కృష్ణేశ్వర రావు

నటుడు, రచయిత

కృష్ణేశ్వర రావు ఒక తెలుగు సినీ నటుడు,, రచయిత.[1] చందమామ కథలు సినిమాలో ఆయన పోషించిన బిచ్చగాడి పాత్ర మంచి ఆదరణ పొందింది.[2]

కృష్ణేశ్వర రావు
జననం
ఎల్లాప్రగడ సౌభాగ్య కృష్ణేశ్వర రావు

బోడపాడు, గుంటూరు జిల్లా
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు, రచయిత
జీవిత భాగస్వామిసరస్వతి
తల్లిదండ్రులు
  • హనుమంత రావు (తండ్రి)
  • వెంకట రామమ్మ (తల్లి)

ఆయన 1500 పైగా నాటకాలలో నటించాడు. పలు నాటకాలకు కథ, సంభాషణలు రాశాడు.[3]

వ్యక్తిగత జీవితం సవరించు

కృష్ణేశ్వర రావు గుంటూరు జిల్లా, బోడపాడు అనే గ్రామంలో హనుమంతరావు, వెంకటరావమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన అసలు పేరు ఎల్లాప్రగడ సౌభాగ్య కృష్ణేశ్వర రావు. చిన్నప్పటి నుంచే తనకు నచ్చిన రంగాన్ని ఎంచుకుని అందులో కొనసాగమని ఆయన తల్లిదండ్రులు ప్రోత్సహించారు. అలా ఆయన పాఠశాలలో చదివే రోజుల్లో నాటకాల్లో నటించడం మొదలుపెట్టాడు.

కెరీర్ సవరించు

ఆయన నటుడు జీవాకు మంచి స్నేహితుడు. అతను అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమాలో నటిస్తున్నపుడు, దర్శకుడు వంశీని కలిశాడు. వంశీ తన తరువాతి సినిమాలో అవకాశం ఇస్తామన్నాడు. అలా ఆయనకు గోపి గోపిక గోదావరి సినిమాలో అవకాశం వచ్చింది.

నటించిన సినిమాలు సవరించు

కృష్ణేశ్వర రావు భద్రాచలం, శ్రీరాములయ్య, జయం మనదేరా సినిమాలకు రచన చేశాడు. చందమామ కథలు సినిమాలో ఆయన పోషించిన బిచ్చగాడి పాత్ర మంచి ఆదరణ పొందింది. ఈ పాత్రలలో నటిస్తున్నపుడు కొంతమంది ఆయనను నిజంగా బిచ్చగాడే అనుకున్నారు. ఈ పాత్ర గురించి సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల ఆయన్ను ప్రత్యేకంగా అభినందించారు.[3]

మూలాలు సవరించు

  1. "Krishneswara Rao Biography". filmibeat.com. Archived from the original on 17 September 2016. Retrieved 17 September 2016.
  2. "Krishneswara Rao Biography". movies.dosthana.com. Archived from the original on 17 September 2016. Retrieved 17 September 2016.
  3. 3.0 3.1 "అడుక్కోడానికి వేళాపాళా లేదా అన్నాడు". sakshi.com. Jagati Publications. Retrieved 17 September 2016.
  4. "అక్టోబరు 13న యూనివర్సిటీ సినిమా విడుదల |". web.archive.org. 2023-09-24. Archived from the original on 2023-09-24. Retrieved 2023-09-24.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)