్రానికి సంగీతం విజయ భాస్కర్ అందించారు. కన్నడ చిత్రం శరపంజర కు తెలుగు రీమేక్ .

ఇదే పేరుగల ఇతర వ్యాసాలకోసం అయోమయ నివృత్తి పేజీ కృష్ణవేణి చూడండి.

కృష్ణ వేణి
(1974 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.మధుసూదనరావు
నిర్మాణం హరిరామ జోగయ్య,
చలసాని గోపి
రచన శ్రావణి (మూల కన్నడ కథ రచయిత్రి త్రివేణి)
తారాగణం కృష్ణంరాజు,
వాణిశ్రీ,
బాలయ్య,
రాజబాబు,
రమాప్రభ,
నిర్మలమ్మ
సంగీతం విజయ భాస్కర్
నేపథ్య గానం వి.రామకృష్ణ, పి.సుశీల
గీతరచన ఆరుద్ర, కొసరాజు
కూర్పు మార్తాండ్
నిర్మాణ సంస్థ గోపీకృష్ణ మూవీస్
(నరేంద్ర ఇంటర్నేషనల్?)
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కృష్ణవేణి, 1974లో విడుదలైన ఒక తెలుగు సినిమా. హిస్టీరియా వ్యాధి బారిన పడిన ఒక యువతి, అందువలన ఆమె కుటుంబంలోని సభ్యులకు ఎదురైన సమస్యలు ఈ సినిమా కథాంశాలు. ఈ చిత్రానికి ప్రేక్షకులనుండి, సమీక్షకులనుండి మంచి స్పందన లభించింది. ఇది 1971లో విడుదలైన శరపంజర అనే కన్నడ సినిమాకు పునర్నిర్మాణం.[1]

కృష్ణవేణి తన భర్త (కృష్ణంరాజు), పిల్లలతో హాయిగా సంసారం చేసుకొంటున్న యువతి. ఆమె కుటుంబంతో విహారయాత్రకు వెళ్లినపుడు అక్కడ ఆమె బాల్యానికి చెందిన చేదు అనుభవాలు ఆమె మనసులో మేలుకొంటాయి. క్రమంగా ఆమెలో భయం, భ్రమలు, ఇతర మానసిక సమస్యలు చోటుచేసుకొంటాయి. ఆమె ద్విగుణ మనస్తత్వం (హిస్టీరియా)తో బాధ పడుతున్నదని డాక్టర్లు చెబుతారు. అక్కడినుండి ఆమెకు, కుటుంబ సభ్యులకు అనేక సమస్యలు ఎదురౌతాయి. ఆమెలోని సాధారణమైన ప్రవర్తనను కూడా ఇతరులు రోగలక్షణంగా పరిగణించడం మొదలు పెడతారు. క్రమంగా ఆమె ఆసుపత్రిపాలౌతుంది.

పాటలు

మార్చు
పాట రచయిత సంగీతం గాయకులు
సంగీతం మధుర సంగీతం తల్లీపిల్లల హృదయ సంకేతం ఆరుద్ర విజయభాస్కర్ పి.సుశీల
కృష్ణవేణీ తెలుగింటి విరిగింటి విరిబోణీ విజయభాస్కర్ వి.రామకృష్ణ, పి.సుశీల
శ్రీశైల మల్లయ్య దైవమే నీవయ్య కొసరాజు విజయభాస్కర్ పి.సుశీల
  1. ఎందుకో నువ్వు నాతొ ఉన్నవేళ ఇంత హాయ్ ఇంత - రామకృష్ణ, పి. సుశీల - రచన: దాశరథి
  2. కృష్ణవేణి తెలుగింటి విరిబోణి కృష్ణవేణి నాయింటి - పి. సుశీల, రామకృష్ణ బృందం - రచన: డా. సినారె
  3. పదునాలుగేండ్లు వనవాసమేగి మరలి వచ్చెను సీత - పి. సుశీల - రచన: దాశరథి
  4. శ్రీశైల మల్లయ్యా దైవేమే నీవయ్యా శ్రీ బ్రమరాంబతో - పి. సుశీల బృందం - రచన: కొసరాజు
  5. సంగీతం మధుర సంగీతం తల్లి పిల్లల హృదయ - పి. సుశీల - రచన: ఆరుద్ర

మూలాలు

మార్చు
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-08-25. Retrieved 2009-08-21.