చందమామ కథలు (సినిమా)

2014 సినిమా

చందమామ కథలు 2014 లో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో విడుదలైన ఒక సినిమా.[1] ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకుంది.[2]

చందమామ కథలు
చందమామ కథలు గోడపత్రిక
దర్శకత్వంప్రవీణ్ సత్తారు
రచనప్రవీణ్ సత్తారు
నిర్మాతచాణక్య భూనేటి
తారాగణంకిషోర్
మంచు లక్ష్మి
ఆమని
నరేష్
కృష్ణుడు
చైతన్య కృష్ణ
రిచా పనయ్
నాగ శౌర్య
ఛాయాగ్రహణంసురేష్ రగుటు
కూర్పుధర్మేంద్ర కాకరాల
సంగీతంమిక్కీ జె. మేయర్
నిర్మాణ
సంస్థ
ఎ వర్కింగ్ డ్రీం ప్రొడక్షన్
విడుదల తేదీ
2014 ఏప్రిల్ 25 (2014-04-25)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

ఇది ఒక ప్రయోగాత్మక చిత్రం. దీనిలో ఎనిమిది కథలున్నాయి. ఒక కథ పూర్తయి ఇంకో కథ ప్రారంభమయ్యే సంకలనం లాగాక, సమాంతర ఖండికలుగా వచ్చి పోతూంటాయి.

సారథి (కిషోర్) ఒక రచయిత. అతనికి భార్య ఒక కూతురికి జన్మనిచ్చిన తర్వాత చనిపోయి ఉంటుంది. ఆ పాపకి ఏదో జబ్బు చేస్తుంది. చికిత్స కోసం ఐదు లక్షల రూపాయలు అవసరమౌతుంది. అతను తాను చూసిన జీవితాల నుండి ఏడు కథలు రాయడం మొదలు పెడతాడు.

మొదటి కథలో బాగా లావెక్కిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి వెంకటేశ్వర్రావు (కృష్ణుడు)కి ముప్ఫై దగ్గర పడుతున్నా పెళ్ళి కావడం లేదని బెంగపడి, పెళ్ళికోసం విఫలయత్నాలు చేస్తూంటాడు.

రెండవ కథలో ఒకప్పుడు మోడల్‌గా వెలిగిన లీసా స్మిత్ (మంచు లక్ష్మి) ఇప్పుడు అవకాశాల్లేక, సహజీవనం చేస్తున్న డబ్బున్నవాడు కూడా వేరొకామెని చూసుకోవడంతో, మిడిల్ క్లాస్ ఫ్లాట్‌లో అద్దెకుంటూ తాగుడూ సిగరెట్లు మరిగి టెన్షన్‌తో గడుపుతూంటుంది.

మూడవ కథలో ఓల్డ్ సిటీలో సూపర్ మార్కెట్ నడిపే అష్రఫ్ (అభిజిత్)ని హసీనా (రిచా పనాయ్) ప్రేమలోకి దింపి, పెద్దలతో సంబంధం మాట్లాడమని ఒత్తిడి చేస్తూంటే ఇరకాటంలో పడతాడు అష్రఫ్.

నాలుగవ కథలో ఇంటర్ రెండో సంవత్సరం చదివే రఘు (నాగ శౌర్య) క్లాస్‌మేట్ అయిన రాజకీయనాయకుడి కూతురు రేణు (శామిలీ అగర్వాల్)ని కాదనలేని పరిస్థితుల్లో ఇరికించి, పెళ్ళిచేసుకుని, జీవితంలో సెటిలై పోవాలని పథకాలేస్తూంటాడు.


ఐదవ కథలో పనీపాటా లేని రఘు (కృష్ణ చైతన్య) వూళ్ళో నానమ్మ (పావలా శ్యామల) నిఘాలో వున్న ముగ్గురు మనవరాళ్ళలో గౌరీ (అమితా రావ్) అనే అమ్మాయిమీద మీద కన్నేసి, ముగ్గులోకి దింపాలని కాని పనులు చేస్తూంటాడు.

ఆరవ కథలో భార్యకి విడాకులిచ్చి వచ్చిన ఎన్నారై మోహన్ (నరేష్) అనుకోకుండా మాజీ ప్రేమికురాలు సరిత (ఆమని)ని విధవరాలిగా చూసి, కొడుకులూ కోడళ్ళూ వున్నా ఆమెతో తిరిగి స్నేహం పెంచుకునే ప్రయత్నాల్లో ఉంటాడు.

ఏడవ కథలో ఓ బిచ్చగాడు (కృష్ణేశ్వర్ రావు) పన్నెండు లక్షలు విలువజేసే ఒకింటికి ఎలాగైనా యజమాని కావాలన్న కలలతో బిచ్చ మెత్తుకుంటూ భారీ యెత్తున డబ్బు పోగేస్తూంటాడు.

ఇక చివరి కథ రచయితదే. సగంసగం కథలు రాసుకెళ్ళి ఐదు లక్షలు అర్జెంటుగా అడ్వాన్సు ఇమ్మని అడిగితే, కథలు పూర్తి చేసుకు రమ్మంటాడు ప్రచురణకర్త (సూర్య).

ఇక్కడ్నించీ తన సమస్య మళ్ళీ మొదటికొచ్చి, సగం సగం కథల్ని పూర్తి చేసే శక్తియుక్తుల్ని కూడదీసుకుని కష్టిస్తాడు సారథి. ఓ పక్క కూతురి ఆపరేషన్ దగ్గర పడుతూంటుంది. పూర్తి చేయాల్సిన ఏడు కథల్లోనూ సంఘర్షణలున్నాయి. వాటిలో సగం సుఖాంతాలు, సగం దుఖాంతాలూ ఉన్నాయి. తీరా పూర్తిచేసి ప్రచురణకర్త దగ్గరికి తీసికెళ్తే తన కథే దుఖాంతమయ్యింది! ఇప్పుడేం చేయాలి? ఆపరేషన్ కి డబ్బు ఎలా? సారథి కూతురిని ఎలా కాపాడుకున్నాడనేది మిగతా కథ[3].

పూర్వప్రయోగాలు మార్చు

ఒకే సినిమాలో రెండు లేక ఎక్కువ కథలను చూపించే ప్రయోగాలు ఈ సినిమా కంటే ముందు చాలా వచ్చాయి. 1939లో తమిళంలో తీసిన సిరిక్కథ భారతదేశంలో తీసిన మొట్టమొదటి బహుళ కథాచిత్రం.1961లో సత్యజిత్ రే బెంగాలీ భాషలో రవీంద్రనాథ్ టాగూర్ కథల ఆధారంగా తీసిన 'తీన్ కన్య' ఈ కోవకు చెందిందే. 1976లో కన్నడ భాషలో 'కథా సంగమ' వచ్చింది. 2007లో అనురాగ్ బసు హిందీలో తీసిన బహుళ కథా చలనచిత్రం ‘లైఫ్ ఇన్ ఏ మెట్రో’, దీనికి ముందు 2003లో రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో ప్రవాళ్ రమణ్ దర్శకత్వం వహించిన ఆరు కథల ‘డర్నా మనా హై’, 2007లో రామ్ గోపాల్ వర్మతో కలుపుకుని ఏడుగురు దర్శకుల ‘డర్నా జరూరీ హై’ అనే ఏడు కథల ఆంథాలజీ, ఆరుగురు దర్శకులతో 'దస్ కహానియా' వచ్చాయి. 2009లో మలయాళంలో పదకొండు మంది దర్శకుల పదకొండు కథల ‘కేరళ కేఫ్’ వచ్చింది. 2009లోనే క్రిష్ దర్శకత్వంలో ఐదు విభిన్న కథల సమాహారంగా వేదం సినిమా వచ్చింది. ఈ సినిమాలన్నీ విజయవంతమయ్యాయి[3].

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

పాటలు మార్చు

ఈ సినిమాలోని పాటలను అనంత్ శ్రీరామ్, చిన్నికృష్ణ, రచించగా మిక్కీ జె. మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాలోని పాటలు:[5]

  • చందమామ కథలు సాటివారి వ్యధలు దాచు నీడలు , రచన:అనంత శ్రీరామ్, గానం. కళ్యాణి
  • ఈ కథ వేకువనే చూపెనా ఈ వ్యధ మీ ఎదనే వీడెనా , రచన: వనమాలి, గానం సానం పూరి, శ్వేతా పండిట్
  • పయనమే ఈ రోజిలా మొదలా మాయని ఓ తీయని కథలా , రచన: చిన్నికృష్ణ, గానం. విజయ్ ప్రకాష్.
  • నాకు ఆధార్ కార్డు ఉంది, జూబ్లీ హిల్స్‌లో ఫ్లాట్ ఉంది , రచన: చిన్నికృష్ణ, గానం. అనిల్.

పురస్కారాలు మార్చు

ఈ సినిమా 62వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ తెలుగు సినిమాగా ఎన్నికైంది[6]. ఈ పురస్కారం క్రింద రజత కమలం, లక్షరూపాయల నగదు పురస్కారం, ప్రశంసాపత్రం నిర్మాతకు లభించాయి.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే నంది పురస్కారాలలో ఈ సినిమాలోని నటనకు గాను మంచు లక్ష్మికి ఉత్తమ సహాయనటి పురస్కారం లభించింది[7].

ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో కూడా మంచు లక్ష్మికి ఉత్తమ సహాయనటి - తెలుగు అవార్డు దక్కింది[8].

మూలాలు మార్చు

  1. కోటి, ఎస్. "చందమామ కథలు రివ్యూ". apherald.com. Retrieved 19 September 2016.
  2. శేఖర్, హూలి. "National Film Awards: 'Chandamama Kathalu' is Best Telugu Film; Lakshmi Manchu, Richa Panai on Cloud Nine". ibtimes.co.in. Retrieved 16 September 2016.
  3. 3.0 3.1 సికిందర్. "పండని ప్రయోగకళలు". సినిమా స్క్రిప్ట్ & రివ్యూ. Retrieved 7 May 2018.[permanent dead link]
  4. ఆంధ్రప్రభ, సినిమా (22 April 2018). "అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టునయ్యా – నరేష్ – Andhra Prabha Telugu Daily". ర‌మేష్ గోపిశెట్టి. Archived from the original on 19 జూలై 2020. Retrieved 19 July 2020.
  5. "చందమామ కథలు లిరిక్స్". Archived from the original on 2017-07-07. Retrieved 2018-05-07.
  6. 62వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
  7. "2014 నంది అవార్డులు". Archived from the original on 2017-11-17. Retrieved 2018-05-07.
  8. "62వ బ్రిటానియా-ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్". Archived from the original on 2015-06-27. Retrieved 2015-06-27.

బయటి లింకులు మార్చు

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు