గన్ను కృష్ణమూర్తి పేరొందిన తెలంగాణ కవి, రచయిత, విమర్శకుడు.

గన్ను కృష్ణమూర్తి
Gannu krishnamurthy.jpg
జననంగన్ను కృష్ణమూర్తి
1945, సెప్టెంబర్ 2
వరంగల్ జిల్లా, నెక్కొండ
నివాస ప్రాంతంకామారెడ్డి
ఇతర పేర్లుఎక్స్ రే
ప్రభంజనం
యుగంధర్
భారతి
వృత్తివాణిజ్య శాస్త్ర ఉపన్యాసకుడు
ప్రసిద్ధికథా రచయిత కవి, విమర్శకుడు
మతంహిందూ
తండ్రిగన్ను వైకుంఠం
తల్లిగన్ను జగదాంబ

విశేషాలుసవరించు

ఇతడు 1945, సెప్టెంబర్ 2వ తేదీన గన్ను జగదాంబ, గన్ను వైకుంఠం దంపతులకు వరంగల్ జిల్లా, నెక్కొండ గ్రామంలో జన్మించాడు[1], [2]. ఇతడు వాణిజ్యశాస్త్రంలో స్నాతకోత్తర పట్టా పొందాడు. తరువాత ఎం.ఫిల్., పట్టాను కూడా సంపాదించాడు. ఇతడు కొంతకాలం సర్వే ఆఫ్ ఇండియాలో, మరికొంత కాలం తపాలాశాఖలో ఉద్యోగం చేశాడు. తరువాత వాణిజ్యశాస్త్ర ఉపన్యాసకుడిగా 30 సంవత్సరాలు పనిచేసి 2004లో పదవీ విరమణ చేశాడు[3].

రచనలుసవరించు

 • నాదమే వేదమ్‌ వేదమే దేవమ్‌
 • తపస్సు (కథా సంపుటి)
 • కవితా కాళింది (కవితా సంపుటి)
 • కత్తుల కౌగిలి (ప్రతీకాత్మక గేయకథాకావ్యము)
 • అడవిపూలు (వచనకవితా సంపుటి)
 • మహాప్రభంజనం (సాహిత్య విమర్శ, ప్రతివిమర్శన, స్పందన, ప్రతిస్పందన, పరిశోధన, లేఖ, గల్పిక ఇత్యాదులు)
 • రాముడంటే ఎవరు? రామాయణమంటే ఏమిటి? : వాల్మీకి రామాయణం ఒక విశ్వరూప సందర్శనం
 • యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వారి వస్త్రాపహరణం
 • అంతరంగ తరంగాలు (మినీ కవితా సంపుటి)
 • అంతరంగం (మినీ కవితా సంపుటి)
 • మహాసంకల్పం[4] (గేయకావ్యం)
 • కృష్ణాయనం (పరిశోధన)
 • కృష్ణవేదం (పద్యాలు)
 • ఈ మట్టి నన్ను వెళ్ళనీదు
 • ఒక మానవతా వృక్షచ్ఛాయలో
 • ఏక్ లహర్ సాగర్‌కీ (కవిత)
 • ఋషి హృదయం
 • కోటి గొంతుకలు (కవితా సంకలనం, సంపాదకత్వం సూరారం శంకర్‌తో కలిసి)

కథలుసవరించు

ఇతని కథలు ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, జాగృతి, పుస్తకం తదితర పత్రికలలో అచ్చయ్యాయి. ఇతడు వ్రాసిన కథల పాక్షిక జాబితా:

 1. అస్థిపంజరం
 2. ఆకాశం పందిరిక్రింద
 3. ఎంట్రన్స్ కమ్ ఎగ్జిట్
 4. ఏటికేతముగట్టి
 5. ఓ తాగుబోతు కథ
 6. కట్నం
 7. కలల టివి పెట్టి
 8. కోరిక
 9. గోచిగుడ్డ కథ
 10. చిట్టిరెడ్డి...
 11. చిరుగుల ప్రపంచం
 12. చిల్లర కథ
 13. చీపురు కట్ట
 14. చూస్కో నా తడాఖా
 15. జ్ఞానోదయం
 16. తపస్సు
 17. తీరిన కోరిక
 18. పండగ
 19. పాపం పందికూన
 20. పారిపోలేని చిలక
 21. పీడకల
 22. పొరపాటు
 23. బూర్జువా
 24. మనిషి-జంతువు
 25. మనుష్యులకోసం
 26. మల్లెతోట...
 27. మోడరన్ ఆర్ట్
 28. రాతిముక్క[5]
 29. విశ్వాసం
 30. సచ్చినోడి కథ
 31. సమ్మె
 32. సాక్షాత్కారం[6]
 33. సామాన్యుడి స్వగతం

మూలాలుసవరించు

 1. మహాసంకల్పం గ్రంథంలో కందాళై రాఘవాచార్య పరిచయం నుండి[permanent dead link]
 2. కథానిలయం వెబ్‌సైట్‌లో గన్ను కృష్ణమూర్తి వివరాలు[permanent dead link]
 3. కొత్త కోణాన్ని ఆవిష్కరించా - గన్ను కృష్ణమూర్తి, నవతెలంగాణ
 4. అంతర్జాలంలో మహాసంకల్పం[permanent dead link]
 5. "రాతిముక్క కథ" (PDF). Archived from the original (PDF) on 2013-05-11. Retrieved 2018-02-04.
 6. సాక్షాత్కారం[permanent dead link]