చివరకు మిగిలేది (సినిమా)

చివరకు మిగిలేది 1960లో నిర్మితమైన ఒక తెలుగుచిత్రం. కాంగ్రెస్ నాయకుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి మిత్రులతో కలిసి నిర్మించాడు. ఇది నటుడు ప్రభాకర రెడ్డి తొలి చిత్రం. ఈ చిత్రం అషుతోష్ ముఖర్జీ బెంగాలీ కథ “నర్స్ మిత్ర” ఆధారంగా తీశారు. ఇదే కథ ఆధారంగా హిందీ లో ఖామోషీ అన్న చిత్రం 1969 లో వచ్చింది. వహీదా రెహమాన్ నాయిక, అలాగే, "దీప్ జలే జాయి" అన్న బెంగాలీ చిత్రం కూడా ఇదే కథపై ఆధారపడ్డ సినిమా. అందులో సుచిత్రా సేన్ కథానాయిక. ఈ చిత్రం గురించి కొన్ని సభలలో ఎం. సత్యనారాయణరావు హాస్యంగా పూర్వస్మృతులు గుర్తుతెచ్చుకొంటూ ప్రస్తావించాడు. పి.వి. నరసింహారావు ఈ సినిమాను చూసి చేసిన వ్యాఖ్యలు అలాంటి ప్రస్తావనలలో కొన్ని. ఈ సినిమా బాగుందని పి.వి. అనగా "నీలాంటి మేధావికి ఈ సినిమా నచ్చిందంటే ఇక సినిమా హిట్టయ్యే ఛాన్సులేదు" అని సత్యనారాయణ అన్నాడట. (టి.వి.లో చూసిన ప్రసంగాల ఆధారంగా వ్రాసింది.)

చివరకు మిగిలేది
(1960 తెలుగు సినిమా)
దర్శకత్వం గుత్తా రామినీడు
నిర్మాణం ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి
రచన అట్లూరి పిచ్చేశ్వర రావు, మల్లాది రామకృష్ణశాస్త్ర్రి
చిత్రానువాదం అట్లూరి పిచ్చేశ్వర రావు
తారాగణం సావిత్రి,
బాలయ్య,
కాంతారావు,
హరనాథ్,
ప్రభాకరరెడ్డి
సంగీతం అశ్వత్థామ
నిర్మాణ సంస్థ మంజీరా ఫిల్మ్స్
భాష తెలుగు

సంక్షిప్త చిత్రకథ

మార్చు

(స్పాయిలర్లు కలవు) ఒక మానసిక వైద్యశాలలో పద్మ అన్న నర్సు పనిచేస్తూ ఉంటుంది. ఆ ఆసుపత్రి నడిపే డాక్టర్ గారు (ప్రభాకరరెడ్డి) ప్రేమలేమి లో ఉన్న వారు,, ప్రేమించి దగాపడిన వారు - ఇలాంటి పేషంట్లను వారితో ప్రేమగా ఉంటూ, దగ్గరవడం ద్వారా నయం చేయవచ్చని నమ్మినవారు. ఈ పద్ధతిలో వైద్యం చేస్తూనే, పద్మ భాస్కర్ (కాంతారావు) అన్న పేషంటును నిజంగానే ప్రేమించడం మొదలుపెడుతుంది. భాస్కర్ కూడా ఆమెని ఇష్టపడ్డా, ఇది ఆమె వృత్తిలో భాగం అనుకుని, నయం కాగానే వెళ్ళిపోయి, వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు. తరువాత, మరో పేషంటు ప్రకాశరావు (బాలయ్య) బాధ్యతలు స్వీకరిస్తుంది పద్మ. అయితే, ప్రకాశరావు కూడా ఆమెని ప్రేమించడం మొదలుపెడతాడు. అప్పుడప్పుడే భాస్కర్ అనుభవం నుంచి బయటపడుతున్న పద్మకి ఇంతలోనే ఈ అనుభవం ఎదురవడంతో మానసిక ఒత్తిడికి గురౌతూ ఉంటుంది. కల్నల్ ప్రకాశరావుతో పద్మ ప్రేమ వృత్తి ధర్మమే కానీ, మరొకటి కాదు అని తేల్చి చెప్పడంతో, ప్రకాశరావు తనకి నయం కాగానే ఆసుపత్రి వదిలి వెళ్ళిపోతాడు. ఈ పరిణామాల మధ్య, పద్మ మానసిక స్థిమితం తప్పి, అదే ఆసుపత్రిలో రోగి అవుతుంది.

పాటలు

మార్చు
  1. అందానికి అందం నేనే జీవన మకరందం నేనే - కె. జమునారాణి, రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
  2. అని నీవన్నది విన్నానోయి అది నిజమౌనని తీయని కలలో - సునంద, రచన: మల్లాది
  3. ఐనవారు నాకెవరు ఓహో విను మిష్టర్ దయగల జననివి గుణముల - ఘంటసాల . రచన: కొసరాజు.
  4. కవి కోకిల తీయని పలుకులలో చెలువారు నవరసాలు - పి.సుశీల, రచన: మల్లాది
  5. చెంగున అలమీద మిడిసిపోతది మేను చినవాడు ఎదురైతే - ఎం.ఎస్. రామారావు, రచన: మల్లాది
  6. సుధవో సుహాసినీ మధువో విలాసిని ఓహో కమనీ సరసం - ఘంటసాల . రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి.
  7. ఎవరి పిచ్చి వారికే ఆనందం, పిఠాపురం, రచన: ఆరుద్ర
  8. నెలరాజు జతమాని చెంగల్వ , సునంద, రచన: మల్లాది
  9. ఆకసాన హంస లాగ, పి.బి.శ్రీనివాస్ , పి.సుశీల, రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి.

వనరులు

మార్చు
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.