కేవీఆర్ మహేంద్ర

కేవీఆర్‌ మహేంద్ర (జ. మార్చి 11) తెలుగు సినిమా దర్శకుడు, రచయిత. 2019లో వచ్చిన దొరసాని సినిమాతో దర్శకుడిగా తెలుగు సినిమారంగంలోని అడుగుపెట్టాడు.[1]

కేవీఆర్‌ మహేంద్ర
సినివారం కార్యక్రమంలో మహేంద్ర
జననం
కేవీఆర్‌ మహేంద్ర

మార్చి 11
వృత్తితెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత

మహేంద్ర, మార్చి 11న వరంగల్ పట్టణ జిల్లా, హసన్‌పర్తి మండలం లోని జైగిరి గ్రామంలో జన్మించాడు.[2]

సినిమారంగ ప్రస్థానం

మార్చు

2002లో పీపుల్స్ భారతక్క సినిమా ద్వారా సినిమారంగం ప్రవేశ చేసిన మహేంద్ర, ఆ తరువాత కొన్ని సినిమాలకు కో-డైరెక్టర్ గా పనిచేశాడు. మహేంద్ర తెలంగాణ ఉద్యమం నేపథ్యంపై 'నిశీధి' పేరుతో లఘుచిత్రాన్ని తీశాడు.[3] ఆ లఘుచిత్రం పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేదికల్లో ప్రదర్శించబడటమేకాకుండా 18 దేశాలనుంచి 39 జాతీయ, అంతర్జాతీయ అవార్డులును అందుకుంది.[4] ఇండోర్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఉత్తమ దర్శకుడు అవార్డు, పూణే అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డును గెలుచుకుంది. 21వ కోల్‌కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో 60 దేశాల నుండి వచ్చిన 2500 చిత్రాలలో నిశీధి 25వ స్థానంలో నిలిచింది.[5]

సినిమారంగంలో మహేంద్ర, తెలంగాణలో 80వ దశకంలో దొరల కాలంలో జరిగిన ఒక నిజజీవిత ప్రేమకథ ఆధారంగా 2019లో దొరసాని సినిమాను రూపొందించాడు. మధుర ఎంటర్‌టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాలు సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తమ్ముడు అనంద్ దేవరకొండ, రాజశేఖర్ చిన్నకుమార్తె శివాత్మిక హీరో హీరోయిన్లుగా నటించారు.[6]

దర్శకత్వం చేసినవి

మార్చు
  1. నిశీధి (లఘుచిత్రం)
  2. దొరసాని (2019)
  3. భరతనాట్యం[7]

మూలాలు

మార్చు
  1. ఈనాడు, సినిమా (11 July 2019). "శివాత్మికలో నిజంగానే 'దొరసాని' ఉంది". Archived from the original on 11 March 2020. Retrieved 11 March 2020.
  2. ప్రజాశక్తి, మూవీ (11 July 2019). "నాపై శ్యామ్‌ బెనగల్‌ నమ్మకాన్ని పెంచారు : కేవీఆర్‌". Archived from the original on 12 July 2019. Retrieved 11 March 2020.
  3. telugu, NT News (2023-06-22). "Telangana | తెలంగాణ తల్లి నుదుట సాంస్కృతిక తిలకం". www.ntnews.com. Archived from the original on 2023-06-22. Retrieved 2023-06-22.
  4. ఆంధ్రభూమి, చిత్రభూమి (11 July 2019). "దొరసాని.. అలా వచ్చింది". Archived from the original on 12 July 2019. Retrieved 11 March 2020.
  5. The Hindu, Metroplus (9 December 2015). "Men behind the movement". Neeraja Murthy. Archived from the original on 11 March 2020. Retrieved 11 March 2020.
  6. సాక్షి, సినిమా (12 July 2019). "నాపై నాకు నమ్మకం పెరిగింది". Archived from the original on 12 July 2019. Retrieved 11 March 2020.
  7. Namasthe Telangana (21 September 2023). "'భరతనాట్యం' టైటిల్‌తో దొరసాని దర్శకుడు కొత్త‌ సినిమా.. హీరో ఎవ‌రంటే". Archived from the original on 21 September 2023. Retrieved 21 September 2023.

ఇతర లంకెలు

మార్చు