కొత్త రాజబాపయ్య

కొత్త రాజబాపయ్య, (జులై 1, 1913 - జూన్ 24, 1964) గుంటూరు జిల్లా తెనాలి తాలూకా సంగం జాగర్లమూడిలో 1913 జూలై 1వ తేదీన సామాన్య కర్షక కుటుంబములో రాజమ్మ, బుచ్చికోటయ్య దంపతులకు జన్మించాడు. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన మహా మనీషి[1].

కొత్త రాజబాపయ్య
జననంజులై 1, 1913
గుంటూరు జిల్లా తెనాలి తాలూకా సంగం జాగర్లమూడి
మరణంజూన్ 24, 1964
మరణ కారణంగుండెపోటు
వృత్తిరేపల్లె ఉన్నత పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడు
15 సంవత్సరాలు గణితోపాధ్యాయుడు
15 సంవత్సరాలు ప్రధానోపాధ్యాయుడు
ప్రసిద్ధి1964-65 సంవత్సరానికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నారు.
మతంహిందూ మతము
తండ్రిబుచ్చికోటయ్య
తల్లిరాజమ్మ,

విద్య మార్చు

ప్రాథమిక విద్య ఊరిబడిలో చదివి, తెనాలి, కొల్లూరు ఉన్నత పాఠశాలలలో ఉన్నత విద్య పూర్తి చేసి, గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో బి.ఎ చదివి, 1937లో బి.ఇ.డి చేశాడు.

వృత్తి మార్చు

1937-38 మధ్యకాలములో రేపల్లె ఉన్నత పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా చేశాడు. 15 సంవత్సరాలు గణితోపాధ్యాయునిగా, 15 సంవత్సరాలు ప్రధానోపాధ్యాయునిగా పనిచేశాడు. లెక్కల ఉపాధ్యాయునిగా మంచి పేరు సంపాదించాడు. పర్యవేక్షణ లేని పరీక్షలు జరిపి, వ్యతిరేకత ఎదురైనా పరీక్షలు చక్కగా నిర్వహించి విద్యాశాఖాధికారుల మెప్పు పొందాడు. కూచిపూడి కోగంటి వారి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా ఉన్నపుడు రాజబాపయ్య క్రమశిక్షణకు, లెక్కలు చెప్పే విధానానికి ముగ్ధులై విద్యార్థులు ఎన్నో మైళ్ళ దూరం నుండి నడచి వచ్చి చదువుకునేవారు.

ఉపాధ్యాయ వృత్తిలో ఎన్నో ప్రయోగాలు చేసిన రాజబాపయ్య విద్యాబోర్డులో, రాష్ట్ర విద్యా సలహా సంఘానికి సభ్యునిగా పనిచేశాడు. రాజబాపయ్య చేసిన విశిష్టసేవలకు గుర్తింపుగా 1964-65 సంవత్సరానికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతుల మీదుగా తీసుకున్నాడు.

వృత్తే ప్రాణంగా బ్రతికిన రాజబాపయ్య 1964 జూన్ 24న గుండెపోటుతో మరణించాడు.

మూలాలు మార్చు

  1. గుంటూరు జిల్లా ఆణిముత్యాలు, గుత్తికొండ జవహర్ లాల్, కమల పబ్లికేషన్స్, హైదరాబాదు, 2009, పుట 142