కొత్తపేట (పులిచెర్ల మండలం)
కొత్తపేట', చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
కొత్తపేట | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 13°36′36″N 79°00′00″E / 13.61°N 79.000°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | చిత్తూరు |
మండలం | పులిచెర్ల |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
సమీప మండలాలు
మార్చుపాకాల మండలం. ఈ గ్రామానికి సమీప మండలం..
విద్యా సౌకర్యాలు
మార్చుఈ గ్రామం.లో ఒక ప్రాథమిక పాఠశాల, ఒక ఉన్నత పాఠశాల ఉంది.
గ్రామ విశేషాలు
మార్చుబ్రిటిష్ పాలనలో ఇది ఒక జమీందారి వ్యవస్థ. దాని పేరే కామవరం కొత్త పేట జమీదారు. జమీందార్ల నివాస ప్రాంతం పేరు నగరి అది ఈ నాటికి అదే పేరుతొ ఉంది. కాకపోతే పాడు పడిన గోడలు, శిథిలమైన భవనాలు ఉన్నాయి. గతంలో చుట్టు పక్కల భవనాలు శిథిలమైనా ప్రధాన భవనం బాగానే వుండేది. ఆ భవనం ముందు ప్రధాన ద్వారం ముందు పైన జింకల, దుప్పుల తల ప్రతిష్ఠింప బడి వుండేది. ఈ జమీందారి వ్వవస్త క్రింది ఏడు చెరువులు క్రింద భూములు వుండేవి. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింతర్వార ఈ జమీందారి వ్యవస్థ భారత ప్రభుత్వంలో కలిసి పోయింది.
మౌలిక వసతులు
మార్చుఈ గ్రామానికి విద్యుత్ దీపాలవసతి, త్రాగు నీటి వసతి ఉంది.
దర్శనీయ ప్రదేశాలు/ దేవాలయాలు
మార్చుఈ గ్రామ సమీపములో నున్న ఒక చిన్న కొండపై ఒక శివాలయమున్నది. గ్రామం.లో కన్యకాపరమేశ్వరాలయమున్నది.
ప్రధాన పంటలు
మార్చువరి, వేరుశనగ, మామిడి, కూరగాయలు మొదలగునవి ఇక్కడి ప్రధాన పంటలు.
ప్రధాన వృత్తులు
మార్చుఈ గ్రామం. లోని ప్రజల ప్రధాన వృత్తి, వ్యవసాయము, వ్యవసాయ ఆధారిత పనులు, వ్యాపారము