కోట్ల విజయభాస్కరరెడ్డి బొటానికల్ గార్డెన్స్

కోట్ల విజయభాస్కరరెడ్డి బొటానికల్ గార్డెన్స్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని మాదాపూర్ ఉన్న గార్డెన్.[1] దీనిని హైదరాబాద్ బొటానికల్ గార్డెన్స్ అని కూడా అంటారు. హైటెక్ సిటీకి దగ్గరగా ఉన్న దీనిని అటవీశాఖ వారు అభివృద్ధి పరుస్తున్నారు. హైదరాబాద్ రైల్వే స్టేషనుకు 16 కిలో మీటర్ల దూరంలో హైదరాబాద్ - ముంబై పాత హైవే రోడ్డు పక్కన ఈ బొటానికల్ గార్డెన్స్ ఉంది. విద్యార్థులకి, పర్యాటకులకి కూడా విజ్ఞానాన్ని, వినోదాన్ని కల్గిస్తుంది. బీజద్రవ్యం యొక్క అభివృద్ధి, పరిరక్షణ ఈ బొటనికల్ గార్డెన్ ముఖ్య ఉద్దేశం.

కోట్ల విజయభాస్కరరెడ్డి బొటానికల్ గార్డెన్స్
బొటానికల్ గార్డెన్స్ ప్రవేశ ద్వారం
రకంపట్టణ పార్కు
స్థానంహైదరాబాదు, తెలంగాణ
అక్షాంశరేఖాంశాలు17°27′18″N 78°21′25″E / 17.455°N 78.357°E / 17.455; 78.357
విస్తీర్ణం270 ఎకరాలు
స్థితిఉపయోగంలో ఉంది

గార్డెన్ వివరాలు సవరించు

ఈ గార్డెన్ 274 acres (1.11 km2)లో విస్తరించి ఉంది. ఇందులో 19 సెక్టార్‌లు లేదా 'వనాలు' ఉన్నాయి.[2][3] ఇక్కడ ఔషధ మొక్కలు, కలప చెట్లు, పండ్ల చెట్లు, అలంకార మొక్కలు, జల మొక్కలు, వెదురు మొదలైనవి ఉన్నాయి. పెద్ద నీటి కొలనులు, పచ్చికబయళ్ళు, అడవులు, గడ్డి, రాతి నిర్మాణాలను కలిగి ఉండేలా ఈ గార్డెన్ రూపొందించబడింది.

గార్డెన్ లో నడక మార్గంలో వెదురు చెల్లు ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. ప్రతి వెదురుపై దాని సాధారణ, శాస్త్రీయ పేర్లను సూచించే ప్రత్యేక సైన్ బోర్డులు ఏర్పాటు చేయబడ్డాయి. పామ్ సెక్టార్‌లో విభిన్న జాతుల చెట్లు ఉన్నాయి. ఇక్కడ పసుపు, ఊదా కాస్మోస్, బ్లూ సాల్వియా, ఎరుపు రాసేలియా మొదలైన అనేక రకాల పుష్పాలను చూడవచ్చు.

ఆధునీకరణ సవరించు

274 ఎకరాల అటవీ భూమిలోని 12 ఎకరాల భూమిలో అత్యాధునిక సాంకేతిక పరికరాలతో గాడ్జెట్ లతో సందర్శకుల పార్కుగా ఆధునీకరించబడింది. 30 కిలోవాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటుచేశారు. ఇందులో వాకింగ్‌, జాగింగ్‌, సైక్లింగ్‌, యోగా, జిమ్‌ లాంటి సౌకర్యాలతోపాటు వారాంతాల్లో కుటుంబ సమేతంగా వచ్చి సేదతీరేలా ప్రకృతి, అడవులు, వన్యప్రాణులపై అవగాహన కలిగేలా, పర్యావరణం ప్రాముఖ్యత తెలిసేలా పరిసరాలు తీర్చిదిద్దబడ్డాయి. నక్షత్ర వనం, రాశి వనం, నవగ్రహ వనం వంటి నూతనంగా అభివృద్ధి చేసిన వినోద సౌకర్యాలను 2018, జూలైలో తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించాడు.[4][5]

పాలపిట్ట సైక్లింగ్ పార్కు సవరించు

దీనికి సమీపంలోనే పాలపిట్ట సైక్లింగ్ పార్కు కూడా ఉంది.

ఎంట్రీ ఫీజు సవరించు

సందర్శకుల కోసం పెద్దలకు 30 రూపాయలు, పిల్లలకు పది రూపాయలు పార్క్‌ ఎంట్రీ ఫీజుగా నిర్ణయించబడింది.

 
Asian green bee-eater (Merops orientalis) in the botanical garden

ఇవి కూడా చూడండి సవరించు

మూలాలు సవరించు

  1. "Archive News". The Hindu. 2008-12-18. Archived from the original on 2009-02-15. Retrieved 2016-12-01.
  2. "Botanical Garden set for re-launch today".
  3. "Botanical Garden set for re-launch today". The Hindu (in Indian English). Special Correspondent. 2018-07-11. ISSN 0971-751X. Archived from the original on 2021-05-08. Retrieved 2021-10-27.{{cite news}}: CS1 maint: others (link)
  4. తెలంగాణ మ్యాగజైన్ (4 August 2018). "ఆహ్లాదం… ఆనందం". Archived from the original on 28 జనవరి 2021. Retrieved 27 October 2021.
  5. KV, Moulika (11 July 2018). "Botanical garden in Hyderabad reopens after renovations". The Times of India. Retrieved 21 February 2020.

బయటి లింకులు సవరించు