కైలాస్ టేకిడి శివాలయం

కైలాస్ టేకిడి శివాలయం తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని నిగిని తాండా గ్రామ పంచాయితీ పరధిలోని సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ప్రకృతి ఒడిలో పరమ శివుడు కొలువుదీరినారు.[1][2]ఆలయ పూజారి సంత్ లింబాజీ మహారాజ్ ఆలయాన్ని పురాతన శైలిలో కట్టించారు. మాఘ మాసంలో ఐదు రోజులు పాటు ఉత్సవాలు జరుగును. ఇది తెలంగాణ, మహారాష్ట్ర రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉంది[3].

కైలాస్ టేకిడి శివాలయం
కైలాస్ టేకిడి శివాలయం నిగిని తాండ బోథ్
కైలాస్ టేకిడి శివాలయం నిగిని తాండ బోథ్
పేరు
ఇతర పేర్లు:శివాలయం
ప్రధాన పేరు :కైలాస్ శిఖర్
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:ఆదిలాబాద్
ప్రదేశం:కైలాస్ టేకిడి, నిగినితాండ బోథ్
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:శివుడు
ముఖ్య_ఉత్సవాలు:మహశివరాత్రి
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :హిందూమతము, హిందూ సమాజం
దేవాలయాలు మొత్తం సంఖ్య:ద్వాదశ జ్యోతిర్లింగాలు (12)
కట్టడాల సంఖ్య:01
ఇతిహాసం
నిర్మాణ తేదీ:2002
సృష్టికర్త:లింబాజీ మహారాజ్

చరిత్ర

మార్చు

కైలాస్ టేకిడి అనగా కైలాస్ అను పేరు గల పర్వతం. టేకిడి అంటే శిఖరం అని అర్థం. ఇది శివలింగాకారంలో ఉంది. ఇచ్చట శివాలయం. [4] మహా శివలింగ దేవాలయాన్ని సంత్ లింబాజీ మహారాజ్ కట్టించాడు.సంత్ రామారావు మహారాజ్ శిష్యులైన లింబాజీ మహారాజ్ పశువుల కాపరిగా తాండ ప్రజల గోవులను మేపుతు ఉండేవారు.ఒక రోజు మహారాజ్ కలలో శివుడు ప్రత్యక్షమై భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని,మీకు కూడా మంచి జరుగుతాయని నేను చెప్పిన‌ చోటుకు వెళ్ళి దీపం అగర్ ఒత్తులు వెలగించి పూజ నిర్వహించాలని కోరడంతో లింబాజీ మహారాజ్ 2002 సంవత్సరం నుంచి శివుని సేవలో ఉన్నారు.

ఆలయ నిర్మాణం

మార్చు

ఆలయం తోలుత రేకులతో చిన్న గుడిని నిర్మించారు.ఆ తర్వాత భక్తులే తలాకొంత సహాయం చేసి ఆలయ నిర్మాణం పైన దృష్టి సారించి ఈ శివాలయాన్ని నిర్మించారు. భక్తులు సమర్పించే ‌బెల్లం,కుంకుడుకాయ,అరటి పండ్లు సిమెంట్ యందు కలిపి ‌ఒక ప్రత్యేక పద్దతిలో ఆలయాన్ని లింబాజీ మహారాజ్ నిర్మించారు.ఈ ఆధునిక కాలంలో ఇంజనీయర్ల సలహాలు సూచనలు పాటించ కుండా పురాతన పద్దతిలో ఆద్భతమైన‌ నిర్మాణ శైలిలో పదార్థాలు,పళ్ళను ఉపయోగించి ప్రత్యేకంగా నిర్మాణం గావించారు.ఈ విధంగా నిర్మించినచో దాదాపు పదకాండు వేల సంవత్సరాలు చెక్కుచెదరకుండా ఉంటుందని మహారాజ్ కు ఆ పరమ శివుడే చెప్పాడని భక్తులు అంటారు.అలయ శిఖరం ఎత్తు యాభై ఒక అడుగులు ఉంటుంది. ఆలయాన్ని ప్రాచీన దేవాలయం రీతిలో నల్లరాయిని ఉపయోగించి నిర్మించారు.గర్భాలయంలో భారీ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. దేవుని ఆజ్ఞ ప్రకారం శివలింగాన్ని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రవహించే అతి పెద్దనది అయిన నర్మదనది నుండి ప్రత్యేక పూజలు చేసి శివలింగాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్టించారు. ఆలయంలో ద్వాదశజ్యోతిర్లింగాలు దర్శనమిస్తాయి. కింకారణ్యంలో బృహత్తరమైన, అత్యంత పవిత్రమైన ఆలయం అద్బుతమైన శిల్పకళా నైపుణ్యం కలిగి ఉంటుంది.ఈ ఆల[5]యాన్ని దక్షిణ భారత ఆలయ శైలిలో నిర్మించడం విశేషం.

భక్తుల తాకిడి

మార్చు

ప్రతి సోమవారం రోజున కుల మత భేద‌ భావం లేకుండా వివిధ గ్రామాల నుండి సమీప తాండాలు సుదూర ప్రాంతాల నుండి రెండు వేల నుండి మూడు వేల పైన భక్తులు ప్రముఖులు ప్రజాప్రతినిధులు ఆలయాన్ని దర్శించుకుంటారు. మహాశివరాత్రి [6]రోజున ఈ క్షేత్రం'హరహరమహాదేవ శంభో శంకర అన్న శివనామస్మరణతో కైలాస్ టేకిడి కైలాసాన్నే తలపిస్తుంది. శివరాత్రి పండుగ రోజున, మాఘ మాసంలో ఇచ్చట ప్రత్యేక పూజలు నిర్వహించడం‌ వలన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాశి, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొదలగు రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శనం కోసం వస్తారు.ఇచ్చట వచ్చిన భక్తులు రాయి మీద రాయి లింగాకారంలో పేర్చితే అనుకున్న కోరికలు నెరవేరుతాయని‌ భక్తుల విశ్వాసం.చాలా మంది భక్తుల కోరికలు నేరవేరాయి సంతానం కలుగని దంపతులకు సంతానం కలగడం, కండ్లు లేని, సరిగా చూడని భక్తులకు కూడా చక్కగా కన్పించడం ఇది దేవుని మహిమ అని భక్తులు స్వయానా అనడం విశేషం.

ఎలా చేరుకోవచ్చు

మార్చు

ఈ ఆలయాన్ని ఆదిలాబాదు, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాదు జిల్లాల నుండి వచ్చే భక్తులు ముందుగా బోథ్ మండలంలోని నిగిని తాండాకు చేరుకోవాలి, అచ్చట నుండి పది కిలో మీటర్లు దూరంలో ఉండే ఆలయాన్ని చేరుకునేందుకు ప్రైవేటు వాహనాలు, ట్రాక్టర్ ట్రాలీ, ఆటోలూ అందుబాటులో ఉంటాయి.మహరాష్ట్ర నుండి వచ్చే భక్తులు శివని దహేల్ ధానోరా మీదుగా నేరుగా చేరుకోవచ్చు.

మూలాలు

మార్చు
  1. "Special Report On Kailash Tekdi Temple | Adilabad | V6 News - video Dailymotion". Dailymotion (in ఇంగ్లీష్). 2022-03-01. Retrieved 2024-03-10.
  2. Vikas, Manda. "Into the Woods | తెలంగాణ కాశ్మీరం.. ఆదిలాబాద్ జిల్లా ప్రకృతి అందాలకు గమ్యస్థానం!". Hindustantimes Telugu. Retrieved 2024-03-10.
  3. "ఈనాడు : Eenadu Telugu News Paper | Eenadu ePaper | Eenadu Andhra Pradesh | Eenadu Telangana | Eenadu Hyderabad". epaper.eenadu.net. Retrieved 2024-12-06.
  4. Desk 23, Disha Web (2023-04-08). "కైలాసాన్నే తలపించే కైలాస్ టేకిడి శివాలయం..రచయిత రాథోడ్ శ్రావణ్". www.dishadaily.com. Retrieved 2024-03-10.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  5. telugu, NT News (2021-12-08). "రెండో కాశీ క్షేత్రం కైలాస్‌ టేకిడి". www.ntnews.com. Retrieved 2024-03-10.
  6. ABN (2022-03-01). "శివ శంభో." Andhrajyothy Telugu News. Retrieved 2024-03-10.

వెలుపలి లంకెలు

మార్చు