కొంగపాడు
కొంగపాడు, ప్రకాశం జిల్లా, అద్దంకి మండలానికి చెందిన గ్రామం.[1]..
కొంగపాడు | |
---|---|
గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°48′36″N 79°58′30″E / 15.81°N 79.975°ECoordinates: 15°48′36″N 79°58′30″E / 15.81°N 79.975°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | అద్దంకి మండలం ![]() |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( ![]() |
పిన్(PIN) | 523212 ![]() |
గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు
పూర్వం "కొంగసాని" అనే ఆమె మొదట గడ్డనెత్తడం వల్ల దీనికి కొంగపాడు అనే పేరు వచ్చింది.
గ్రామ భౌగోళికంసవరించు
ఇది అద్దంకి పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది.
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యంసవరించు
ఈ గ్రామానికి ప్రక్కనే ఉన్న గుండ్లకమ్మ నది ద్వారా త్రాగునీటి సదుపాయము కల్పించబడింది. కానీ సాగుకు అవసరమైన నీరు మాత్రం అందుబాటులో లేదు. గ్రామస్థులు తమ స్వంత ఖర్చుతో బోర్లు వేయించినప్పటికీ సఫలతా శాతం బాగా తక్కువ.
గ్రామ పంచాయతీసవరించు
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు
- మే 29, 2013 న ఈ గ్రామంలో శ్రీరామాలయం, ఆంజనేయస్వామి విగ్రహము, నాభిశిలా ప్రారంభించారు. ఈ రామాలయము సుమారుగా 60 లక్షల రూపాయల వ్యయముతో, గ్రామ ప్రజలు, ఉద్యోగులు, పరిసర ప్రాంత ప్రజల సహకారముతో నిర్మించబడింది.
- శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయము.
- శ్రీ పోలేరమ్మ గుడి.
- శ్రీ నాగేంద్రస్వామివారి ఆలయం.
- ఎక్కువమంది కొలిచే దేవుడు శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి.
గ్రామంలో ప్రధాన పంటలుసవరించు
పొగాకు, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు
ఈ గ్రామ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయము. సారవంతమైన నల్లరేగడి నేలల్లో అరుదుగా లభించే వర్జీనియా పొగాకు పండిచడంలో ఈ గ్రామం ప్రసిద్ధి చెందినది. పొగాకుతో పాటు శనగ, జూట్, నూగు, మినుము మొదలగు వాణిజ్య పంటలు కూడా పండిస్తారు.
గ్రామ విశేషాలుసవరించు
- ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకి బాగా పేరు. గత 10 సంవత్సరాలలో అక్షరాస్యత బాగా పెరిగింది.
- పొగాకు, రాజకీయాలతో చుట్టుపక్కల గ్రామాల్లో దీనికి బాగా పేరు.
- వెయ్యిమంది కూడా లేని కొంగపాడు నుంచి ఐఐటి, ఐఐఎం లతో పాటు విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించిన,పదిలో పదికి పది సాధించిన విద్యార్ధులున్నారు
- ఈ ఊరినుంచి అమెరికా, యూరప్ ఖండాలలో స్థిరపడిన ఉద్యోగులు ఉన్నారు.
కొంగపాడు సేవసవరించు
గ్రామంలోని ఉద్యోగులు అందరూ కలిసి 2008 లో "కే - సేవ" అనే స్వచ్ఛంద సంస్థగా ఏర్పడి ప్రతి సంక్రాంతికీ ఆటల పోటీలు నిర్వహిస్తూ గ్రామంలో సమైక్యతా భావమును పెంపొందించుటకు కృషి చేస్తున్నారు. దీనితో పాటుగా వీధిదీపాల నిర్వహణా ఖర్చు, నిరుపేద విద్యార్థులకు ధన సహాయము, ఉద్యోగార్ధులకు సలహాలు, సూచనలు, అందచేస్తూ గ్రామ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నారు.
అంతేకాక, గ్రామ త్రాగునీటి అవసరాలు తీర్చడానికి అల్బనీ-ఆంధ్ర అసోసియేషన్ సహకారం తో, త్రాగునీటి శుద్ధి కేంద్రాన్ని నెలకొల్పారు.
మూలాలుసవరించు
వెలుపలి లంకెలుసవరించు
[1] ఈనాడు ప్రకాశం; 2013,సెప్టెంబరు-4; 1వపేజీ.