కోటా (రాజస్థాన్)

(కోటలు నుండి దారిమార్పు చెందింది)

కోట అనగా రాజులుండే పెద్ద కట్టడం. రాజులు తమ రాజ్యవ్యవస్థ, పాలనా యంత్రాంగం, పరివారజనులు, ఇతర రాజుల నుండి రక్షణ, దిగిమతుల నిల్వ మొదలగు వాటి నిర్వహణ కొరకు కోటలను నిర్మించేవారు.రాజ్య వ్యవస్థ అధికంగా విలసిల్లింది. భారతదేశంనందే కనుక ప్రపంచంలో ప్రసిద్ధమైన కోటలు అనేకం భారతదేశంనందే ఉన్నాయి.

భారతదేశంలోని రాజస్థాన్ లోని కుంభల్ ఘడ్ కోట ఆసియాలో పొడవైన కోటలలో ఒకటి. ఈ కోటను 15 వ శతాబ్దంలో రానా కుంభ నిర్మించాడు.350 కి పైగా హిందూ జైన దేవాలయాలు కోటలో ఉన్నాయి.

కోటల నిర్మాణం

మార్చు

పూర్వకాలం అంత భారీ నిర్మాణాలు ఎలా నిర్మించారు? అనేది కోటల నిర్మాణాల వెనుక గల పెద్ద ప్రశ్న. యంత్రపరికరాలు, ఇనుం, సిమెంటు లాంటివి లేని ఆ కాలంలో ఇప్పటికీ చెక్కు చెదరని బలమైన, భారీ కోటల నిర్మాణం చేసిన అప్పటి మేదావుల తెలివితేటలను అంచనావేయచ్చు. చరిత్రల కథల ఆధారంగా కోటల నిర్మాణాన్ని గురించి కొంత తెలుసుకొనవచ్చు. మానవశక్తినే ప్రధాన వనరుగా వినియోగించి కొండలను పిండిచేసి, రాళ్ళను తరలించేవారు. ఏనుగుల సహకారం ప్రతి కోట నిర్మాణం వెనుక ఉంటుంది. పెద్ద బండలను ఏతాం ద్వారా నీళ్ళు తోడే పద్ధతిన పైకి చేర్చడం చేసేవారు.కోట శంకుస్థాపన / పునాది వేసెప్పుడు ఒక సాధువు వచ్చి పునాదిలో తాబేలు వస్థుంది. అది వచ్చేవరకు తవ్వమని చెప్పారు, సుమారు 90 అడుగులు తవ్వాక తాబేలు దొరికింది. ఆ తరువాత కొట పనులు ప్రారంభించారు. ( పెద్దలు చెప్పే మాట)

చారిత్రిక ప్రాధాన్యత

మార్చు

దేశసంరక్షణకు, శత్రువులను ప్రతిఘటించి యుద్ధం చేయడానికి కోటలను నిర్మించుకున్నా, ఇప్పటి స్థితిగతుల్లో కోటల ప్రయోజనం నశించింది. 20వ శతాబ్ది క్రితం నాటి చరిత్రను అవగాహన చేసుకునేందకు కోటలు చాలా ఉపకరిస్తాయి. అయితే కోటలను సంరక్షించేందుకు పురావస్తు శాఖ చట్టాల ప్రకారం ప్రయత్నాలు చేయకముందు బ్రిటీష్ కాలంలో చాలా ప్రాసాదాలు, కోటలు రూపుమాసిపోయాయి. మదురై తిరుమలనాయకుని నగరు, తంజావూరులో నాయకరాజుల ప్రాసాదాలు, పెనుగొండలోని కృష్ణదేవరాయల గగన్ మహల్, చెన్నై ఆర్కాటునవాబు కలశమహల్ వంటివి బ్రిటీష్ పరిపాలన కాలంలో దెబ్బతినిపోయాయి. దీనివల్ల విజయనగర రాయలు, దక్షిణాంధ్ర నాయకులు, ఆర్కాటు నవాబులు వారి ప్రత్యేక మందిరాల్లో వ్యవహరించే తీరు, వారు అనుభవించే విలాసాలు, రాజకీయాంతర్గత వ్యవహారాలలో మాట్లాడేందుకు మాట్లాడేందుకు ఏర్పడిన మందిరాల గురించి తెలియకుండా పోతుంది.[1]

ప్రసిద్ధ కోటలు

మార్చు

ఆంధ్రప్రదేశ్ కోటలు

మార్చు

తెలంగాణ కోటలు

మార్చు

మూలాలు

మార్చు
  1. వెంకటరమణయ్య, నేలటూరు (1948). చారిత్రిక వ్యాసములు (1 ed.). మద్రాస్: వేదము వేంకటరాయశాస్త్రి అండ్ సన్స్. Retrieved 9 December 2014.

వెలుపలి లంకెలు

మార్చు