కోసాయి హనుమాన్ టెంపుల్

కోసాయి హనుమాన్ టెంపుల్ తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా, తలమడుగు మండలంలోని కోసాయి గ్రామంలో ఉంది[1][2].ఇది అతి పురాతన పంచముఖి సంకట మోచన హనుమంతుని ఆలయం. ఇది ఆదిలాబాద్ నుండి 30 కి.మీ దూరం, తలమడుగు మండలం నుండి 17 కి.మీ దూరంలో ఉంది.ఈ ఆలయానికి ఆదివాసీ అంజన్న అని పేరుంది[3].

కోసాయి హానుమాన్ టెంపుల్
గర్భ గృహంలో పంచముఖి సంకట మోచన హానుమాన్ మందిరం
గర్భ గృహంలో పంచముఖి సంకట మోచన హానుమాన్ మందిరం
కోసాయి హానుమాన్ టెంపుల్ is located in Telangana
కోసాయి హానుమాన్ టెంపుల్
కోసాయి హానుమాన్ టెంపుల్
తెలంగాణ రాష్ట్రంలో ఆలయ ఉనికి
భౌగోళికాంశాలు :16°42′00″N 74°14′00″E / 16.70000°N 74.23333°E / 16.70000; 74.23333
పేరు
ఇతర పేర్లు:श्री पंचमुखि हानुमान मंदिर
ప్రధాన పేరు :హనుమంతుడు
దేవనాగరి :कोषाइ हानुमान देवस्थान
మరాఠీ:श्री पंचमुखि हानुमान (कोषाइ) देवस्थान
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:ఆదిలాబాద్, తలమడుగు
స్థానికం:కోసాయి
ఆలయ వివరాలు
ముఖ్య_ఉత్సవాలు:హానుమాన్ జయింతి ,శ్రీరామ నవమి,ఉగాది
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :హిందూ దేవాలయం,దక్షిణ భారత దేశం
దేవాలయాలు మొత్తం సంఖ్య:01
ఇతిహాసం
నిర్మాణ తేదీ:200 సం, లు

చరిత్ర

మార్చు

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కోసాయి నుండి రెండు కి.మీ దూరంలో అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న ఈ పంచముఖి ఆలయానికి సుమారు 200 సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉంది.పూర్వం ఈ విగ్రహాన్ని కొంత మంది వ్యక్తులు ఇతర ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేస్తే దాని మహిమ వలన ఆది సాధ్య పడక పోవడంతో సమిపంలో ఉన్న ఒక వాగులో వదిలి వెళ్ళిపోయారట, స్థానికులు చివరకు స్థానికులే స్వామి విగ్రహాన్ని యధాస్థానంలో ప్రతిష్టాపన చేశారట అప్పటి నుండి స్వామి కి నిత్యం పూజలు జరుగుతున్నాయి.

ప్రత్యేకత

మార్చు

ఈ కోసాయి పంచముఖి సంకట మోచన ఆలయంలో హనుమంతుడు ప్రధాన దైవం. ఈ హనుమంతుడి ప్రత్యేకత ఏమిటంటే స్వామి వారు ఐదు ముఖాలతో ఉండటం. విగ్రహానికి హనుమాన్, నరసింహ స్వామి, వరాహ స్వామి,గరుడ,వాయగ్రీవ స్వాములను ప్రాతినిధ్యం వహిస్తూ ఐదు తలలు ఉంటాయి. ఈ ఆంజనేయ స్వామి చాలా మహిమగలవాడని నమస్కరిస్తే సకల శుభాలు కలుగుతాయి.నంది విగ్రహాన్ని ఎత్తుకుంటే మొక్కుకున్న కోరికలు నేరవెరతాయిని భక్తుల విశ్వాసం[4].

ఉత్సవాలు

మార్చు

ఈ ఆలయంలో చైత్రమాసంలో శ్రీరామనవమి, హనుమాన్ జయింతి[5],తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాది పండుగ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఆలయంల్లో ప్రత్యేక పూజలు ఆరతులు,అభిషేకాలు, భక్తులు పూజలు ఉత్సవాల అనంతరం భక్తులకు ప్రసాదాలు పంచుతారు. ఆలయంలో భక్తులకు పర్వదినం సందర్భంగా దాతలు అన్నదానాలు కూడా నిర్వహిస్తారు.

ఎలా చేరుకోవచ్చు

మార్చు

ఈ ఆలయాన్ని ఆదిలాబాదు, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాదు జిల్లాల నుండి వచ్చే భక్తులు తలమడుగు మండల కేంద్రానికి చేరుకోవాలి, అచ్చట నుండి 18 కిలో మీటర్లు దూరంలో కోసాయి గ్రామం ఉంది. తలమడుగు నుండి కోసాయి కి అటోలో కుర్చోని చేరుకోవచ్చు. మహారాష్ట్రకు చెందిన కిన్వట్, పుసద్ , నాందేడ్ తాలుకా నుండి వచ్చె భక్తులు ప్యాసింజర్ రైలులో చేరుకోవచ్చు. ఆలయ సమీపంలో రైలు రెండు నిమిషాలు ఆగుతుంది.

మూలాలు

మార్చు
  1. Sanagala, Naveen (2007-05-08). "Sri Hanuman Temple, Kosai". HinduPad (in ఇంగ్లీష్). Retrieved 2024-07-19.
  2. "Sri Hanuman Temple – Hindu Temple Timings, History, Location, Deity, shlokas" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-07-19.[permanent dead link]
  3. "అతి పురాతమైన హనుమాన్ దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా పూజలు – LiveNews9 TV" (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-07-18. Retrieved 2024-07-19.
  4. "Temple: ఆ ఆలయంలో నంది విగ్రహాన్ని ఎత్తితే కోరికలు తీరతాయని విశ్వాసం... ఎక్కడంటే". News18 తెలుగు. 2024-06-28. Retrieved 2024-07-20.
  5. telugu, NT News (2022-04-17). "ఘనంగా హనుమాన్‌ చిన్న జయంతి". www.ntnews.com. Retrieved 2024-07-20.