ముప్పలనేని శివ

సినీ దర్శకుడు

ముప్పలనేని శివ ఒక ప్రముఖ సినీ దర్శకుడు. తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలైన సురేష్ ప్రొడక్షన్స్, స్రవంతి మూవీస్, సూపర్ గుడ్ ఫిలింస్, రామకృష్ణ సినీ స్టూడియోస్ లతో సినిమాలు చేశాడు.[1][2]

ముప్పలనేని శివ
Muppalaneni shiva.jpg
జననం
ముప్పలనేని శివ

(1968-11-25) 25 November 1968 (age 54)
జాతీయతభారతీయుడు
వృత్తిదర్శకుడు

జీవిత విశేషాలుసవరించు

ముప్పలనేని శివ గుంటూరు జిల్లా, బాపట్లలో 1968, నవంబరు 25 న జన్మించాడు. తన స్వస్థలమైన నరసాయ పాళెంలో పమిడి అంకమ్మ ఉన్నత పాఠశాలలో చదివాడు. బాపట్లలోని ఆర్ట్స్ అండ్ సైన్సు కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. కాలేజీ రోజుల్లో పెయింటింగ్ లో అభినివేశం ఉండేది. ఆధునిక చిత్రకళలో రాష్ట్ర స్థాయి పురస్కారాలు కూడా అందుకున్నాడు.

కెరీర్సవరించు

ప్రారంభంలో శివ ఎ.కోదండరామిరెడ్డి, ముత్యాల సుబ్బయ్య, పరుచూరి సోదరులతో కలిసి పనిచేశాడు. కోదండరామిరెడ్డి దగ్గర సుమారు 20 సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ఆ సమయంలో అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, కమల్ హాసన్, శ్రీదేవి వంటి వారితో పనిచేశాడు. 1994 లో కృష్ణతో కలిసి ఘరానా అల్లుడు అనే సినిమా చేశాడు. తర్వాత 1995లో వచ్చిన తాజ్ మహల్ సినిమాతో మంచి గుర్తింపు పొందాడు.

సినిమాలుసవరించు

దర్శకుడిగా
వ.సం సంవత్సరం సినిమా
1 1994 ఘరానా అల్లుడు
2 1995 తాజ్ మహల్
3 1997 కోరుకున్న ప్రియుడు
4 1997 ప్రియా ఓ ప్రియా
5 1998 గిల్లి కజ్జాలు
6 1998 శుభలేఖలు
7 1999 స్పీడ్ డాన్సర్
8 1999 రాజా (1999 సినిమా)
9 2000 మా పెళ్ళికి రండి
10 2000 పోస్ట్ మ్యాన్
11 2001 అమ్మాయి కోసం
12 2002 నీ ప్రేమకై
13 2002 సందడే సందడి
14 2004 దోస్త్
15 2005 సంక్రాంతి
16 2006 రాజాబాబు
17 2007 అల్లరే అల్లరి
18 2009 లైఫ్ స్టైల్
19 2016 శ్రీశ్రీ

మూలాలుసవరించు

  1. "Muppalaneni Shiva". blogspot.in. 22 November 2011. Archived from the original on 4 నవంబర్ 2014. Retrieved 11 February 2013. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  2. "Muppalaneni Shiva Filmography". telugucolours.com. Retrieved 11 February 2013.