జలగం వెంగళరావు ఉద్యానవనం

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బంజారాహిల్స్ ఉన్న ఉద్యానవనం

జలగం వెంగళరావు ఉద్యానవనం (జెవిఆర్ పార్కు, బంజారా పార్కు) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బంజారాహిల్స్ ఉన్న ఉద్యానవనం.[1] ఈ పార్కుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 5వ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు పేరు పెట్టారు.[2] ఈ పార్కు సమీపంలో హోటల్ తాజ్ కృష్ణ, జివికె వన్ షాపింగ్ మాల్ ఉన్నాయి.

జలగం వెంగళరావు ఉద్యానవనం
జలగం వెంగళరావు ఉద్యానవనంలో చిన్నారుల ఆట స్థలం
రకంఉద్యానవనం
స్థానంబంజారాహిల్స్, హైదరాబాదు, తెలంగాణ
సమీప పట్టణంహైదరాబాదు
అక్షాంశరేఖాంశాలు17°25′22″N 78°26′56″E / 17.422642°N 78.448817°E / 17.422642; 78.448817
విస్తీర్ణం10 ఎకరాలు
నిర్వహిస్తుందిహైదరాబాదు మహానగరపాలక సంస్థ
తెరుచు సమయం2002

పార్కు వివరాలు మార్చు

అంతకుముందు ఈ ప్రాంతంలో ఏనుగుకుంట సరస్సు ఉండేది. 2020, ఆగస్టులో ప్రారంభించబడిన ఈ పార్కు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. పార్కు లోపల ఒక చిన్న చెరువు ఉంది. పాదచారులు నడవడానికి చుట్టూ వాకింగ్ ట్రాక్, చిన్నారులు అడుకోవడానికి ప్రత్యేకమైన ఆట స్థలం ఉన్నాయి. ఈ పార్కు నిర్వహణను హైదరాబాదు మహానగరపాలక సంస్థ చూసుకుంటుంది. ప్రతిరోజూ ఉదయం 5.00 నుండి ఉదయం 8.00 వరకు పాదచారులకు, ఉదయం 8.00 నుండి రాత్రి 8.00 వరకు సందర్శకులకు ఈ పార్కులో ప్రవేశం ఉంటుంది. పెద్దలకు 10 రూపాయలు, పిల్లలకు 5 రూపాయలు నామమాత్రపు ప్రవేశ రుసుము ఉంటుంది. నగరంలోని అన్ని ప్రాంతాలనుండి ఈ పార్కు వరకు బస్సులు అందుబాటులో ఉన్నాయి.

పార్కు ప్రధాన ద్వారంనుండి లోపలికి వెళ్ళగానే నిటారుగా ఉన్న చిన్నచిన్న ఫౌంటైన్లు కనిపిస్తాయి. విస్తారమైన మొక్కలు, చెట్లు ఉండడంతో సాయంత్రాలలో చల్లని గాలి వీస్తుంది. పావురం, చెరువులోని బాతులు సందడిగా చేస్తుంటాయి. పార్కులో ఉన్న క్యాంటీనులో చికెన్ బిర్యాని, మంచూరియన్, ఇతర ఆహార పదార్థాలు లభిస్తాయి. సినిమా షూటింగులకు, విద్యార్థుల విహారయాత్రలకు అనువైన పచ్చకబయళ్ళు కూడా ఉన్నాయి.[3]

ఇతర వివరాలు మార్చు

  1. పార్కు చెరువులోని నీటిని శుభ్రం చేయడానికి, ఉదయం నడిచేవారికి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాడానికి, పిల్లలకు క్రీడా సామగ్రిని సరఫరా చేయడానికి జిహెచ్ఎంసి మాజీ కమిషనర్ సోమేష్ కుమార్ రూ .90 లక్షలతో అభివృద్ధి ప్రణాళిక తయారుచేశాడు.[4]
  2. హైదరాబాదు నగర సుందరీకణలో భాగంగా ఈ పార్కు ప్రహరి గోడలకు రంగులు వేసి, అందమైన బొమ్మలు (అడవి జంతువులు, పక్షులు, నీటి జలపాతం బొమ్మలు) చిత్రీకరించారు.[5]

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. నమస్తే తెలంగాణ, హైదరాబాదు (5 June 2020). "పచ్చదనంతో శోభిల్లుతున్న భాగ్యనగరం.. ఆహ్లాదాన్ని పంచుతున్న ఉద్యానవనాలు". Archived from the original on 2020-06-13. Retrieved 13 June 2020.
  2. The Hans India, Hyderabad (18 November 2015). "Parks of the Hyderabad: Jalagam Vengala Rao Park". www.thehansindia.com. Archived from the original on 2020-06-13. Retrieved 13 June 2020. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2017-05-10 suggested (help)
  3. The Hindu, Hyderabad (20 January 2018). "Jalagam Vengala Rao Park: The green landmark". Srivathsan Nadadhur. Archived from the original on 2018-01-20. Retrieved 13 June 2020.
  4. The Hans India, Hyderabad (22 April 2015). "90 lakh to develop JVR Park". www.thehansindia.com. Archived from the original on 2020-06-13. Retrieved 13 June 2020.
  5. Telangana Today, Hyderabad (7 June 2017). "Jalagam Vengal Rao Park comes alive with GHMC wall paintings". T Lalith Singh. Archived from the original on 2020-06-13. Retrieved 13 June 2020.

ఇతర లంకెలు మార్చు