జయం మనదేరా (2000 సినిమా)

2000 సినిమా

జయం మనదేరా ఎన్. శంకర్ దర్శకత్వంలో 2000లో విడుదలైన తెలుగు చిత్రం. వెంకటేష్, భానుప్రియ, సౌందర్య ఇందులో ప్రధాన పాత్రధారులు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వం వహించాడు.

జయం మనదేరా
(2000 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎన్. శంకర్
తారాగణం వెంకటేష్,
సౌందర్య
జయప్రకాశ్ రెడ్డి
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ప్రై. లిమిటెడ్.
భాష తెలుగు

కథ మార్చు

అభిరాం (వెంకటేష్) లండన్లో ఉండే ఒక సరదా మనిషి. భారతదేశం నుంచి కోకోకోలా సంస్థ తరపున కొంత మందిని లాటరీలో ఎంపిక చేసి వారిని యూరోపు యాత్రకి పంపిస్తారు. అభిరాం వాళ్ళకి గైడుగా వ్యవహరించడానికి వస్తాడు. ఆ యాత్రీకుల బృందంలో అతనికి తన బామ్మతో పాటు వచ్చిన ఉమ (సౌందర్య) తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారుతుంది.

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

పాటలు మార్చు

  • హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చెయ్యరా, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. సోనూ నిగమ్, గోపికా పూర్ణిమ.
  • మెరిసేటి జాబిలి నువ్వే , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. కుమార్ సాను, స్వర్ణలత.
  • చిన్ని చిన్ని ఆశలన్ని చిందులేసెనే , రచన: కాళకూరి ప్రసాద్, గానం. వందేమాతరం శ్రీనివాస్.
  • డోంట్ మిస్, రచన:చంద్రబోస్ , గానం.శంకర మహదేవన్
  • హిందూస్తాన్ లో, రచన: చంద్రబోస్ , గానం.ఉదిత్ నారాయణ్, జస్పిందర్ నారుల
  • పెళ్లికి బాజా , రచన: చంద్రబోస్ , గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కవితా కృష్ణమూర్తి .
  • ఓ చూపుకే , రచన: చంద్రబోస్, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్.

మూలాలు మార్చు

బయటి లంకెలు మార్చు