ప్రధాన మెనూను తెరువు

కొడవటిగంటి రోహిణీప్రసాద్

శాస్త్రవేత్త మరియు రచయిత

కొడవటిగంటి రోహిణీప్రసాద్ (సెప్టెంబర్ 14, 1949 - సెప్టెంబరు 8, 2012) బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త మరియు సమర్థుడైన రచయిత. 1949 సెప్టెంబర్ 14న తెనాలిలో ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు మరియు వరూధిని లకు జన్మించారు. రోహిణీప్రసాద్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో శాస్త్రవేత్తగా పనిచేసారు. సంగీతం, సాహిత్యం, సైన్స్ మొదలైన అంశాలపై సరళమైన తెలుగులో ఆయన రాసిన వ్యాసాలు, పుస్తకాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి.

కొడవటిగంటి రోహిణీప్రసాద్
K.rohini prasad.jpg
కొడవటిగంటి రోహిణీప్రసాద్
జననంకొడవటిగంటి రోహిణీప్రసాద్
సెప్టెంబర్ 14, 1949
తెనాలి
మరణంసెప్టెంబరు 8, 2012
ముంబై
ఇతర పేర్లుకొడవటిగంటి రోహిణీప్రసాద్
తండ్రికొడవటిగంటి కుటుంబరావు
తల్లివరూధిని

సంగీతం తన నాలుగో ఏట వినికిడి మీద తనంతట తానుగా నేర్చుకోవటం మొదలుపెట్టి, హిందుస్తానీ, కర్ణాటక సంగీతంలో క్రమంగా మంచి ప్రావీణ్యం సంపాదించాడు.సర్వశ్రీ పండిట్ ఎల్.ఆర్.కేల్కర్ (గ్వాలియర్ ఘరానా), ఉస్తాద్ ఇమ్రత్ ఖాన్ (సితార్) వద్ద శిష్యరికం చేసి సితార్ వాయిద్య నైపుణ్యం సంపాదించి తన పదహారో ఏట "అరంగ్రేటం" చేసారు.

1978లో ఆయన నేపథ్య సంగీతం సమకూర్చి, బాంబేలో ప్రదర్శించిన "కుమార సంభవం" అనే నృత్య నాటిక పెద్దలందరిచేత మన్ననలు పొందింది.అలాగే ఆయన 2003లో కూచిపూడి కళా కేంద్రం వారి నృత్యరూపకం "కృష్ణ పారిజాతం" లోని "తులాభారం" అంకానికి స్వరపరిచిన సంగీతం అందరినీ అలరించింది. సెప్టెంబరు 8, 2012ముంబైలో మరణించారు.

బయటి లింకులుసవరించు