గొల్లప్రోలు

ఆంధ్ర ప్రదేశ్, కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండల గ్రామం

గొల్లప్రోలు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, కాకినాడ జిల్లా, గొల్లప్రోలు మండలానికి చెందిన పట్టణం, మండలకేంద్రం.

పట్టణం
పటం
Coordinates: 17°09′15″N 82°17′12″E / 17.15409°N 82.28666°E / 17.15409; 82.28666
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకాకినాడ జిల్లా
మండలంగొల్లప్రోలు మండలం
విస్తీర్ణం
 • మొత్తం15.72 కి.మీ2 (6.07 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం23,882
 • జనసాంద్రత1,500/కి.మీ2 (3,900/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి978
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్(PIN)533445 Edit this on Wikidata
WebsiteEdit this at Wikidata

భౌగోళికం

మార్చు

సమీప నగరం, జిల్లా కేంద్రమైన కాకినాడ నుండి ఉత్తరంగా 22 కి.మీ. దూరంలో ఉన్నది. విశాఖపట్నానికి 130 కి.మీ. దూరంలో వుంది.

జనగణన గణాంకాలు

మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ పట్టణం 6783 ఇళ్లతో, 23882 జనాభాతో 1572 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 12071, ఆడవారి సంఖ్య 11811.[3]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 23,605. ఇందులో పురుషుల సంఖ్య 11,941, మహిళల సంఖ్య 11,664, గ్రామంలో నివాస గృహాలు 5,937 ఉన్నాయి.

పట్టణ ప్రముఖ వీధులు

మార్చు
  • పెద్ద వీధి, కరణంగారి తోట, పల్లపు వీధి, కొత్తపేట వీధి, నందిరాయి వీధి, మంత్రాలవారి వీధి, గుడివీధి, పర్లా వారి వీధి.,మామిడాల వారి వీధి

పరిపాలన

మార్చు

గొల్లప్రోలు నగరపంచాయితీ పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

రవాణా సౌకర్యాలు

మార్చు

జాతీయ రహదారి 216 మీద పట్టణం వుంది. గొల్లప్రోలు రైల్వేస్టేషను (స్టేషను కోడ్ GLP) చెన్నై - హౌరా రైలు మార్గంలో, సామర్లకోట, తుని స్టేషనుల మధ్య ఉంది. [4] ఈ స్టేషను నుండి పిఠాపురం స్టేషనుకు 4 కి.మీ., అన్నవరం స్టేషనుకు 19 కి.మీ. దూరం. గొల్లప్రోలు రైల్వేస్టేషను చుట్టుప్రక్కల 27 గ్రామాలలో సుమారు 1,50,000 జనాభాకు ప్రయాణ వసతి కలిపిస్తుంది.

విద్యా సౌకర్యాలు

మార్చు

గ్రామ పాఠశాల 1954లో మొదలయ్యింది. గవరసాన సత్యనారాయణ భార్య గవరసాన సుభద్ర ఇందుకు భూమి విరాళంగా ఇచ్చింది. ఆమె తండ్రి జ్ఞాపకంగా ఈ పాఠశాలకు "డా. మలిరెడ్డి వెంకటరాజు మెమోరియల్ ప్రాథమిక పాఠశాల" అని పేరు పెట్టారు. ఇందులో సుమారు 400 మంది విద్యార్థులు చదువుకొంటున్నారు.[5]. శ్రీమతి మలిరెడ్డి ఉమాంబ ప్రాథమిక పాఠశాల అనేది 2007 లో మొదలు పెట్టేరు. ఇది కూడా గవరసాన దంపతుల పూనికతో జరిగినదే. ఇక్కడ 1950 దశకంలో సేఠ్ పెరాజీ లుంబాజీచే నిర్మించబడిన Z.P.P. ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల ఉన్నాయి.

పంటలు

మార్చు

ఎక్కువ మంది జనాభా వ్యవసాయ కార్మికులు.[5] ఈ గ్రామప్రాంతంలో పండే మిరపకాయలకు మంచి గిరాకీ ఉంది. ఇంకా ఉల్లి, వేరుశనగ, ప్రత్తి, వరి పంటలు కూడా ఇక్కడ బాగా పండిస్తారు.

పరిశ్రమలు

మార్చు

ధాన్యం మిల్లులు, జిన్నింగ్ మిల్లులు, వేరుశనగ నూనె మిల్లులు

ప్రముఖులు

మార్చు

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx. {{cite web}}: Missing or empty |title= (help)
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  4. Online Highways LLC (2004). "Gollaprolu Railway Station". www.india9.com. Retrieved 2007-02-06.
  5. 5.0 5.1 "Dr. MVR Prathamika Patasala, Gollaprolu". Asha for Education. 2004. Retrieved 2007-01-24.

బయటి లింకులు

మార్చు