పులి రామస్వామి
పులి రామస్వామి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, తొలితరం కార్మిక, దళిత, నిమ్నవర్గాల నాయకుడు.[1] భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున రెండుసార్లు మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[2]
పులి రామస్వామి | |||
పులి రామస్వామి | |||
మాజీ పార్లమెంటు సభ్యుడు
| |||
పదవీ కాలం 1952-1962, 1962-1967 | |||
ముందు | none | ||
---|---|---|---|
తరువాత | జె.బి. ముత్యాలరావు | ||
నియోజకవర్గం | మహబూబ్‌నగర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | డిసెంబరు 12, 1902 సికింద్రాబాదు, భారతదేశం | ||
జీవిత భాగస్వామి | పులి నాగమ్మ | ||
సంతానం | 1 కుమారుడు, 2 కుమార్తెలు | ||
మతం | హిందూ మతం |
జననం, విద్య
మార్చురామస్వామి 1902, డిసెంబరు 12న తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాదులో జన్మించాడు. ఈయన తండ్రి పులి రాజలింగం. రామస్వామి ప్రాథమిక విద్య వెస్లేయన్ మిషన్ ఉన్నత పాఠశాలలో సాగింది.[3]
వ్యక్తిగత జీవితం
మార్చురామస్వామికి 1920, జూన్ 22న నాగమ్మతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు.
సామాజిక సేవ
మార్చుఈయన హరిజనోద్ధరణకు, దేవదాసీ వ్యవస్థ నిర్మూలణకు, బాల్యవివాహాలు, జంతుబలులు, మద్యపాన నిషేధం వంటి సామాజిక అంశాలపై కృషిచేశాడు. సమాజంలోని వివిధ వర్గాల ప్రజల ఐక్యతకు, హరిజనుల్లో దివ్యసమాజ బోధనలు ప్రచారం చేయటానికి తోడ్పడ్డాడు. స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హరిజనులను సంఘటితం చేసి ఉద్యమించాడు.
రాజకీయ జీవితం
మార్చు1950 నుండి 1952 వరకు రాజ్యాంగ పరిషత్తులో సభ్యుడిగా ఉన్నాడు. 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలలో మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి గెలుపొంది, 1957 వరకు లోక్‌సభ సభ్యుడిగా పనిచేశాడు.[1] 1957 నుండి 1962 వరకు 2వ లోకసభలో కూడా మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[4]
నిర్వర్తించిన పదవులు
మార్చు- అణగారిన తరగతుల సంఘం ఎగ్జిక్యూటివ్ సభ్యుడు
- అణగారిన తరగతుల తెలంగాణ సదస్సు రిసెప్షన్ కమిటీ చైర్మన్
- హైదరాబాద్ స్టేట్ హరిజన కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు
- ఆల్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక సభ్యుడు
- హైదరాబాదు దళిత జాతి సంఘం వ్యవస్థాపక సభ్యుడు, ఉపాధ్యక్షుడు
- ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్
- ఆల్ హైదరాబాద్ దళిత జాతి సదస్సు రిసెప్షన్ కమిటీ చైర్మన్
- హరిజన సేవక్ సంఘ్ హైదరాబాద్ శాఖ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "loksabha". loksabha. Archived from the original on 24 April 2019. Retrieved 24 April 2019.
- ↑ "First Loksaba Members (Hyderabad)". loksabhaph.nic.in. Archived from the original on 2021-12-14. Retrieved 2021-12-14.
- ↑ "Members Bioprofile (Puli Ramaswamy)". loksabhaph.nic.in. Archived from the original on 2021-12-14. Retrieved 2021-12-15.
- ↑ "2nd Loksabha Members". loksabhaph.nic.in. Archived from the original on 2020-08-09. Retrieved 2021-12-15.