కె. జనార్ధన్ రెడ్డి
కె. జనార్ధన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు.[1] భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున 1952 నుండి 1957 వరకు మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[2]
కె. జనార్ధన్ రెడ్డి | |
---|---|
మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం మాజీ పార్లమెంట్ సభ్యుడు | |
In office 1952–1957 | |
తరువాత వారు | పులి రామస్వామి |
వ్యక్తిగత వివరాలు | |
జననం | షాయిన్‌పల్లి, బిజినేపల్లి మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా, తెలంగాణ | 1918 ఏప్రిల్ 25
జాతీయత | భారతీయుడు |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | సరళాదేవి |
సంతానం | ఒక కుమారుడు, ఒక కుమార్తె |
తల్లిదండ్రులు | రామారెడ్డి |
జననం, విద్య
మార్చుజనార్థన్ రెడ్డి 1918, ఏప్రిల్ 25న తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లా, బిజినేపల్లి మండలం, షాయిన్‌పల్లిలో జన్మించాడు. తండ్రిపేరు రామారెడ్డి.[3]
వ్యక్తిగత జీవితం
మార్చుజనార్థన్ రెడ్డికి 1940 జనవరి 1న సరళాదేవితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె.
రాజకీయ జీవితం
మార్చు1952లో భారత పార్లమెంట్ కు జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున పోటిచేసి లోక్‌సభ సభ్యుడిగా గెలుపొందాడు.[4]
నిర్వర్తించిన పదవులు
మార్చు- నాగర్ కర్నూల్ తాలూకా పిల్లల సంక్షేమ కేంద్రం సభ్యుడు
- జుబుల్‌పూర్ విభాగం 'వందేమాతరం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సమ్మె అధ్యక్షుడు (1938)
- చీఫ్ వాలంటీర్, మల్కా పోరే ఆంధ్ర మహాసభ (1939)
- నాగర్ కర్నూల్ తాలూకా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
- మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యుడు
- రెడ్డి హాస్పిటల్ స్పోర్ట్స్ సెక్రటరీ (1937)
- స్కౌట్ మాస్టర్, రెడ్డి ట్రూప్, (1936-38)
- మహబూబ్ నగర్ జిల్లా ప్రణాళిక కమిటీ సభ్యుడు
- మహబూబ్ నగర్ జిల్లా నీటిపారుదల అభివృద్ధి కమిటీ సభ్యుడు
- మహబూబ్ నగర్ జిల్లా సరఫరా కమిటీ సభ్యుడు
- ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు (1949)
- నేషనల్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ లైజన్ సెంట్రల్ కమిటీ సభ్యుడు
ఇతర వివరాలు
మార్చువయోజన విద్యా కేంద్రాలు, గ్రంథాలయాలను స్థాపించాడు. 1947లో రజాకార్లకు వ్యతిరేకంగా ప్రతిఘటన ఉద్యమాన్ని నిర్వహించాడు. 1953లో బెంగుళూరులో జరిగిన ఫార్ ఈస్ట్, ఆసియా దేశాలకు సంబంధించిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కాన్ఫరెన్స్‌కు భారతీయ ప్రతినిధి బృందం సభ్యుడిగా ఉన్నాడు.
మూలాలు
మార్చు- ↑ "First Loksaba Members (Hyderabad)". loksabhaph.nic.in. Archived from the original on 2021-12-14. Retrieved 2021-12-14.
- ↑ "PARLTAMENT OF INDIA-HOUSE OF THE PEOPLE-WHO'S WHO (1952)" (PDF). www.eparlib.nic.in. p. 285. Archived (PDF) from the original on 2021-10-26. Retrieved 2021-12-14.
{{cite web}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 2020-10-26 suggested (help) - ↑ "K. JANARDHAN REDDY". loksabhaph.nic.in. Archived from the original on 2021-12-14. Retrieved 2021-12-14.
- ↑ "Shri K. Janardhan Reddy MP biodata Mahabubnagar | ENTRANCEINDIA". www.entranceindia.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-12-28. Archived from the original on 2020-06-20. Retrieved 2021-12-14.