కొప్పుల మ‌హేష్ రెడ్డి

కొప్పుల మ‌హేశ్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[2] ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున పరిగి శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[3]

కొప్పుల మ‌హేశ్ రెడ్డి
కొప్పుల మ‌హేష్ రెడ్డి


పదవీ కాలం
2018- ప్రస్తుతం
ముందు రామ్మోహన్ రెడ్డి
నియోజకవర్గం పరిగి శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం ఫిబ్రవరి 5, 1973
పరిగి, వికారాబాదు జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు కొప్పుల హరీశ్వర్ రెడ్డి, గిరిజాదేవి[1]
జీవిత భాగస్వామి ప్రతిమారెడ్డి
సంతానం ఒక కుమారుడు, ఒక కుమార్తె
నివాసం పరిగి, వికారాబాదు జిల్లా, తెలంగాణ

జననం, విద్య మార్చు

మహేశ్ రెడ్డి 1973, ఫిబ్రవరి 5న హరీశ్వర్ రెడ్డి - గిరిజాదేవి దంపతులకు తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా, పరిగి గ్రామంలో జన్మించాడు. తండ్రి కొప్పుల హరీశ్వర్‌ రెడ్డి పరిగి మాజీ ఎమ్మెల్యే. పరిగి అసెంబ్లీ స్థానం నుంచి ఏడుసార్లు పోటీచేసి ఐదుసార్లు గెలిచాడు. మహేశ్ రెడ్డి 1990లో హైదరాబాదులోని లిటిల్ ఫ్లవర్ జూనియర్ కళాశాల నుండి ఇంటర్మీడియట్, 1993లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. కొంతకాలం వ్యాపారం చేశాడు.[4]

వ్యక్తిగత జీవితం మార్చు

మహేశ్ రెడ్డికి ప్రతిమారెడ్డితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

రాజకీయ విశేషాలు మార్చు

తండ్రి హరీశ్వర్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవడంతో 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పై పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి. రాంమోహన్ రెడ్డి పై 15,841 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[5][6]

మూలాలు మార్చు

  1. Sakshi (3 November 2018). "తనయుడి కోసం మాతృమూర్తి ఎన్నికల ప్రచారం". Archived from the original on 26 July 2021. Retrieved 26 July 2021.
  2. "Member's Profile - Telangana-Legislature". www.telanganalegislature.org.in. Archived from the original on 2021-05-27. Retrieved 2021-09-07.
  3. India, The Hans. "Koppula Mahesh Reddy's wife intensifies campaign". The Hans India (in ఇంగ్లీష్). Retrieved 2021-09-07.
  4. "Koppula Mahesh Reddy | MLA | TRS | Pargi | Vikarabad | Telangana". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-22. Retrieved 2021-09-07.
  5. "Pargi Assembly election Result 2018: TRS' K. Mahesh Reddy wins by 15,841 votes". www.timesnownews.com. Retrieved 2021-09-07.
  6. "K.mahesh Reddy(TRS):Constituency- PARGI(VIKARABAD) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-09-07.