గన్‌ఫౌండ్రి మ్యూజియం

గన్‌ఫౌండ్రి మ్యూజియం తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులోని గన్‌ఫౌండ్రి ప్రాంతంలో ఉన్న మ్యూజియం. హెరిటేజ్ మ్యూజియంలో టెర్రకోట, గార, చరిత్రపూర్వ, మెగాలిథిక్, ఇనుము కళాఖండాలు, చారిత్రాత్మక వస్తువులు, ఆలయ శిల్పాలు, శ్రీశైలం ప్రాజెక్ట్ వల్ల మునిగిపోయిన ప్రాంతం నుండి సేకరించిన తలుపు-జామ్‌లను భద్రపరచడానికి గన్‌ఫౌండ్రిలోని హెరిటేజ్ తెలంగాణ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలో 1976లో ఈ మ్యూజియం స్థాపించబడింది.[1]

గన్‌ఫౌండ్రి మ్యూజియం
Established1976
Locationగన్‌ఫౌండ్రి, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
Visitorsప్రజా
Websiteఅధికారిక వెబ్సైటు

చరిత్ర

మార్చు

గన్‌ఫౌండ్రిలోని డైరెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఈ మ్యూజియాన్ని (రెండు అంతస్తుల భవనం రూ. 40 లక్షల వ్యయం) 1976లో నీటిపారుదల, ప్రాజెక్టుల శాఖచే నిర్మించబడింది. ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా ముంపుకు గురయ్యే కృష్ణా లోయలోని ఏలేశ్వరం, శ్రీశైలం రిజర్వాయర్లు, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల నుండి సేకరించిన పురాతన వస్తువులు, కళా వస్తువులను భద్రపరిచే ఉద్దేశంతో 1990లో పురావస్తు, మ్యూజియంల విభాగానికి అప్పగించబడింది. ఈ మ్యూజియంలో ఐదు రకాల గ్యాలరీలు ఉన్నాయి.

2009, జనవరి 21న అప్పటి పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి చేతుల మీదుగా ఈ మ్యూజియం ప్రారంభించబడింది.[2] పునరుద్ధరణ కార్యకలాపాల కారణంగా 2011 నవంబరులో మూసివేయబడిన మ్యూజియం 2012 మార్చిలో పునప్రారంభించారు.[3]

సేకరణలు

మార్చు

మెదక్ జిల్లాలోని కొండాపూర్, కరీంనగర్ జిల్లాలోని పెద్దబన్కూర్, ధూళికట్ట, నిజామాబాదు జిల్లాలోని పోచంపాడ్, మహబూబ్ నగర్ జిల్లా సేరుపల్లి, నల్లగొండ జిల్లాలోని ఏలేశ్వరం మొదలైన ప్రాంతాల నుండి సేకరించిన రాయి, కలప, దంతాలు, పింగాణీ వంటి పురాతన వస్తువులు, కళా వస్తువులు క్రమపద్ధతిలో భద్రపరచబడ్డాయి.

పాలియోలిథిక్, మిడిల్ పాలియోలిథిక్, అప్పర్ పాలియోలిథిక్, మెసోలిథిక్ టైమ్స్ వంటి యుగాల ప్రకారం ఇక్కడ వస్తువుల సేకరణ విభజించబడింది. ప్రోటో హిస్టారిక్ గ్యాలరీ పాలిష్ చేసిన గొడ్డళ్లు, రబ్బర్లు, స్లింగ్ బాల్, సాడిల్ క్వెర్న్స్ మొదలైన రాయి, రాగి వస్తువులు ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి రికవరీ చేయబడిన కుండలు నియోలిథిక్ మనిషి రోజువారీ జీవితాన్ని ప్రతిబింబించే వస్తువులు ఉన్నాయి. జంతువుల పెంపకం, వేట, వ్యవసాయం, కుండల తయారీ కళ, గుహలు, గుహల పైకప్పులపై పెయింటింగ్‌లు ఉన్నాయి.

మెగాలిథిక్ జానపద సమాధి పద్ధతులు, మతపరమైన ఆచారాలు, నమ్మకాలను తెలిపే మెగాలిథిక్ శ్మశాన వాటికలలో త్రవ్వకాలను జరిపినపుడు బయటపడ్డ వస్తువులు, పురాతన వస్తువులు ప్రదర్శించబడ్డాయి. ఇనుము పనిముట్లు, పూసలు, దంతపు దువ్వెనలు, పాచికలు, టెర్రకోట అచ్చులు, నాణేలు, సెమీ విలువైన పూసలు, వెండి పూసల నెక్లెస్, షెల్ బ్యాంగిల్స్, యాంటిమోనీ రాడ్స్, రాగి రేకులు, కుండలు మొదలైనవి ఉన్నాయి.

కృష్ణా నది లోయలోని శ్రీశైలం మునిగిపోయే ప్రాంతాలలో సమీపంలోని పునరావాస గ్రామాల ఉన్నత ఆకృతులకు వారి పునరావాసం కోసం శ్రీశైలం ప్రాజెక్ట్ హైపవర్ కమిటీ దాదాపు 44 దేవాలయాలను ఎంపిక చేసింది. డిపార్ట్‌మెంట్ 44 దేవాలయాల తరహా నమూనాలను కొనుగోలు చేసి, మ్యూజియం లోపల భద్రపరచారు. కింది ఫ్లోర్ మధ్యలో విజయనగర కాలం నాటి గుడి తలుపు ఉంది, శ్రీశైలం ప్రాజెక్ట్ ముంపు గ్రామాలలో ఒకటైన మహబూబ్ నగర్ జిల్లా ప్రగటూరులోని శ్రీ వరదరాజ స్వామి దేవాలయం నుండి ఆ తలుపును తీసుకువచ్చారు.

సందర్శన వివరాలు

మార్చు

ప్రతిరోజూ ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 వరకు సందర్శనకు అనుమతి ఉంటుంది. శుక్రవారం, పబ్లిక్ హాలిడేస్‌లో మ్యూజియం మూసివేయబడుతుంది.

మూలాలు

మార్చు
  1. Department of Heritage Telangana, Museums. "Heritage Museum Gunfoundry". www.heritage.telangana.gov.in. Archived from the original on 16 July 2021. Retrieved 11 October 2021.
  2. Jan 21, TNN /; 2009; Ist, 05:50 (2009-01-21). "Archaeology museum to be inaugurated today | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 2021-10-11. Retrieved 2021-10-11. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  3. "AP Archaeological museum to re-open soon". The New Indian Express. 2012-02-27. Archived from the original on 2021-10-11. Retrieved 2021-10-11.