కొట్టాయం జిల్లా
కొట్టాయం జిల్లా, భారతదేశం కేరళ రాష్ట్రంలోని జిల్లా.[1][2] ఈ ప్రాంతానికి తూర్పున పశ్చిమ కనుమలు, పశ్చిమాన కుట్టనాడ్ వెంబనాడ్ సరస్సు ఉంది. జిల్లా అంతటా పచ్చని పొలాలతో దర్శనమిచ్చే కొట్టాయం జిల్లా అసాధారణమైన లక్షణాలను కలిగి ఉంది [3] నైరుతి కేరళలో ఉన్న కొట్టాయం పట్టణం ఈ జిల్లాకు ప్రధాన కార్యాలయం. కొట్టాయం పట్టణం రాష్ట్ర రాజధాని తిరువనంతపురం ఉత్తరాన దాదాపు 155 కిలోమీటర్లు (96 మై.) దూరంలో ఉంది.దీపిక, మలయాళ మనోరమ , మంగళం వంటి అనేక మొదటి మలయాళ దినపత్రికలు ఈ ప్రాంతంలోనే ప్రారంభించబడ్డాయి, నేటికీ కూడా వారి ప్రధాన కార్యాలయాలు కొట్టాయం పట్టణంలో నడుపుతున్నారు. కొట్టాయం జిల్లాలో కొట్టాయం, చంగనస్సేరి, పాలా, ఎరట్టుపేట, ఎట్టుమనూరు, వైకోమ్ అనే ఆరు పురపాలక పట్టణాలు ఉన్నాయి.కేరళలో అరేబియా సముద్రం లేదా ఇతర రాష్ట్రాలు సరిహద్దులుగా లేని ఏకైక జిల్లా. హిందుస్థాన్ న్యూస్‌ప్రింట్ లిమిటెడ్, రబ్బర్ బోర్డ్ జిల్లాలో ఉన్న రెండు కేంద్ర ప్రభుత్వ సంస్థలు. కేరళలోని నాయర్ సర్వీస్ సొసైటీ, ఇండియన్ ఆర్థోడాక్స్ చర్చి అనే రెండు మత సంఘాల ప్రధాన కార్యాలయాలు కొట్టాయం జిల్లాలో ఉంది:
Kottayam | |
---|---|
City | |
Coordinates: 9°35′41″N 76°29′08″E / 9.5947087°N 76.4855729°E | |
Country | India |
రాష్ట్రం | Kerala |
జిల్లా | Kottayam |
Region | Central Travancore |
Incorporated | 1921 |
Official Language | Malayalam |
Native Language | Malayalam |
Government | |
• Type | Municipality |
• Body | Kottayam Municipality |
• Municipal Chairperson | Bincy Sebastian |
విస్తీర్ణం | |
• City | 77.8 కి.మీ2 (30.0 చ. మై) |
• Land | 134.51 కి.మీ2 (51.93 చ. మై) |
• Water | 3.09 కి.మీ2 (1.19 చ. మై) |
• Urban | 157.6 కి.మీ2 (60.8 చ. మై) |
• Metro | 200.83 కి.మీ2 (77.54 చ. మై) |
• Rank | 5 |
Elevation | 3 మీ (10 అ.) |
జనాభా | |
• City | 1,36,812 |
• జనసాంద్రత | 1,800/కి.మీ2 (4,600/చ. మై.) |
• Urban | 1,82,927 |
• Urban density | 1,200/కి.మీ2 (3,000/చ. మై.) |
• Metro | 3,57,533 |
• Metro density | 1,800/కి.మీ2 (4,600/చ. మై.) |
Demonym | Kottayamkar |
Time zone | UTC+5:30 (భా.ప్రా.కా) |
పిన్ కోడ్ | 686 001 |
Telephone code | Kottayam:0481 |
Vehicle registration | KL-05 |
Sex ratio | 1075 female(s)/1000 male(s)/ ♂/♀ |
Literacy | 99.66 % |
HDI | 0.831 |
చరిత్ర
మార్చుతెక్కుంకూర్ పాలన (1100 - 1753)
మార్చుసా.శ. తొమ్మిదవ శతాబ్దం ఆరంభం నుండి, తెక్కుంకూర్ ఇంకా కొట్టాయం చరిత్ర వాస్తవికంగా చాలా దగ్గర అపోలికలను కలిగి ఉంటాయి. కొట్టాయం అప్పుడు కులశేఖర సామ్రాజ్యం (800–1102AD) అయిన వెంపోలినాడ్‌లో భాగంగా ఉంది. సుమారు 1100 AD సమయంలో వెంపోలినాడ్ రాజ్యం తెక్కుమ్కుర్ ఇంకా వడక్కుమ్కుర్ అనే రెండు రాజ్యాలుగా చీలిపోయింది, రెండోది కొచ్చిన్ సామంత సామ్రాజ్యంగా ఏర్పడింది.
ట్రావెన్‌కోర్ పాలన (1753 - 1949)
మార్చు1817లో కొట్టాయంలో మొదటిసారి ఇంగ్లండ్ చర్చ్ మిషనరీ సొసైటీ CMS కళాశాలను పాశ్చాత్య కళాశాలను ప్రారంభించింది. బ్యూరోక్రాట్లకు సరైన శిక్షణ అందించడానికి ఈ కళాశాల అవసరమని ట్రావెన్‌కోర్ ప్రభుత్వం స్వాగతించింది .[4]
భారత ప్రభుత్వ పాలన (1949 - ప్రస్తుతం)
మార్చుభారతప్రభుత్వం ఏర్పడ్డాక కొచ్చిన్ ట్రావెన్‌కోర్‌లో రెవెన్యూ డివిజన్‌గా మారింది.[5] 1949లో ట్రావెన్‌కోర్, కొచ్చిన్ రాష్ట్రాలు విలీనం అయిన సమయంలో, ఈ రెవెన్యూ డివిజన్‌లు జిల్లాలుగా పునర్నిర్వహించబడ్డాయి. 1949 నుండి దివాన్ పేష్కార్‌లకు బదులు జిల్లా కలెక్టర్ల పాలన మొదలైంది.[6]
జనాభా గణాంకాలు
మార్చుచారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% p.a. |
1901 | 4,50,615 | — |
1911 | 4,88,040 | +0.80% |
1921 | 5,85,478 | +1.84% |
1931 | 7,75,069 | +2.84% |
1941 | 9,42,899 | +1.98% |
1951 | 11,32,478 | +1.85% |
1961 | 13,13,983 | +1.50% |
1971 | 15,39,030 | +1.59% |
1981 | 16,97,442 | +0.98% |
1991 | 18,28,271 | +0.75% |
2001 | 19,53,646 | +0.67% |
2011 | 19,74,551 | +0.11% |
ఆధారం:[7] |
2011 భారత జనాభా లెక్కల ప్రకారం కొట్టాయం జిల్లాలో 19,74,551 జనాభా ఉంది. ఇది [8] స్లోవేనియా దేశం [9] లేదా యుఎస్ రాష్ట్రం న్యూ మెక్సికోతో సమంగా ఉంటుంది.[10] ఇది జనాభా పరంగా భారతదేశంలోని మొత్తం 640 జిల్లాలలో 234వ ర్యాంక్‌ను ఇస్తుంది [8] జిల్లాలోని విస్తీర్ణంలో ప్రతి చ.కి.మీ.కు (2.320 చ.మైళ్లు) 896 మంది జనసాంద్రత ఉంది.[8]
2001–11 దశాబ్దంలో దాని జనాభా వృద్ధి రేటు 1.32% శాతానికి పెరిగింది [8] కొట్టాయంలో ప్రతి 1000 మంది పురుషులకు 1040 స్త్రీల లింగ నిష్పత్తి ఉంది. మొత్తం జనాభాలో అక్షరాస్యత రేటు 97.21% ఉంది. ఇది రాష్ట్రంలోనే అత్యధికం, భారతదేశ స్థాయిలో 4వ స్థానంలో ఉంది. జనాభాలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు వరుసగా 7.79%, 1.11% మంది ఉన్నారు.[8]
రెవెన్యూ గ్రామాలు
మార్చుకొట్టాయం జిల్లా తన రెవెన్యూ పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ కోసం 100 రెవెన్యూ గ్రామాలుగా విభజించబడింది.[11] అవి 5 తాలూకాలు క్రింద వివరించిన విధంగా ఉన్నాయి.[11]
- చంగనస్సేరి తాలూకా పరిధిలో 15
- కంజిరపల్లి తాలూకా పరిధిలో 13
- కొట్టాయం తాలూకా పరిధిలో 26
- మీనాచిల్ తాలూకా పరిధిలో 28
- వైకోమ్ తాలూకా పరిధిలో 18
పర్యాటకం, వన్యప్రాణులు
మార్చుకొట్టాయం జిల్లాలో నదులు, బ్యాక్ వాటర్స్, పురాతన మతపరమైన ప్రదేశాలు, హిల్ స్టేషన్లులను కలిగిఉన్నాయి.
స్థానిక పర్యాటక ప్రదేశాలు
మార్చు- కుమరకోమ్, కొట్టాయం నగరానికి సమీపంలో ఉన్న ఒక పర్యాటక ప్రదేశం. ఇది వలస పక్షులకు ప్రసిద్ధి చెందిన కుమరకోమ్ పక్షుల అభయారణ్యం .[12]
- వెంబనాడ్ సరస్సు కెట్టువల్లమ్స్ అని పిలువబడే సాంప్రదాయ కార్గో బోట్లకు నిలయం. వీటిని క్రూయిజ్ బోట్లు, హౌస్బోట్లుగా మార్చారు.[13] పతిరమణల్ అనేది వెంబనాడ్ సరస్సులో ఉన్న ఒక చిన్న ద్వీపం. దీనిని పడవ ద్వారా మాత్రమే చేరుకోవచ్చు.[13]
- ఇలవీజ పూంచిర కొట్టాయంలోని హిల్ స్టేషన్ .[14]
- వాగమోన్ కేరళలోని ఒక హిల్ స్టేషన్. ఇది ప్రధానంగా ఇడుక్కి జిల్లాలో ఉంది, కానీ కొంత భాగం ఈ జిల్లాలోని మీనాచిల్ తాలూకా, కంజిరపల్లి తాలూకా పరిధిలో ఉంది.[15]
- ఆగస్టు, సెప్టెంబరులలో ఓనం పండుగ సందర్భంగా కొట్టాయంలో నీటి పడవ పోటీలు నిర్వహిస్తారు. అందులో ప్రధానమైంది నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ . కుమ్మనంలోని తజతంగడి పడవ పోటీ శతాబ్దానికి పైగా చరిత్రను కలిగి ఉంది.
- వైకోమ్, ఒక చారిత్రక పట్టణం.
- ఇల్లికల్ కల్లు, కొట్టాయం జిల్లాలో ఎత్తైన ప్రదేశం.
రవాణా సౌకర్యాలు
మార్చుకొట్టాయం జిల్లా లోని అన్ని ప్రాంతాల నుండి కేరళలోని ఇతర ప్రముఖ నగరాలకు ప్రధాన రహదారులు ద్వారా, రైలు మార్గాల ద్వారా అనుసంధానించబడి ఉంది. అలాగే జలమార్గ ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి. కొట్టాయం కుమలి, ఎట్టుమనూరు-ఎర్నాకులం, కొట్టాయం-పతనంతిట్ట, తిరువల్ల-కిడంగూర్ సెంట్రల్ కేరళ బైపాస్, ప్రధాన సెంట్రల్ రోడ్డు జిల్లాలోని ప్రధాన రహదారులు. సమీప విమానాశ్రయం కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం. కొట్టాయం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి కేరళ రాష్ట్ర జల రవాణా శాఖ ఫెర్రీ సేవలను నిర్వహిస్తోంది. అలప్పుజ్హ జిల్లా లోని వైకోమ్ నుండి తవనక్కడవు వరకు ఫెర్రీ సర్వీస్ చాలా పొడవైంది.
పరిపాలన
మార్చుఆదాయ విభాగాలు
మార్చుకొట్టాయం నగరం కొట్టాయం జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం. జిల్లాను కొట్టాయం, పాల అనే రెండు రెవెన్యూ విభాగాలుగా విభజించబడింది-.[16]
పురపాలక పట్టణాలు
మార్చుజిల్లాలో 6 పురపాలక పట్టణాలు ఉన్నాయి. అవి:[17]
- చంగనస్సేరి
- ఈరట్టుపేట
- ఎట్టుమనూరు
- కొట్టాయం
- పాలా
- వైకోమ్
శాసన ప్రాతినిధ్యం
మార్చులోక్సభ నియోజకవర్గాలు
మార్చుకొట్టాయం జిల్లాలో రెండు లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి: కొట్టాయం (7 అసెంబ్లీ నియోజకవర్గాలు), పతనంతిట్ట (2 అసెంబ్లీ నియోజకవర్గాలు కంజిరపల్లి, పూంజర్).
శాసనసభ నియోజకవర్గాలు
మార్చుకొట్టాయం జిల్లాలో తొమ్మిది కేరళ శాసనసభ స్థానాలు ఉన్నాయి.[18]
వ.సంఖ్య. | నియోజకవర్గాలు | సభ్యుడు పేరు | పార్ఠీ | కూటమి |
---|---|---|---|---|
1 | పాలా శాసనసభ నియోజకవర్గం | మణి సి. కప్పన్ | NCP | UDF |
2 | కడుతురుత్తి శాసనసభ నియోజకవర్గం | మోన్స్ జోసెఫ్ | KEC | UDF |
3 | వైకోమ్ శాసనసభ నియోజకవర్గం | సి.కె. ఆశా | CPI | LDF |
4 | ఎట్టుమనూరు శాసనసభ నియోజకవర్గం | వి.ఎన్. వాసవన్ | CPI (M) | LDF |
5 | కొట్టాయం శాసనసభ నియోజకవర్గం | తిరువంచూర్ రాధాకృష్ణన్ | INC | UDF |
6 | పుత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం | ఊమెన్ చాందీ | INC | UDF |
7 | చంగనస్సేరి శాసనసభ నియోజకవర్గం | జాబ్ మైఖేల్ | KC (M) | LDF |
8 | కంజిరపల్లి శాసనసభ నియోజకవర్గం | ఎన్. జయరాజ్ | KC (M) | LDF |
9 | పూంజర్ శాసనసభ నియోజకవర్గం | సెబాస్టియన్ కులతుంకల్ | KC (M) | LDF |
విద్య
మార్చుకేరళలో మొదటి పాశ్చాత్య శైలి కళాశాల సి.ఎం.ఎస్. కొట్టాయంలోని కళాశాల (వ్యాకరణ పాఠశాల) (1840) ఏర్పడింది.[19]
జిల్లాలోని ప్రముఖ విద్యా సంస్థలు
మార్చు- సి.ఎం.ఎస్ కాలేజ్ కొట్టాయం
- ప్రభుత్వ కళాశాల, కొట్టాయం [20]
- ప్రభుత్వ వైద్య కళాశాల, కొట్టాయం
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కొట్టాయం (ఐఐటి-ె)
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్, కొట్టాయం (ఐఐఎంసి-కె)
- కె. ఆర్, నారాయణన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ విజువల్ సైన్స్ అండ్ ఆర్ట్స్
- కొట్టాయం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్
- మహాత్మా గాంధీ యూనివర్సిటీ, కేరళ.
- రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కొట్టాయం (ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల)
ప్రముఖులు
మార్చు- చెంపిల్ అరయన్ - బ్రిటిషు వారిపై సాయుధ పోరాటం చేసిన యోధుడు
మూలాలు
మార్చు- ↑ "List of Districts in Kerala - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-06-10.
- ↑ "Municipal corporations in Kerala". Archived from the original on 2021-06-18. Retrieved 2021-10-27.
- ↑ "About Kottayam". Government of Kerala. 4 April 2020. Retrieved 10 April 2020.
- ↑ "Setting standards of excellence: UGC recognition has added to CMS College's list of merits". The Hindu. 4 January 2005. Archived from the original on 15 మార్చి 2005. Retrieved 5 April 2010.
- ↑ Kurien L (2010). "Structure and functioning of Gramsabhas" (PDF).
{{cite journal}}
: Cite journal requires|journal=
(help) - ↑ "Kottayam District, Government of Kerala | Kottayam, the Land of Letters | India".
- ↑ Decadal Variation In Population Since 1901
- ↑ 8.0 8.1 8.2 8.3 8.4 "District Census Hand Book – Kottayam" (PDF). Registrar General and Census Commissioner of India. 2011.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 27 September 2011. Retrieved 1 October 2011.
Slovenia 2,000,092 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 19 October 2013. Retrieved 30 September 2011.
New Mexico – 2,059,179
- ↑ 11.0 11.1 "కొట్టాయం జిల్లాలోని రెవెన్యూ గ్రామాలు". నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, భారత ప్రభుత్వం. Retrieved 13 జూన్ 2022.
- ↑ http://www.forest.kerala.gov.in/index.php/kottayam Archived 2020-09-20 at the Wayback Machine [bare URL]
- ↑ 13.0 13.1 "VEMBANAD LAKE | Kottayam District, Government of Kerala | India".
- ↑ "ILAVEEZHAPOONCHIRA | Kottayam District, Government of Kerala | India".
- ↑ "Vagamon,Wagamon, Vagamon hill station, Vagamon Heights, Vagamon Hideout".
- ↑ "Revenue divisions in Kottayam district". National Informatics Centre, Ministry of Electronics and Information Technology, Government of India. Retrieved 13 June 2022.
- ↑ "Municipalities | District Kottayam, Government of Kerala | India". Retrieved 2022-06-13.
- ↑ Niyamsabha official site
- ↑ CMS College CMS website.
- ↑ "Government College Kottayam". Archived from the original on 20 March 2015. Retrieved 11 June 2021.