గట్టు భీముడు
గట్టు భీముడు తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు. 1999లో తెలుగుదేశం పార్టీ నుండి గద్వాల్ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేశాడు.[1]
గట్టు భీముడు | |||
గట్టు భీముడు | |||
శాసనసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 1999 – 2004 | |||
నియోజకవర్గం | గద్వాల్ శాసనసభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
మరణం | జూన్ 12, 2019 | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
జీవిత భాగస్వామి | భువనేశ్వరి | ||
సంతానం | నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు | ||
నివాసం | హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం |
జననం
మార్చుబోయ కుటుంబానికి చెందిన భీముడు జోగులాంబ గద్వాల జిల్లా, గట్టు మండలంలోని బల్గెర గ్రామంలో జన్మించాడు.[2]
రాజకీయ ప్రస్థానం
మార్చుచాలాకాలం తెలుగుదేశం పార్టీలో పనిచేసిన భీముడు 1999 ఎన్నికలలో పార్టీ తరపున పోటిచేసి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి. కె. అరుణపై గెలుపొందాడు. 2004లో సమాజ్‌వాది పార్టీ నుండి పోటీచేసిన డి.కె.అరుణ చేతిలో ఓడిపోయాడు. ఆనాటి నుండి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న భీముడు 2018లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలు సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలుపుకు కృషి చేశాడు.[3]
మరణం
మార్చుగత కొంతకాలంగా మధుమేహం, రక్తపోటు, మూత్రపిండాల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న భీముడు నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2019, జూన్ 12 బుధవారం ఉదయం మరణించాడు.[4]
మూలాలు
మార్చు- ↑ సాక్షి, తెలంగాణ (12 June 2019). "గద్వాల మాజీ ఎమ్మెల్యే కన్నుమూత". Archived from the original on 13 June 2019. Retrieved 13 June 2019.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలంగాణ (13 June 2019). "మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు మృతి". Archived from the original on 13 June 2019. Retrieved 13 June 2019.
- ↑ Telangana Today, Telangana (12 June 2019). "Former MLA Gattu Bheemudu passes away at NIMS". Archived from the original on 13 June 2019. Retrieved 13 June 2019.
- ↑ నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (13 June 2019). "గద్వాల మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు మృతి". Archived from the original on 13 June 2019. Retrieved 13 June 2019.