కోరుకొండ సైనిక పాఠశాల

కోరుకొండ సైనిక పాఠశాల (కోరుకొండ సైనిక్ స్కూల్) ఆంధ్రప్రదేశ్, విజయనగరం జిల్లా, విజయనగరం మండలంలోని కోరుకొండ గ్రామంలో వున్నది. ఇది దేశంలో తొలిగా ప్రారంభించబడిన సైనిక పాఠశాలలలో ఒకటి.

సైనిక పాఠశాల, కోరుకొండ
పాఠశాల ప్రధాన ద్వారము
స్థానం
పటం

భారతదేశం
సమాచారం
రకంపబ్లిక్ స్కూలు
భారత రక్షణ శాఖచే నడుపబడుతున్నది
MottoEver Loyal
స్థాపన18 జనవరి 1962
స్థాపకులుCdr. ఆల్మెడా (మొదటి ప్రధానాచార్యులు)
PresidentVice Admiral A K Chopra
పాఠశాల అధిపతిLt Col M Ashok Babu
తరగతులుతరగతులు 6 - 12
Genderబాలురు
వయస్సు10 to 18
విద్యార్ధుల సంఖ్య525
Campus size206-acre (0.83 km2)
Campus typeFully Residential,and for Boys only
Colour(s)Grey and Maroon   
పరీక్షల బోర్డుCBSE
పూర్వ విద్యార్థులుSaikorian Aulmni Association Official website
గదులుమౌర్య,కాకతీయ,పల్లవ,పాండ్య,చాళుక్య,గుప్త, గజపతి
WebsiteSchool Official website

చరిత్ర మార్చు

కోరుకొండ ప్యాలెస్ ను 1911 వ సంవత్సరంలో పూసపాటి చిట్టిబాబు విజయరామ గజపతిరాజు నిర్మించాడు. విద్యార్థుల కొరకు ఒక ప్రత్యేక పాఠశాల నిర్మిస్తే బాగుంటుందన్న ఆలోచన తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకి కలిగింది. ఆ బాధ్యతను అప్పటి రక్షణ మంత్రి వి. కె. కృష్ణ మేనన్ పైన పెట్టాడు. అవిధంగా దేశవ్యాప్తంగా సైనిక పాఠశాలలు ప్రారంభమైనాయి.

ఆంధ్ర ప్రదేశ్లో సరైన ప్రాంగణం కొరకు అన్వేషణ మొదలైంది. విద్యాధికుడైన డా: పూసపాటి వెంకట గజపతిరాజుకి ఆ సంగతి తెలిసింది. విజయనగరానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో వున్న తమ కోరుకొండ ప్యాలెస్ ను పాఠశాల కొరకు ఇవ్వడానికి ఆయన ముందుకొచ్చారు. 1961 సెప్టెంబరు 19 న ఆ అందమైన భవంతితో పాటు 206 ఎకరాల భూమిని కూడా దానంగా ఇచ్చేశాడు. 1961-62 వ సంవత్సరంలో ఆ పాఠశాల ప్రారంభమైంది. రక్షణ శాఖ ఆధ్వర్యంలో సైనిక పాఠశాలల సొసైటి పర్వవేక్షణ బాధ్యతలు చూస్తుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 24 సైనిక పాఠశాలలు ఉన్నాయి.

ప్రవేశ పద్ధతి మార్చు

ఇక్కడ చేరడానికి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణ సాధించాలి. ఇక్కడ ఆరవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు భోదిస్తారు. బాలురకు మాత్రమే ప్రవేశం. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల మూడో ఆదివారం 6, 9 తరగతులకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలు మన రాష్ట్రంలో అనంతపురం, ఏలూరు, గుంటూరు, తిరుపతి, హైదరాబాద్, విజయనగరం కేంద్రాల్లో నిర్వహిస్తారు.

ఆరవ తరగతి ప్రవేశ పరీక్షకు మూడు పేపర్లుంటాయి. గణిత పరీక్షకు 100 మార్కులు 90 నిమిషాల్లో రాయాలి. భాషాసామర్ధ్య పరీక్షకు 100 మార్కులు 45 నిమిషాల్లో రాయాలి. అలాగే ఇంటలిజెంస్ పరీక్షలో మూడు విభాగాలకు 100 మార్కులుంటాయి. ఇవిగాక మౌఖిక పరీక్ష కూడా ఉంటుంది.

తొమ్మిదవ తరగతి పరీక్షకు నాలుగు పేపర్లు రాయాలి. గణితానికి 200 మార్కులు - 120 నిమిషాల వ్యవధి; సామాన్య జ్ఞానానికి 75 మార్కులు - 45 నిమిషాల వ్యవధి ఉంటుంది. మౌఖిక పరీక్షకూడా నిర్వహిస్తారు.

ఆరవ తరగతి పరీక్షను ఇంగ్లీషులోగాని, గుర్తించిన ఏ భారతీయ భాషలోగాని రాయవచ్చు. కానీ తొమ్మిదవ తరగతి పరీక్షలో ప్రశ్నాపత్రాలు ఇంగ్లీషులోనే వుంటాయి. సమాధానాలు ఇంగ్లీషులోగాని, గుర్తించిన ఏ భారతీయ భాషలోగాని రాయవచ్చును.

ప్రముఖ పూర్వ విద్యార్థులు మార్చు

గ్యాలరీ మార్చు

మూలాలు మార్చు

  • రేపటి పౌరుల విద్యా వికాసం కోసం శ్రమిస్తున్న కోరుకొండ సైనిక పాఠశాల, అన్నపురెడ్డి రాజేశ్వరరావు, ఈనాడు ఆదివారం, 25 సెప్టెంబరు 1994.

బయటి లింకులు మార్చు