కొల్లి శ్రీనాథ్ రెడ్డి
భారతీయ వైద్యుడు
ఆచార్య కొల్లి శ్రీనాథ్ రెడ్డి, భారతీయ హృద్రోగ నిపుణుడు. భారత ప్రజారోగ్య సమాఖ్య అధ్యక్షుడు, వరల్డ్ హార్ట్ ఫౌండేషన్ యొక్క అధ్యక్షుడు. వరల్డ్ హార్ట్ ఫౌండేషన్ అధ్యక్షస్థానాన్ని వహించిన తొలి భారతీయుడు.[2] పద్మభూషణ పురస్కార గ్రహీత. ఇతని తండ్రి కె.వి.రఘునాథరెడ్డి కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసిన వ్యక్తి. శ్రీనాథ్ రెడ్డి పి.వి.నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అతని వ్యక్తిగత వైద్యుడిగా పనిచేశాడు.
కొల్లి శ్రీనాథ్ రెడ్డి[1] | |
---|---|
జాతీయత | భారతీయుడు |
వృత్తి | వైద్యుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | ప్రజారోగ్యం |
సత్కారాలు, గుర్తింపులు
మార్చు- 2003: పొగాకు వాడకం నియంత్రణలో అంతర్జాతీయ స్థాయిలో విశిష్టమైన నేతృత్త్వానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ అవార్డు[3]
- 2005: ప్రజారోగ్య రంగంలో విశిష్ట సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ పురస్కారం.[4]
- 2009: ఫ్యాకల్టీ ఆఫ్ పబ్లిక్ హెల్త్, యు.కె. యొక్క ఫెలోషిప్ [5]
- 2012: లాసన్నే విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్
- 2012: 2013- 2015 కాల వ్యవధికి ప్రపంచ హార్ట్ ఫౌండేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక.[6]
- 2014: లండన్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ (మెడిసిన్) పట్టా[7]
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2014-10-19.
- ↑ Srinath Reddy is president of World Heart Federation - The Hindu, April 21, 2012
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-05-28. Retrieved 2017-09-24.
- ↑ పద్మభూషణ్ పురస్కారం#2005
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2017-09-24.
- ↑ APPOINTS PROF. K. SRINATH REDDY AS PRESIDENT 2013–2015 Archived 2016-03-05 at the Wayback Machine. World Heart Federation (2012-04-21). Retrieved on 2013-08-29.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2015-09-24. Retrieved 2017-09-24.