రమ్యశ్రీ ఒక తెలుగు చలన చిత్ర నటి. ఈమె అసలుపేరు సుజాత. చిత్రరంగములో అడుగిడిన తర్వాత అప్పటికే అదే పేరుతో మరొక నటి ఉండటంతో తన పేరును మార్చుకొంది. ఈమె పుట్టిన ఊరు విశాఖపట్నం. ఈమె కన్నడ, తమిళ, మళయాల, హిందీ, భోజ్ పురి భాషలలో 250 చిత్రాలలో నటించింది[1].కన్నడలో ప్రధాన నాయికగా 36 చిత్రాలలో నటించింది. ఈమె నటించిన ఆర్యభట్ట అనే కన్నడ చిత్రానికి కర్ణాటక రాష్ట్రప్రభుత్వ పురస్కారం కూడా లభించింది. ప్రముఖ తెలుగు నటి సౌందర్య ఈ చిత్రంలో మరొక కథానాయికగా నటించింది. ఎక్కువగా శృంగార రస పాత్రలను పోషిస్తుంటుంది. అలాగే కొన్ని ప్రకటనలలో కూడా నటించింది.

రమ్యశ్రీ
Ramyasri.jpg
జన్మ నామంసుజాత
జననం జులై 18, 1970

నటించిన చిత్రాలుసవరించు

తెలుగుసవరించు

  1. బాబాల బాగోతం (2012)
  2. సరదాగా కాసేపు (2010)
  3. బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ (2008)
  4. ఫూల్స్ (2003)
  5. ప్రేమసందడి (2001)
  6. ఆది
  7. రాఘవ
  8. రాజకుమారుడు
  9. నువ్వు నేను
  10. మా ఆయన సుందరయ్య (2001)
  11. చంద్రిక
  12. కోరుకున్న ప్రియుడు (తెలుగులో మొదటి చిత్రం)
  13. ఆవారాగాడు (1998)

కన్నడసవరించు

  • ఆర్యభట

హిందీసవరించు

భోజ్‌పురిసవరించు

పురస్కారాలుసవరించు

  1. నంది పురస్కారం - 2013 నంది పురస్కారాలు: ప్రత్యేక బహుమతి (ఓమల్లి)[2][3][4][5]

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-09-29. Retrieved 2010-10-24.
  2. "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 25 June 2020.
  3. మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
  4. సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
  5. నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=రమ్యశ్రీ&oldid=3204395" నుండి వెలికితీశారు