కెంబూరి రామ్మోహన్ రావు

కెంబూరి రామమోహనరావు భారతదేశ 9వ లోక్ సభ సభ్యుడు. 1985 నుండి 1989 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యునిగా పనిచేసాడు.

కెంబూరి రామ్మోహన్ రావు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
పదవీ కాలం
1985 - 1989
ముందు త్రిపురాన వెంకట రత్నం
తరువాత టంకాల సరస్వతమ్మ
నియోజకవర్గం చీపురుపల్లి శాసనసభ నియోజకవర్గం

పార్లమెంటు సభ్యుడు
పదవీ కాలం
1989 - 1991
ముందు పూసపాటి ఆనంద గజపతి రాజు
తరువాత పూసపాటి ఆనంద గజపతి రాజు
నియోజకవర్గం బొబ్బిలి లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 12 అక్టోబరు 1949
పుర్లి, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి రుషి
సంతానం 2 కుమార్తెలు (మైథిలి కెంబూరు, సౌజన్య కెంబూరి)
నివాసం లావేరు రోడ్, చీపురుపల్లి, ఆంధ్రప్రదేశ్
వెబ్‌సైటు [1]

జీవిత విశేషాలు మార్చు

కెంబూరి రామ్మోహనరావు శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆమదాలవలస మండలంలోని పుర్లి గ్రామంలో 1949 అక్టోబరు 12 వ తేదీన జన్మించాడు. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ పట్టాను పొందాడు.

రాజకీయ జీవితం మార్చు

అతను 1985 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ నుండి చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా గెలుపొందాడు.[1] 1989లో తొమ్మిదవ లోక్ సభ సాధారణ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుండిబొబ్బిలి పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందాడు. అహర్నిశలు పేద వర్గాల అభివృద్ధి కోసం శ్రమించాడు.

వ్యక్తిగత జీవితం మార్చు

అతను 1974లో రుషిని వివాహం చేసుకున్నాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు.

మూలాలు మార్చు

బాహ్య లంకెలు మార్చు