కోరుకొండ సైనిక పాఠశాల
కోరుకొండ సైనిక పాఠశాల (కోరుకొండ సైనిక్ స్కూల్) ఆంధ్రప్రదేశ్, విజయనగరం జిల్లా, విజయనగరం మండలంలోని కోరుకొండ గ్రామంలో వున్నది. ఇది దేశంలో తొలిగా ప్రారంభించబడిన సైనిక పాఠశాలలలో ఒకటి.
సైనిక పాఠశాల, కోరుకొండ | |
---|---|
స్థానం | |
భారతదేశం | |
సమాచారం | |
రకం | పబ్లిక్ స్కూలు భారత రక్షణ శాఖచే నడుపబడుతున్నది |
Motto | Ever Loyal |
స్థాపన | 18 జనవరి 1962 |
స్థాపకులు | Cdr. ఆల్మెడా (మొదటి ప్రధానాచార్యులు) |
President | Vice Admiral A K Chopra |
పాఠశాల అధిపతి | Lt Col M Ashok Babu |
తరగతులు | తరగతులు 6 - 12 |
Gender | బాలురు |
వయస్సు | 10 to 18 |
విద్యార్ధుల సంఖ్య | 525 |
Campus size | 206-ఎకరం (0.83 కి.మీ2) |
Campus type | Fully Residential,and for Boys only |
Colour(s) | Grey and Maroon |
పరీక్షల బోర్డు | CBSE |
పూర్వ విద్యార్థులు | Saikorian Aulmni Association Official website |
గదులు | మౌర్య,కాకతీయ,పల్లవ,పాండ్య,చాళుక్య,గుప్త, గజపతి |
Website | School Official website |
చరిత్ర
మార్చుకోరుకొండ ప్యాలెస్ ను 1911 వ సంవత్సరంలో పూసపాటి చిట్టిబాబు విజయరామ గజపతిరాజు నిర్మించాడు. విద్యార్థుల కొరకు ఒక ప్రత్యేక పాఠశాల నిర్మిస్తే బాగుంటుందన్న ఆలోచన తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకి కలిగింది. ఆ బాధ్యతను అప్పటి రక్షణ మంత్రి వి. కె. కృష్ణ మేనన్ పైన పెట్టాడు. అవిధంగా దేశవ్యాప్తంగా సైనిక పాఠశాలలు ప్రారంభమైనాయి.
ఆంధ్ర ప్రదేశ్లో సరైన ప్రాంగణం కొరకు అన్వేషణ మొదలైంది. విద్యాధికుడైన డా: పూసపాటి వెంకట గజపతిరాజుకి ఆ సంగతి తెలిసింది. విజయనగరానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో వున్న తమ కోరుకొండ ప్యాలెస్ ను పాఠశాల కొరకు ఇవ్వడానికి ఆయన ముందుకొచ్చారు. 1961 సెప్టెంబరు 19 న ఆ అందమైన భవంతితో పాటు 206 ఎకరాల భూమిని కూడా దానంగా ఇచ్చేశాడు. 1961-62 వ సంవత్సరంలో ఆ పాఠశాల ప్రారంభమైంది. రక్షణ శాఖ ఆధ్వర్యంలో సైనిక పాఠశాలల సొసైటి పర్వవేక్షణ బాధ్యతలు చూస్తుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 24 సైనిక పాఠశాలలు ఉన్నాయి.
ప్రవేశ పద్ధతి
మార్చుఇక్కడ చేరడానికి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణ సాధించాలి. ఇక్కడ ఆరవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు భోదిస్తారు. బాలురకు మాత్రమే ప్రవేశం. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల మూడో ఆదివారం 6, 9 తరగతులకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలు మన రాష్ట్రంలో అనంతపురం, ఏలూరు, గుంటూరు, తిరుపతి, హైదరాబాద్, విజయనగరం కేంద్రాల్లో నిర్వహిస్తారు.
ఆరవ తరగతి ప్రవేశ పరీక్షకు మూడు పేపర్లుంటాయి. గణిత పరీక్షకు 100 మార్కులు 90 నిమిషాల్లో రాయాలి. భాషాసామర్ధ్య పరీక్షకు 100 మార్కులు 45 నిమిషాల్లో రాయాలి. అలాగే ఇంటలిజెంస్ పరీక్షలో మూడు విభాగాలకు 100 మార్కులుంటాయి. ఇవిగాక మౌఖిక పరీక్ష కూడా ఉంటుంది.
తొమ్మిదవ తరగతి పరీక్షకు నాలుగు పేపర్లు రాయాలి. గణితానికి 200 మార్కులు - 120 నిమిషాల వ్యవధి; సామాన్య జ్ఞానానికి 75 మార్కులు - 45 నిమిషాల వ్యవధి ఉంటుంది. మౌఖిక పరీక్షకూడా నిర్వహిస్తారు.
ఆరవ తరగతి పరీక్షను ఇంగ్లీషులోగాని, గుర్తించిన ఏ భారతీయ భాషలోగాని రాయవచ్చు. కానీ తొమ్మిదవ తరగతి పరీక్షలో ప్రశ్నాపత్రాలు ఇంగ్లీషులోనే వుంటాయి. సమాధానాలు ఇంగ్లీషులోగాని, గుర్తించిన ఏ భారతీయ భాషలోగాని రాయవచ్చును.
ప్రముఖ పూర్వ విద్యార్థులు
మార్చు- Lt Gen కె. ఆర్. రావు, Director General, Artillery; Indian Army
- Lt Gen సురేంద్రనాథ్, General officer Commanding in Chief, ARTRAC (Army Training Command), Shimla; Indian Army
- దువ్వూరి సుబ్బారావు, Governor, Reserve Bank of India
- Commodore సి. ఉదయ్ భాస్కర్, Indian Navy, Defence Analyst
- ఎన్.ఎస్.ఆర్. చంద్రప్రసాద్, CMD, National Insurance Co Ltd
- కె. విజయ భాస్కర్ - తెలుగు సినిమా దర్శకుడు
- Wing Commander ఎం.కె. రెడ్డి, Tensing Norgay National Adventure Award Winner
- మల్లి మస్తాన్ బాబు - పర్వతారోహకుడు. ప్రపంచంలోని ఏడు ఖండాలలోని అతిపెద్ద పర్వతాలను 171 రోజుల్లో అధిరోహించి గిన్నీస్ బుక్ లోకి ఎక్కాడు.
- Capt. ఉదయ్ భాస్కర్ రావు - died on the Indian Army's Mount Everest expedition
- Brig. వి.ఎస్. శ్రీనివాస్ - Commander ; 93 Inf Bde.
- కె.ఎస్.ఆర్ చరణ్ రెడ్డి -IPS, Inspector General of Police -Internal Security ( Karnataka)
- బి. చంద్రశేఖర్- IPS, Inspector General of Police- Punjab Cadre- Commandant NISA, Hyderabad
గ్యాలరీ
మార్చు-
తరగతి గదుల భవనం
-
బాలుర వసతిగృహం
-
పాఠశాల ఆడిటోరియం
-
పాఠశాలకు చేర్చే ముఖ్యమైన రహదారి
-
పాఠశాల క్రీడాప్రాంగణం
-
పాఠశాల భోజనశాల
-
జిమ్నాస్టిక్స్
మూలాలు
మార్చు- రేపటి పౌరుల విద్యా వికాసం కోసం శ్రమిస్తున్న కోరుకొండ సైనిక పాఠశాల, అన్నపురెడ్డి రాజేశ్వరరావు, ఈనాడు ఆదివారం, 25 సెప్టెంబరు 1994.