చలసాని గోపి చలనచిత్ర నిర్మాత. ఇతడు 1944, ఏప్రిల్ 15న కృష్ణా జిల్లా, పామర్రు మండలానికి చెందిన పెదమద్దాలి గ్రామంలో జన్మించాడు.

చలసాని గోపి

సినిమా రంగంసవరించు

ఇతడు వెంకటేశ్వర వైభవం చిత్రంలో భాగస్వామిగా సినీ నిర్మాణరంగంలోకి ప్రవేశించాడు. ప్రయోగాత్మక చిత్రాల నిర్మాతగా ప్రసిద్ధి చెందాడు.అతను గోపీ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై చిత్రాలనునిర్మించాడు.[1]

ఇతడు నిర్మించిన సినిమాలు:

  1. కృష్ణవేణి - 1974
  2. చిలకమ్మ చెప్పింది - 1977
  3. కుక్క కాటుకు చెప్పు దెబ్బ - 1979
  4. గజదొంగ - 1981
  5. దొంగ రాముడు - 1988
  6. చిన్న అల్లుడు - 1993
  7. దొంగా పోలీస్ - 1992
  8. అడవి దొంగ - 1985
  9. కుర్రాడు బాబోయ్ - 1995

మూత్రపిండాల పనిచేయకపోవడం వల్ల 2003 ఆగస్టు 23 న మరణించాడు. అసోసియేట్ నిర్మాతగా 'శ్రీ వెంకటేశ్వర మహాత్యం' తో కెరీర్ ప్రారంభించాడు. తరువాత, అతను 'గజదొంగ' (ఎన్టీఆర్) , అడవి దొంగ (చిరంజీవి) వంటి బ్లాక్ బాస్టర్లను నిర్మించాడు. [2]

మూలాలుసవరించు

  1. "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2020-08-25.
  2. "Telugu cinema news - idlebrain.com". www.idlebrain.com. Retrieved 2020-08-25.

బయటి లింకులుసవరించు

ఐ.ఎం.డి.బి పేజీ