కోరిందపండు
కోరిందపండు(ఆంగ్లం: Raspberry, ర్యాస్బెఱి) గులాబి పూవు కుటుంబానికి చెందిన "రూబస్"అనే జన్యువుగల వృక్షజాతుల సమూహంలో భాగమైన ఒక తినదగిన పండు. ఈ పండ్లు రూబస్ జన్యువులోని ఉపజన్యువైన "ఇడియోబాటస్"కి ముఖ్యంగా చెందినవి. కోరిందపండ్ల చెట్లు కలపకాండలతో సంవత్సరం పొడవునా పండ్లను ఇస్తాయి.

జాతులు సవరించు
రూబస్ జన్యువులోని ఉపజన్యువైన "ఇడియోబాటస్"కి చెందిన కోరిందపండ్ల ఉదాహరణలు:
- రూబస్ క్రాటేజిఫోలియస్ (ఆసియా కోరిందపండు)
- రూబస్ గున్నియానస్ (టాస్మేనియా పర్వత కోరిందపండు)
- రూబస్ ఇడేయస్ (ఐరోపా ఎఱుపు కోరిందపండు)
- రూబస్ ల్యూకోడెర్మిస్ (తెలుపుబెరడు or పాశ్చాత్య కోరిందపండు, నీల కోరిందపండు, నలుపు కోరిందపండు)
- రూబస్ ఓస్సిడెంటలిస్ (నలుపు కోరిందపండు)
- రూబస్ పార్విఫోలియస్ (ఆస్ట్రేలియా స్థానిక కోరిందపండు)
- రూబస్ ఫీనికోలాసియస్ (మధు కోరిందపండులేదా మధుపండు)
- రూబస్ రోజిఫోలియస్ (మారిషస్ కోరిందపండు)
- రూబస్ స్ట్రైగోసిస్ (అమెరికా ఎఱుపు కోరిందపండు)
- రూబస్ఎలిప్టికస్ (హిమాలయపు పసుపు కోరిందపండు)
రూబస్ జన్యువుకే ఏకంగా చెందిన కోరిందపండ్లు ఇవి:
- రూబస్ డెలిషియోకస్ (గండశిలా కోరిందపండు, ఉపజన్యువు: అనోప్లోబాటస్)
- రూబస్ ఓడరేటస్ (పుష్పిత కోరిందపండు, ఉపజన్యువు: అనోప్లోబాటస్)
- రూబస్ నివాలిస్ (మంచు కోరిందపండు, ఉపజన్యువు: ఖామాబాటస్)
- రూబస్ ఆర్క్టికస్ (ఉత్తరధ్రువపు కోరిందపండు, ఉపజన్యువు: సైక్లాక్టిస్)
- రూబస్ సీబోల్డి (మోల్యుకా కోరిందపండు, ఉపజన్యువు: మలాఛోబాటస్)
సాగు-ఉత్పత్తి సవరించు
కోరిందపండ్ల గింౙలను సంప్రదాయపరంగా శీతాకాలంలో సాగుకై నాటుతారు, నేడు ప్రయోగశాలల్లో పుట్టించిన కోరింద మిశ్రమమొక్కలను నేరుగా మట్టిలో నాటుతున్నారు. సాధారణంగా ఈ మొక్కలను మీటరుకు రెండు నుండి ఆఱుచొప్పున సారవంతమైన, పారుదల నేలలో నాటుతారు. మొక్కలు చుట్టూ గట్లు కడతారు. మొక్కలు ఒక ఎత్తుకు వచ్చేవరకు వాటిని జాగ్రత్తగా చూసుకుంటారు. ముఖ్యంగా మొక్కల వేర్లను పురుగులు దాడిచేయకుండా చూడాలి.
అన్ని కోరిందపొదల కాడలు, సాగుయొక్క తొలినాళ్లలో బాగా ఎదుగుతాయి. నిజానికి బాగా ఎదిగిన ఆ కోరిందకాండాలకు సాగుచివరిలో కాలంలో పండ్లు వస్తాయి. కోరింద పూవులు తేనెటీగలకు ఇతర సంపర్కకారక కీటకాలకు మకరందనిధులు. కోరిందపొదలు ఓజఃభరితాలు మఱియు శక్తివంతమైనవి. పక్కనే నాటబడిన ఇతరమొక్కలను, పొదలను ఇవి తమ వేర్లద్వారా దాడిచేసి ఆ మొక్కల బలాన్ని క్షీణింపజేసే గుణం గలవి. అందుకే ఇవి త్వరగా పెరిగి పండ్లును ఇచ్చే స్థాయికి వచ్చేస్తాయి. గమనించకపోతే ఇవి త్వరగా తోటంతా పాకి, తోటలోని ఇతరమొక్కలను చంపేస్తాయి. కోరిందపొదలు తడిమట్టిలో చాలా త్వరగా వేర్లను పెంచుకుని విస్తరిస్తాయి.
చూడటానికి పండు మంచి ఎఱుపు రంగులోకి (లేదా విత్తనం జాతినిబట్టి నలుపు, ఊదా, బంగారు రంగులలోకి) వచ్చి ఉండగా మఱియు పండ్లు తేలికగా మొక్కనుండి విడివడినప్పుడు, వాటి సేకరింపును ప్రారంభిస్తారు. పండ్లు బాగా ముగ్గినప్పుడే వాటి తియ్యటి రుచి బయటపడుతుంది. బాగా ముగ్గిపోయి, ముట్టుకుంటేనే ముద్దైపోతున్న పండ్లను సాధారణంగా మురబ్బాలను , జామ్లను తయారుచేయడానికి వినియోగిస్తారు.
ముఖ్యమైన సాగురకాలు సవరించు
ఉష్ణమండల ప్రాంతాలలో పెరిగే ఈ కోరిందపండ్లు వాణిజ్యపరంగా మంచిగిరాకీ ఉన్న పండ్లు. నేటి కోరిందలు ముఖ్యంగా రూబస్ ఇడేయస్ మఱియు రూబస్ స్ట్రైగోసిస్ అనే జన్యుజాతుల యొక్క జన్యుకలయికలే. వృక్షశాస్త్రవేతలు ఈ మధ్యనే ముళ్లు తక్కువ ఉండి, ఎటువంటి కర్రసహాయం లేకుండానే పెరిగే క్రొత్తరకం కోరిందమొక్కలను పుట్టించారు.
రూబస్ ఓస్సిడెంటలిస్ అనే నలుపు కోరిందపండు ఇతర కోరిందపండ్లకన్నా దాని యొక్క ప్రత్యేకమైన విశిష్టమైన రుచికి ప్రసిద్ధి. ముఖ్యంగా ఇది జాంలలో ఎక్కువ ఉపయోగించబడుతుంది.
ఊదాకోరిందలు ఎఱుపు మఱియు నలుపు కోరిందల జన్యువులను మేళవించగా పుట్టిన కొత్తరకం పండు. అడవులలో ప్రాకృతికంగా పెరిగే కోరిందజాతులు కేవలం ఎఱుపు-నలుపు కోరిందలు మాత్రమే. మిగిలినవన్ని ఈ రెండు జాతులనుండి కృతిమంగా ప్రయోగశాలలలో పుట్టించబడినవి.
రూబస్ ఓస్సిడెంటలిస్ మఱియు రూబస్ స్ట్రైగోసిస్ జాతులను కలుపగా వచ్చినదే నీల కోరిందపండు.
ప్రత్యేక ఉత్పత్తులు సవరించు
వ్యాధులు మఱియు చీడ సవరించు
గొంగళి పురుగులు మఱియు ఱెక్కలపురుగులు ఎక్కువగా కోరిందపండ్లను తినేస్తాయి. బోట్రిటిస్ సైనేరియా అనే ఒక శిలీంధ్రం,(సాధారణంగా బూడిద బూజు అని పిలువబడుతుంది),
తేమ వాతావరణాలలో ఎక్కువగా మొక్కకు చీడగా పడుతుంది. అది ముఖ్యంగా ముద్దైపోయిన పండ్లును ఆక్రమిస్తుంది, పిమ్మట ఆ శిలీంధ్రం తన సిద్ధబీజాలను మిగిలిన పండ్లకు త్వరగా వెదజల్లిస్తుంది.
ఒకప్పుడు బంగాళదుంపలు, టామాటాలు, మిరపకాయలు, వంకాయలు లేదా ఉల్లిపాయలను పెంచిన మట్టిలో వీటిని, ఆ మట్టిని సరియైన శుద్ధిచేయకుండా పెంచకూడదు. ఎందుకంటే ఆయా పంటలకు సాధారణంగా వచ్చే "వెర్టిసిల్లియం విళ్ట్"అనే ఒక రకం శిలీంధ్రం ఆ మట్టిలో ఎన్నో సంవత్సరాలపాటు ఉండిపోతుంది. అది కోరిందపంటను నాశనం చేయగలదు.
ప్రపంచోత్పత్తి సవరించు
2016లో, ప్రపంచవ్యాప్తంగా సాగుచేయబడిన కోరిందపండ్ల మొత్తంబరువు 7,95,249 టన్నులు, అందులోరష్యా అధికశాతం(21శాతం, అనగా 1,64,602 టన్నులు) ఉత్పత్తి చేసింది (క్రింది పట్టికను చూడండి). ఇతర ముఖ్య ఉత్పత్తిదారులు అమెరికా సంయుక్త రాష్ట్రాలు (17 శాతం),పోలాండ్ (16 శాతం) మఱియు మెక్సికో (14 శాతం) (క్రింది పట్టికను చూడండి).
క్ – 2016 | |
---|---|
Country | Production (thousands of tonnes) |
ఉపయోగాలు సవరించు
Nutritional value per 100 g (3.5 oz) | |
---|---|
శక్తి | 220 kJ (53 kcal) |
11.94 g | |
చక్కెరలు | 4.42 g |
పీచు పదార్థం | 6.5 g |
0.65 g | |
1.2 g | |
విటమిన్లు | Quantity %DV† |
థయామిన్ (B1) | 3% 0.032 mg |
రైబోఫ్లావిన్ (B2) | 3% 0.038 mg |
నియాసిన్ (B3) | 4% 0.598 mg |
పాంటోథెనిక్ ఆమ్లం (B5) | 7% 0.329 mg |
విటమిన్ బి6 | 4% 0.055 mg |
ఫోలేట్ (B9) | 5% 21 μg |
కోలీన్ | 3% 12.3 mg |
విటమిన్ సి | 32% 26.2 mg |
Vitamin E | 6% 0.87 mg |
విటమిన్ కె | 7% 7.8 μg |
ఖనిజములు | Quantity %DV† |
కాల్షియం | 3% 25 mg |
ఇనుము | 5% 0.69 mg |
మెగ్నీషియం | 6% 22 mg |
మాంగనీస్ | 32% 0.67 mg |
ఫాస్ఫరస్ | 4% 29 mg |
పొటాషియం | 3% 151 mg |
జింక్ | 4% 0.42 mg |
ఇతర భాగాలు | పరిమాణం |
నీరు | 85.8 g |
| |
†Percentages are roughly approximated using US recommendations for adults. Source: USDA Nutrient Database |
ఇవి కూడా చూడు సవరించు
సూచనలు సవరించు
- ↑ "Production of raspberries in 2016; Pick list by Crops/Regions/Production Quantity". United Nations Food and Agriculture Organization Corporate Statistical Database (FAOSTAT). 2018. Retrieved 19 February 2018.
ఇవి కూడా చదువు సవరించు
- Funt, R.C. / Hall, H.K. (2012). Raspberries (Crop Production Science in Horticulture). CABI. ISBN 978-1-84593-791-1978-1-84593-791-1
బాహ్య లంకెలు సవరించు
- Media related to Raspberry at Wikimedia Commons
- ఎన్సైక్లోపీడియా బ్రిటానికా (in ఇంగ్లీష్). Vol. 22 (11th ed.). 1911. .
- Raspberries & More (University of Illinois Extension)