కొత్తరెడ్డిపాలెం

కొత్తరెడ్డిపాలెం, గుంటూరు జిల్లా, చేబ్రోలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

కొత్తరెడ్డిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం చేబ్రోలు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522213
ఎస్.టి.డి కోడ్

గ్రామ చరిత్ర

మార్చు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు

మార్చు

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామం పేరుకు తగ్గట్టుగానే రెడ్డి కుటుంబాల వారు ప్రథమంగా నిలుస్తారు.

గ్రామంలోని విద్యాసౌకర్యాలు

మార్చు

కొండవీటి కమిటీ ఉన్నత పాఠశాల

మార్చు
  • 1957లో ఈ గ్రామంలో కె.సి.ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు స్థాపించబడినవి. 1978 వరకు చుట్టుప్రక్కల గ్రామాల వారు పాఠశాలలో విద్యను అభ్యసించే వారు.
  • కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన శ్రీ మాదిరెడ్డి సుబ్బారెడ్డి, వైద్యవిద్యనభ్యసించి, 1964లో. అమెరికాలో స్థిరపడినారు. వీరు తను చదువుకున్న గ్రామంలోని కొండవీటి కమిటీ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరటంతో, రు. 18 లక్షల వ్యయంతో, నాలుగు గదుల నూతన పాఠశాల భవనం నిర్మించి ఇచ్చారు. ఈ నూతన భవనాన్ని, 2014, మార్చి-19న ప్రారంభించనున్నారు.
  • ఈ పాఠశాలలో 2015, సెప్టెంబరు-3వ తెదీన, దాతల వితరణతో త్రాగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేసారు. ఈ-తరగతులు ఏర్పాటుచేసారు.

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల

మార్చు

ఇది 1925 లో మొదలైంది.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

మార్చు

ఈ గ్రామంనకు తూర్పుగా ఒక పంట కాలువ, పడమర దిక్కులో ఒక పంట కాలువ ప్రవహించునప్పటికి గ్రామానికి చెందిన భూములకు నీరు అందదు. కంకర మట్టి, సుద్ద మట్టి ఎక్కువగా లభించుచున్నది. గ్రామంలో 85% నల్లరేగడి మెట్టభూములు, 10% మాగాణి, 5% ఎర్ర్ర ఇసుక నేలలు ఉన్నాయి.

గ్రామ పంచాయతీ

మార్చు
  • ఈ గ్రామానికి చెందిన వ్యక్తులు బవనము బలరామిరెడ్డి, చల్లా రామకృష్ణారెడ్డి, గాదె వెంకటప్పా రెడ్ది, గాదె వెంకట సుబ్బా రెడ్డిలు చేబ్రోలు గ్రామపంచాయితీకి సర్పంచులుగా సేవలందించి పంచాయితీని అభిపథంలో నడిపిన కీర్తిని సంపాదించారు.
  • కొత్తరెడ్డిపాలం గ్రామం చేబ్రోలు మేజరు గ్రామపంచాయితీలో ఒక భాగము.
  • కొత్తరెడ్డిపాలెం, పాతరెడ్డిపాలెం జంట గ్రామాలుగా పేరు పొందాయి.
  • ఒకప్పుడు ఈ గ్రామ సరిహద్దు దాసు వంతెన వరకు అనేవారు. తరువాత అది చేరువులోపాలెంగా చేబ్రోలులో కలిసినది. గ్రామానికి ఉత్తర దిక్కున పాత పల్లె, కొత్త పల్లె ఉనాయి. తూరుపు దిక్కున కొత్తపేట అనే కాలని ఏర్పడి, విసాలత సంతరించుకుంది. కాని దక్షిణం వైపు, పడమర వైపు విస్తరించలేదు. రెండు దిక్కులా విస్తరితే గ్రామం ఇంకా చాల అభివృద్ధి చెందేది.
  • 2013, జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో తోట నాగమల్లేశ్వరి, సర్పంచిగా ఎన్నికైంది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

ఒక బ్రహ్మం గారి గుడి, కాంతయ గారి గుడి, పురాతమైనవి.

శ్రీ సీతామస్వామివారి ఆలయం

మార్చు

ఈ ఆలయంలో, శ్రీరామనవమి వేడుకలు ప్రతి సంవత్సరం కన్నుల పండువగా నిర్వహించెదరు. చేతులతో ఒలిచిన బియ్యంతో చేసిన తలంబ్రాలు, భద్రాచలం నుండి తెప్పించిన వెదురు బియ్యం, ముత్యాల తలంబ్రాలతో, శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించెదరు. నూతనంగా నిర్మించిన కళ్యాణమండపంలో, వేదమంత్రాల నడుమ, కళ్యాణం నిర్వహించెదరు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు ఈ వేడుకలలో పాల్గొంటారు. శ్రీ సీతారాముల కళ్యాణాన్ని పురస్కరించుకొని, ఎదురుకోలు ఉత్సవం జరుగును. దేవాదాయ శాఖవారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించెదరు. కళ్యాణం తరువాత, 16 రోజుల పండుగను పురస్కరించుకొని భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించెదరు.

ఈ ఆలయంలో, 15, మార్చి-23వ తేదీ సోమవారం ఉదయం, సూర్యకిరణాలు గర్భగుడిలోని స్వామివారి పాదాలను తాకిన దృశ్యం, భక్తులనలరించింది. ఉదయభానుని వెలుగులతో ప్రకాశించిన శ్రీ సీతారామస్వామివారిని దర్శించుకునేటందుకు భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు.

శ్రీ సీతాలమ్మ అమ్మవారు

మార్చు

గ్రామదేవత సీతాలమ్మ అమ్మవారి ఆలయంలో, 2014, ఆగస్టు-24, శ్రావణ మాసం, చివరి ఆదివారం నాడు, గ్రామస్థులు అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. జలాభిషేకం నిర్వహించారు. బొడ్రాయికి పూజలు నిర్వహించారు. అనంతరం మూడు వేలమందికి అన్నదానం నిర్వహించారు.

ఈ గ్రామంలో గ్రామదేవతలైన సీతాలాంబ తల్లి, పోలేరమ్మ తల్లి, లక్ష్మణస్వామి, మహాగణపతి, ప్రసన్నాంజనేయస్వామి విగ్రహాల పునఃప్రతిష్ఠచేసి ఆరు సంవత్సరాలయిన సందర్భంగా, 2014, నవంబరు-3, కార్తీక మాసం, సోమవారం నాడు, వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామదేవతలకు అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సీతారామస్వామివారి ఆలయంలో కార్తీకమాస వ్రతాలు నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు.

బినే ఎఫ్రాయిడ్ సమాజం (యూదుల ప్రార్ధనా మందిరం)

మార్చు

2015, మార్చి-5వ తేదీనాడు, ఇక్కడ "పూరిం" పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ పండుగను పురస్కరించుకొని, ప్రత్యేకప్రార్థనలు నిర్వహించి, పేదలకు దానాలు చేసారు.

ఆనందాశ్రమం

మార్చు

శ్రీ గాయత్రీ శ్రీ మేధాదక్షిణామూర్తి స్వామివారి ఆలయం

మార్చు

స్థానిక ఆనందాశ్రమంలోని ఈ ఆలయంలో, ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవాలు, 2017, ఆగస్టు-12వతేదీ శనివారంనాడు వైభవంగా, శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా యంత్రస్థాపనం, బింబస్థాపనం, కళాన్యాసం, మహామంగళ పూర్ణాహుతి, కుంభాభిషేకం, నీరాజన మంత్రపుష్పములు, శాంతికళ్యాణం నిర్వహించారు. మహిళలు ఈ ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొని, ధ్వజస్తంభ పునాదులలో నవధాన్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు.

శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం

మార్చు

ఈ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు, 2015, మార్చి-6వ తేదీ శుక్రవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగాషిర్డీ సాయిబాబా, ఇతర విగ్రహ మూర్తులకు జలాభిషేకం నిర్వహించారు. [

ఒక చర్చి కూడా ఉంది (పాత పల్లెలో).

2010 లో ఒక మసీదు నిర్మించారు.

గ్రామంలో ప్రధాన పంటలు

మార్చు
  • కొత్తపరెడ్డిపాలెంలో మిరప, పత్తి పంటలు ఎక్కువగా పండుతాయి.
  • 1920 నుండి 1982 వరకు పొగాకు పండించడం ఒక పరిశ్రమ లాగ ఉండి వ్యవసాయ కూలీలకు జీవనోపాధి ఉండేది. 1982 తరువాత పొగాకుకు ఆదరణ తగ్గుట వలన వ్యవసాయ కూలీలకు జీవనోపాధి పోయి పట్టణములకు వలస ప్రారంభమయినది.

గ్రామంలో ప్రధాన వృత్తులు

మార్చు

వ్యవసాయ ఆధారిత గ్రామం. గ్రామంలో జనాభా వ్యవసాయము మీద ఆధారపడి జీవిస్తారు. కుల వృత్తుల వారు: నేత కార్మికులు రెండో స్థానంలో ఉంటారు. ఈ నేత కార్మికులు తెలంగాణా జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారే.

గ్రామ విశేషాలు

మార్చు
  • ప్రతి సంవత్సం ఏరువాక తిరుణాళ్ళను గ్రామ వ్యవసాయదారులు సంప్రదాయబద్ధంగా జరుపుకొంటారు.
  • ఈ గ్రామం నుండి చదువుకొని అమెరిక ఇతర విదేశాలలో స్థిరపడినవారు ఎక్కువె.

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.