కోట్ల విజయభాస్కరరెడ్డి

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి
(కోట్ల విజయ భాస్కర రెడ్డి నుండి దారిమార్పు చెందింది)

కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడైన కోట్ల విజయభాస్కరరెడ్డి (ఆగష్టు 16, 1920 - సెప్టెంబర్ 27, 2001), ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండు సార్లు పనిచేశాడు. 1982 - 1983లో మొదటిసారి, 1992 నుండి 1994 వరకు రెండవసారి పదవిలో ఉన్నాడు. ఆయన కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేసాడు.విజయభాస్కర రెడ్డి1920 ఆగష్టు 16కర్నూలు జిల్లాలోని లద్దగిరి గ్రామములో జన్మించాడు. ఈయనకు భార్య శ్యామలా దేవి, ఇద్దరు కుమారులు (సూర్యప్రకాశ్ రెడ్డి, రమేష్ రెడ్డి), ముగ్గురు కుమార్తెలు (వాసంతి, ఇందుమతి, వరలక్ష్మి) కలరు. విజయభాస్కరరెడ్డి సెప్టెంబర్ 27, 2001 న మరణించాడు.

కోట్ల విజయభాస్కరరెడ్డి
కోట్ల విజయభాస్కరరెడ్డి


పదవీ కాలం
20 సెప్టెంబరు 1982 – 9 జనవరి 1983
ముందు భవనం వెంకట్రామ్
తరువాత నందమూరి తారక రామారావు
నియోజకవర్గం కర్నూలు (జనరల్)

పదవీ కాలం
9 అక్టోబరు 1992 – 12 డిసెంబరు 1994
ముందు నేదురుమల్లి జనార్ధనరెడ్డి
తరువాత నందమూరి తారక రామారావు

పదవీ కాలం
1977–1979, 1984–1989, 1989–1991, 1991–1992, 1996–1998

వ్యక్తిగత వివరాలు

జననం (1920-08-16)1920 ఆగస్టు 16 [1]
అమకతడు, లడ్డగిరి గ్రామం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్
మరణం 2001 సెప్టెంబరు 27(2001-09-27) (వయసు 81)
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి కె.శ్యామలారెడ్డి
సంతానం ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు
పూర్వ విద్యార్థి బీసెంట్ థియొసోఫికల్ కళాశాల, మదనపల్లె
మద్రాసు న్యాయ కళాశాల, మద్రాసు, తమిళనాడు
వృత్తి వ్యవసాయదారుడు, న్యాయవాది, క్రీడాకారుడు, రాజకీయనాయకుడు, సామాజ సేవకుడు
కేబినెట్ క్యాబినెట్ మంత్రి, భారత ప్రభుత్వం (1983–1984 and 1991–1992)
శాఖ షిప్పింగ్, రవాణా, పరిశ్రమలు-కంపెనీవ్యవహారాలు(1983–1984), న్యాయశాఖ, కంపెనీ వ్యవహారాలు (1991–1992)

రాజకీయ జీవితం

మార్చు

తొలిసారి 1955లో ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 2 సార్లు కర్నూలు జిల్లా పరిషత్తు చైర్మెన్‌గా పనిచేశాడు. మొత్తం 5 సార్లు శాసనసభకు, 6 సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. రాష్ట్ర మంత్రిగా, కేంద్రమంత్రిగా, 2 సార్లు ముఖ్యమంత్రిగా కొనసాగినాడు.

విశేషాలు

మార్చు
  • పాత ఎం.ఎల్.ఎ. క్వార్టర్స్.లో, గోపీ హోటల్.లో మిత్రులతో సరదాగా పేకాడుకోవటం ఆయన హాబీ.
  • ఎన్.టి.రామారావు ఇస్తున్న హామీలకు మారుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన తాను కూడా కిలో బియ్యం రూ. 1.90 పైసలకే ఇస్తామని చెప్పినా జనం పట్టించుకోలేదు. రెండు పర్యాయాలు కూడా తన చేతి మీదుగా కాంగ్రెస్.ను వోడించి ఎన్.టి. రామారావుకు అధికారం కట్టబెట్టిన పేరు విజయభాస్కర రెడ్డికే దక్కింది.
  • 1999 ఎన్నికలలో ఓడిపోయి రాజకీయాలనుండి పదవీవిరమణ చేసాడు.

లోక్‌సభ సభ్యుడిగా

మార్చు

విజయభాస్కర్ రెడ్డి 6 సార్లు కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు. మొదటిసారి 1977లో ఆరవ లోక్‌సభకు ఎన్నికవగా, మధ్యలో 8 వ లోక్‌సభకు మినహా 12వ లోక్‌సభ వరకు వరుసగా ఎన్నికైనాడు.

మూలాలు

మార్చు
  1. "Biographical Sketch of Member of XII Lok Sabha". Parliamentofindia.nic.in. Archived from the original on 29 జూలై 2011. Retrieved 15 October 2011.


ఇంతకు ముందు ఉన్నవారు:
భవనం వెంకట్రామ్
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
20/09/1982—09/01/1983
తరువాత వచ్చినవారు:
నందమూరి తారక రామారావు


ఇంతకు ముందు ఉన్నవారు:
నేదురుమిల్లి జనార్ధనరెడ్డి
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
09/10/1992—12/12/1994
తరువాత వచ్చినవారు:
నందమూరి తారక రామారావు