కోమటిరెడ్డి వెంకటరెడ్డి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఇతను 1963 మే 23న జన్మించాడు.[1] 1999, 2004, 2009, 2014లలో నల్లగొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. నల్గొండ స్థానం నుంచి వరసగా 3 సార్లు విజయం సాధించిన తొలి సభ్యుడూ ఇతనే. వైఎస్సార్, రోశయ్య మంత్రివర్గాలలో ఐటీ, యువజన సర్వీసులు, క్రీడల మంత్రిగా పనిచేశాడు.[2] ఆయన కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మౌలిక వసతులు, పెట్టుబడులు, రేవుల శాఖ మంత్రిగా పనిచేశాడు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మంత్రిపదవికి రాజీనామా చేయగా గవర్నరు 2011 అక్టోబరు 5న ఆమోదించాడు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి | |||
![]()
| |||
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి
| |||
నియోజకవర్గం | నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బ్రాహ్మణవెల్లెంల, నార్కెట్‌పల్లి మండలం, నల్లగొండ జిల్లా | 1963 మే 23||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | పాపిరెడ్డి, సుశీలమ్మ | ||
జీవిత భాగస్వామి | సబిత | ||
సంతానం | శ్రీనిధి |
ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2009 లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి ఎంపీగా ఎన్నికయ్యాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.[3] ఆయన 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ పై 4500 ఓట్ల మెజారిటీతో గెలిచాడు.[4] 2022 ఏప్రిల్ 10న కాంగ్రెస్ అధిష్టానం ఆయనను 2023 శాసన సభ ఎన్నికల టీ కాంగ్రెస్‌కు స్టార్ క్యాంపెనర్‌గా నియమించింది.[5] ఆయనను 2023 సెప్టెంబర్ 20న కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలో స్థానం కల్పిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.[6]
మూలాలు సవరించు
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-05-18. Retrieved 2011-09-26.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-03-15. Retrieved 2011-09-26.
- ↑ Sakshi (20 March 2019). "భువనగిరి బరిలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి". Archived from the original on 25 July 2021. Retrieved 25 July 2021.
- ↑ News18 Telugu (23 May 2019). "Telangana Election Result 2019: తెలంగాణలో కాంగ్రెస్‌కి రెండు... ఉత్తమ్, కోమటిరెడ్డి విజయం..." News18 Telugu. Retrieved 25 May 2021.
- ↑ V6 Velugu (10 April 2022). "కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి" (in ఇంగ్లీష్). Archived from the original on 12 April 2022. Retrieved 12 April 2022.
- ↑ Sakshi (20 September 2023). "ఎలక్షన్ స్క్రీనింగ్ కమిటీలో కోమటిరెడ్డి, మధుయాష్కీలకు చోటు". Archived from the original on 21 September 2023. Retrieved 21 September 2023.