కోరుకున్న ప్రియుడు

కోరుకున్న ప్రియుడు 1997 లో ముప్పలనేని శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో వడ్డే నవీన్, ప్రేమ ముఖ్యపాత్రల్లో నటించారు.

కోరుకున్న ప్రియుడు
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం ముప్పలనేని శివ
తారాగణం వడ్డే నవీన్ ,
ప్రేమ,
వాణిశ్రీ
రమ్యశ్రీ
సంగీతం కోటి
నిర్మాణ సంస్థ శ్రీ వెంకటసాయి పిక్చర్స్
భాష తెలుగు

కథసవరించు

విజయ్, ప్రియాంక ఒకే కళాశాలలో చదువుతుంటారు. విజయ్ తన పని తాను చూసుకుంటూ ఇతరుల విషయాల్లో తలదూర్చని వ్యక్తిత్వం కలవాడు. విజయ్ ప్రమేయం లేకుండానే అతను కాలేజీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు పోస్టర్లు వెలుస్తాయి. అవి చూసి విజయ్ మీద దాడిచేయబోతారు అతని ప్రత్యర్థి బృందం. విజయ్ వాళ్ళను అడ్డుకుని అసలు విషయం ప్రిన్సిపల్ కి తెలియజేస్తాడు. ఆయన కళాశాల ప్రశాంతంగా ఉండాలంటే విజయ్ లాంటి మంచి వ్యక్తి అధ్యక్షుడిగా పోటీ చేయాలని చెబుతాడు. విజయ్ ఎన్నికల్లో గెలుస్తాడు.

ప్రియాంక తల్లి ఆమెకు తెలియకుండా ఓ ధనవంతుడైన అబ్బాయితో పెళ్ళి నిశ్చయిస్తుంది. ఎదురు తిరిగిన ప్రియాంకతో నీవు ఎవరినో ప్రేమిస్తున్నావని నిందిస్తుంది. దాంతో ఆలోచనలో పడ్డ ప్రియాంక నిజంగానే విజయ్ ని ప్రేమిస్తుంది.

తారాగణంసవరించు

పాటలుసవరించు

ఈ సినిమాకు కోటి సంగీత దర్శకత్వం వహించాడు. ఇందులో మొత్తం ఆరు పాటలున్నాయి.[1]

  • కొంగు పట్టి లాగాడే కోరుకున్న ప్రియుడు
  • కోయిలమ్మా
  • మైనా మైనా
  • నాటీ పాప
  • న్యాయ దేవతకు
  • ఓహో వయ్యారం

మూలాలుసవరించు

  1. "కోరుకున్న ప్రియుడు పాటలు". naasongs.com. Retrieved 16 November 2017. CS1 maint: discouraged parameter (link)