కె. రామలక్ష్మి

ప్రముఖ రచయిత్రి
(కె.రామలక్ష్మి నుండి దారిమార్పు చెందింది)

కె. రామలక్ష్మి (1930, డిసెంబరు 31 - 2023, మార్చి 3) ప్రముఖ రచయిత్రి.[1]

కె. రామలక్ష్మి
జననం(1930-12-31)1930 డిసెంబరు 31
కోటనందూరు, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్
మరణం2023 మార్చి 3(2023-03-03) (వయసు 92)
హైదరాబాదు, తెలంగాణ
ప్రసిద్ధిరచయిత్రి
మతంహిందూ
భార్య / భర్తఆరుద్ర
పిల్లలుముగ్గురు కూతుళ్ళు

జననం, విద్య మార్చు

రామలక్ష్మీ 1930, డిసెంబరు 31న తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కాకినాడ జిల్లా, కోటనందూరులో జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయం బి.యే. పట్టభద్రులు.

సాహిత్య ప్రస్థానం మార్చు

1951 నుండీ రచనలు చేశారు. ఆంగ్ల, ఆంధ్ర సాహిత్యం, ప్రాచీనాంధ్రసాహిత్యం చదివారు. తెలుగు స్వతంత్రలో ఇంగ్లీషు విభాగానికి ఉపసంపాదకులుగా పనిచేశారు. అనువాదాలు కూడా చేశారు. స్త్రీ సంక్షేమ సంస్థలలో పనిచేశారు. ఈమె రామలక్ష్మి ఆరుద్ర అన్న కలంపేరుతో కూడా రచనలు చేశారు.[2]

వ్యక్తిగత జీవితం మార్చు

1954లో కవి, సాహిత్యవిమర్శకుడు ఆరుద్రతో వివాహమయింది. వీరికి ముగ్గురు కుమార్తెలు.

నవలలు మార్చు

  • విడదీసే రైలుబళ్ళు (1954)
  • అవతలిగట్టు
  • మెరుపుతీగె
  • తొణికిన స్వర్గం (1961)
  • మానని గాయం
  • అణిముత్యం
  • పెళ్ళి (2013)
  • ప్రేమించు ప్రేమకై
  • ఆడది
  • ఆశకు సంకెళ్ళు
  • కరుణ కథ
  • లవంగి
  • ఆంధ్ర నాయకుడు
  • పండరంగని ప్రతిజ్ఞ

కథాసంకలనాలు మార్చు

  • నీదే నాహృదయం
  • అద్దం
  • ఒక జీవికి స్వేచ్ఛ

పురస్కారాలు మార్చు

మరణం మార్చు

రామలక్ష్మీ 2023, మార్చి 3న హైదరాబాద్‌లోని మలక్‌పేటలో మరణించారు.[4]

వనరులు మార్చు

  1. "Ramalakshmi Arudra: ఆరుద్ర సతీమణి, ప్రముఖ రచయిత్రి కె.రామలక్ష్మి కన్నుమూత". EENADU. 2023-03-03. Archived from the original on 2023-03-03. Retrieved 2023-03-03.
  2. Telugu, ntv (2023-03-03). "K. Ramalakshmi: కవి ఆరుద్ర సతీమణి కన్నుమూత". NTV Telugu. Archived from the original on 2023-03-03. Retrieved 2023-03-03.
  3. "23మందికి కళారత్న పురస్కారం". www.andhrabhoomi.net. 2016-04-09. Archived from the original on 2016-04-10. Retrieved 2023-03-24.
  4. "రచయిత్రి రామలక్ష్మి ఆరుద్ర కన్నుమూత". Prajasakti (in ఇంగ్లీష్). 2023-03-03. Archived from the original on 2023-03-03. Retrieved 2023-03-03.

బయటి లింకులు మార్చు