కొండవీటి సింహం

1981 తెలుగు సినిమా

కొండవీటి సింహం 1981 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఎం. అర్జునరాజు, శివరామరాజు నిర్మాతలుగా రోజా మూవీస్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రంలో ఎన్. టి. రామారావు, శ్రీదేవి, జయంతి, రావు గోపాలరావు, మోహన్ బాబు, కైకాల సత్యనారాయణ ముఖ్యపాత్రల్లో నటించారు. పి. సత్యానంద్ మాటలు రాశాడు. కె. చక్రవర్తి సంగీతం అందించాడు. వేటూరి సుందర్రామ్మూర్తి అన్ని పాటలు రాయగా ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల పాటలు పాడారు.

కొండవీటి సింహం
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
కథ సత్యానంద్
తారాగణం నందమూరి తారక రామారావు,
శ్రీదేవి,
జయంతి,
మోహన్ బాబు,
రావు గోపాలరావు,
కైకాల సత్యనారాయణ,
చలపతిరావు
సంగీతం కె. చక్రవర్తి
నేపథ్య గానం ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
నృత్యాలు సలీమ్
గీతరచన వేటూరి సుందరరామమూర్తి
సంభాషణలు సత్యానంద్
ఛాయాగ్రహణం కె.ఎస్.ప్రకాష్
కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ రోజా మూవీస్
భాష తెలుగు

చిత్రకథ

మార్చు

శివాజీ గణేశన్ నటించిన 'తంగపతకం' తమిళ చిత్రం తెలుగు లోనికి 'బంగారు పతకం' పేరుతో డబ్ చేయబడి విజయవంత మయ్యింది. అదే సినిమా ఎన్టీఆర్ ను కొడుకుగా రెండో పాత్రను చేర్చి అదే కథ 'కొండవీటి సింహం' గా తెలుగులో వచ్చింది. ఒక సంవత్సరం తరువాత 'తంగ పతకం' దీలీప్ కుమార్, అమితాబ్ ల కాంబినేషన్ తో సలీమ్ జావేద్ కథగా 'శక్తి' చిత్రం హిందీలో వచ్చింది.శక్తి ప్లాప్ అయ్యింది.

నటీనటులు

మార్చు
 
కొండవీటి సింహం సినిమాలో రంజిత్ కుమార్ పాత్రదారిగా నందమూరి తారక రామారావు దృశ్య చిత్రం

ఈ సినిమాలోని పాటలు

మార్చు

ఈ చిత్రంలో అన్ని పాటలు విపరీత ప్రేక్షకాదరణ పొందాయి.

  1. మా ఇంటి లోన మహ లక్ష్మి నీవె - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  2. అత్త మడుగు వాగు లోన అత్త కూతురో - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  3. ఈ మధుమాసంలో - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  4. వానొచ్చె వరదొచ్చె - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  5. పిల్ల వుంది పిల్ల మీద - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  6. బంగిన పల్లి మామిడి పండి రంగు మీదుంది - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  7. గోతి కాడ గుంట నక్క తొంగి

బయటి లింకులు

మార్చు