కొనగలూరు

భారతదేశంలోని గ్రామం

కొనగలూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, పొదలకూరు మండలానికి, దుగ్గుంట పంచాయతికి చెందిన గ్రామం..ఇక్కడి నుంచి నెల్లూరు 42 కీ.మీ, సైదాపురం 38 కీ.మీ, రాపురు 23 కీ.మీ, కలువాయి 50 కీ.మీ. సంగం నుంచి 35 కి.మీ.దూరంలో ఉంది.

కొనగలూరు
—  రెవిన్యూ గ్రామం  —
కొనగలూరు is located in Andhra Pradesh
కొనగలూరు
కొనగలూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°20′06″N 79°40′29″E / 14.33509°N 79.67481°E / 14.33509; 79.67481
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం పొదలకూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

సమీప గ్రామాలు మార్చు

రామాపురం, దుగ్గుంట, ఉట్లపాలెం, తలుపూరు, డేగపూడి, డేగపూడి రాజుపాలెం, ఇనుకుర్తి, ఊచపల్లి, వావింటపర్తి, మొగల్లూరు.

దేవాలయాలు, ప౦డుగలు మార్చు

కొనగలూరు గ్రామ౦లొ మస్తాన్ స్వామి దర్గా- జెండా పండుగ, వినాయక చవితి, శ్రీరామ నవమి పండుగలు సంబర౦గా జరుపుకుంటారు.

శ్రీ వినాయక స్వామివారి దేవాలయం:- మార్చు

ఈ గ్రామంలో పూజలందుకొనే దేవాలయాలు 21వ శతాబ్దం వరకు లేవు అంటే ఆశ్చర్యపొనవసరం లేదు. ఈ గ్రామంలో నందిబీళ్ళు ప్రాంతంలో పురాతన కాలం నాటి శివుడు పార్వతి, వినాయకుడు, నంది రాతి విగ్రహాలు బయటపడ్డవి. అప్పటి గ్రామ పెద్దలు శ్రీరాములవారి దేవాలయ నిర్మాణానికి ఉపక్రమించారు, ఊరిలో వాందరి సహకారం అందకపొవడంతొ వారి ప్రయత్నాన్ని విరమించుకున్నారు.చాలా కాలం తరువాత ఈ గ్రామానికి ఉపాద్యయుడుగా వచ్చినటువంటి కీ.శే. శ్రీ ప్రకాశం పంతులు స్వతహగ బ్రాహ్మణుడు అగుటచేత గ్రామ పెద్దలైన శ్రీ చిరుమావిళ్ళ సత్యనారాయణ, కీ.శే. శ్రీ పేట చంచయ్య గార్లను శ్రీ వినాయక స్వామివారి దేవాలయం నిర్మించమని కొరారు అందుకు అంగీకరించిన వారు పాఠశాల సమీపంలోని ప్రాంతంలో నిర్మించతలపెట్టారు, వారు తలపెట్టినా కొన్ని కారణాల మూలంగా నిర్మాణానికి ఆటంకాలు ఎదురైనవి, ఈ సమయంలోనే శ్రీ పేట చంచయ్య గారు, శ్రీ ప్రకాశం పంతులు గారు కాలం చేశారు. తదుపరి గ్రామస్థులు నిర్మణపనులు వేగవంతం చేయడంతొ 2009 సంవత్సరములో ఆలయంలో శ్రీ ప్రకాశం పంతులు గారు ప్రతిష్ఠించాలనుకున్న విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు, హొమాలు నిర్వహంచారు. ఈ దేవాలయంలో వినాయక చవితి రోజు ఈ దేవాలయాన్ని పూవ్వులు, పండ్లుతొ అలంకరించి, పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు భక్తులకు ఇస్తారు, స్వామివారి సన్నిథిలో ఉట్టి మహొత్సవం నిర్వహించి తదుపరి స్వామివారి విగ్రహాన్ని ఊరంతా ఊరేగించి ఊరు ప్రక్కనే ప్రవహించే కండలేరు ఏరులో (నది) నిమఘ్నం చేస్తారు.

శ్రీ మస్తాన్ వలి దర్గా:- జెండా పండుగ, గంధమహొత్సవం మార్చు

జెండా పండుగ, గంధమహొత్సవము మే నుండి జూలై మాసంలో కసుమూరు దర్గా గంధమహొత్సవము తరువాత జరుగును. పేద, థనిక, కుల, మత తారతమ్యాలు లేకుండా మస్తాన్ స్వామి జెండా ఉత్సవాన్ని గ్రామ ప్రజలందరు భక్తిశ్రద్డలతొ జరుపుకుంటారు. కొరిన కొర్కెలు తీర్చే దేవునిగా కొలుస్తారు, కాలగమణంలో మస్తాన్ స్వామి మహబూబ్ స్వామిగా, మాబుస్వామిగా ప్రాచుర్యం పొందారు.మొక్కుబడి ఉన్నటువంటి భక్తులు స్వామి వారిని విశ్వసిస్తూ జెండాను స్వామి వారికి ఉత్సవంలో సమర్పిస్తారు. మస్తాన్ స్వామి జెండా చెట్టును రంగు రంగుల కాగితాలతొ, పువ్వులతొ, విథ్యుత్ దీపాలతొ అలంకరిస్తారు.సాయంత్ర దర్గా సన్నిథిలో మహ్మథీయులు కుల పెద్దలతొ కలసి ఖ్హురాన్ పఠిస్తారు, భక్తులు తీసుకొనివఛ్చిన ప్రసాదాలను స్వామి వారికి నివేదిస్తారు. అనంతరం భక్తులకు, ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మొక్కుబడి ఉన్నటువంటి భక్తులువారిని జెండాలను పువ్వులు, సుగంధం, అత్తరుతొ అలంకరించి, మహ్మథీయుల చేత పూజించి కర్రకు కట్టి ఒకొక్కరు ఊరెగింపుగా దర్గా వద్దకు తీసుకొనివచ్చి మస్తాన్ స్వామికి సమర్పిస్తారు. తిరునాళ్లను అస్వాదించడానికి వచ్చిన వారికోసం సాంసృతిక కార్యక్రమాలు గ్రామ పెద్దల చేత నిర్వహించబడుతాయి. తెల్లవారుజామున భక్తులు సమర్పించిన జెండాలను తీసుకొని ఊరెగింపుగా గ్రామంలోని ప్రతి ఇంటికి తీసుకొనిపొయి జెండాలకు నివేదన స్వీకరించి కుటుంబంలో వారందరు మహ్మథీయులు చేత ఆశీర్వదాలు అందుకుంటారు. ఈ కార్యక్రమాలకు, గ్రామ ప్రజలేగాక, చుట్టుప్రక్కల గ్రామాల నుండి గూడా, ప్రజలు భారీ సంఖ్యలో వఛ్చి జెండా ఉత్సవంలో పాల్గొంటారు.

గ్రామ ప్రత్యేకత మార్చు

శ్రీ మస్తాన్ స్వామి దర్గాలో జరిగే జెండా పండుగ, గంధమహొత్సవము, తదుపరి ఆదివారము గ్రామదేవతలైన మహాలక్ష్మి అమ్మవారికి, పొతురాజు స్వామికి పొంగల్లు పెట్టి, కొళ్ళను బళిచ్చే ఘట్టాలు గొప్పగా జరుగును. కండలేరు డ్యామ్ నుండి ప్రవహించే కండలేరు నది ఈ గ్రామం గుండా ప్రవహిస్తూ ఉంది. ఈ నది నీరుని ఉపయోగించి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు (వామిటపర్తి, దగ్గుంట రాజుపాళెం, రామాపురం, డేగపూడి రాజుపాళెం) వ్యవసాయం సాగిస్తున్నారు.

పంటలు మార్చు

వరి, వేరుశెనగ, చెరకు, నిమ్మ, కాయకూరలు (వంగ, మిర్చి, చిలకడ దుంపలు) .

పాఠశాలలు మార్చు

  1. మండల ప్రజాపరిషత్ పాఠశాల, కొనగలూరు
  2. మండల ప్రజాపరిషత్ పాఠశాల, రామాపురం
  3. మండల ప్రజాపరిషత్ పాఠశాల, దుగ్గుంట
  4. మండల ప్రజాపరిషత్ పాఠశాల, తలుపూరు
  5. మండల ప్రజాపరిషత్ పాఠశాల, ఇనుకుర్తి
  6. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పొదలకూరు
  7. చైతన్య విద్యాలయం ప్రైవేట్ పాఠశాల, పొదలకూరు
  8. డాన్ బొస్క్ ప్రైవేట్ పాఠశాల, పొదలకూరు
  9. నేతాజి ప్రైవేట్ పాఠశాల, పొదలకూరు

కళాశాలలు మార్చు

  1. విజ్ణాన్ జూనియర్ కళాశాల, పొదలకూరు
  2. ప్రభుత్వ జూనియర్ కళాశాల, పొదలకూరు
  3. కాకతీయ జూనియర్ కళాశాల, పొదలకూరు
  4. విజ్ణాన్ డిగ్రీ కళాశాల, పొదలకూరు
  5. యస్.పి.బి.వి.డి డిగ్రీ కళాశాల, పొదలకూరు

రాజకీయం మార్చు

దుగ్గుంట పంచాయతిలో ప్రస్తుత రాజకీయం తెలుగు దేశ౦, వై.యస్.ఆర్.కా౦గ్రేస్ పార్టీ మద్యనే ఉంది.

మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=కొనగలూరు&oldid=3975342" నుండి వెలికితీశారు