17వ లోక్‌సభ
2019 భారత సార్వత్రిక ఎన్నికలలోఎన్నికైన సభ్యులచే 17వ లోక్‌సభ ఏర్పడింది. [1] భారతదేశం అంతటా ఎన్నికలను భారత ఎన్నికల సంఘం 2019 ఏప్రిల్ 11 నుండి 2019 మే 19 వరకు ఏడుదశల్లో నిర్వహించింది. 2019 మే 23 ఉదయం ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అదే రోజు ఫలితాలు ప్రకటించారు. 17 వ సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికయ్యాడు. ప్రతిపక్ష నాయకుడి స్థానాన్ని దక్కించుకోవడానికి ఏ పార్టీకి కనీసం 10% స్థానాలు పొందలేదు. అందువలన 17వ లోక్‌సభకు ప్రతిపక్ష నాయకుడును ఎన్నుకోబడలేదు.అయితే లోకసభలో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌కు అధిర్ రంజన్ చౌదరి నేతగా ఉన్నాడు. [2] [3] 17వ లోక్‌సభలో మహిళా ప్రతినిధులు అత్యధికంగా 14 శాతం మంది ఉన్నారు. మొత్తం 545 మంది లోకసభ సభ్యులలో, తొలిసారి ఎంపీలుగా 267 మంది సభ్యులు గెలుపొందారు. గెలుపొందిన మొత్తం సభ్యులలో 233 మంది సభ్యులపై (43 శాతం) నేరారోపణలు ఉన్నాయి.
17th Lok Sabha | |||||
---|---|---|---|---|---|
| |||||
![]() | |||||
Overview | |||||
Legislative body | Indian Parliament | ||||
Term | 24 May 2019 – | ||||
Election | 2019 Indian general election | ||||
Government | Third National Democratic Alliance Government | ||||
Sovereign | |||||
President | Droupadi Murmu | ||||
Vice President | Jagdeep Dhankhar | ||||
House of the People | |||||
![]() | |||||
Members | 543 | ||||
Speaker of the House | Om Birla | ||||
Leader of the House | Narendra Modi | ||||
Prime Minister | Narendra Modi | ||||
Leader of the Opposition | Vacant since 26 May 2014 | ||||
Party control | National Democratic Alliance |
సభ్యులు మార్చు
- వక్త: ఓం బిర్లా, భారతీయ జనతా పార్టీ [4]
- ఉప సభాపతి: ఖాళీ [5]
- సభా నాయకుడు: నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ [6]
- ప్రతిపక్ష నాయకుడు: గుర్తింపు లేదు
- సెక్రటరీ జనరల్: ఉత్పల్ కుమార్ సింగ్ [7]
పార్టీల వారీగా సీట్ల పంపకాలు మార్చు
గణాంకాలు మార్చు
పార్టీ | ఎన్నికైన
సభ్యులు |
నేరారోపణల సభ్యులు |
శాతం | |
---|---|---|---|---|
బీజేపీ | 303 | 116 | 39% | |
ఐ.ఎన్.సి | 52 | 29 | 57% | |
డిఎంకె | 24 | 10 | 43% | |
జెడి(యు) | 16 | 13 | 81% | |
ఎఐటిసి | 22 | 9 | 41% |
17వ లోక్‌సభలో అత్యధికంగా మొత్తం సభ్యులలో 78 మంది మహిళా రాజకీయ నాయకులు అంటే దాదాపు 14% మంది ఉన్నారు. [20] అంతకుముందు లోక్‌సభలో 62 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. 17వ లోక్‌సభ సభ్యుల సగటు వయస్సు 54 సంవత్సరాలు. 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు 12% మంది ఎంపీలు ఉన్నారు.కియోంజర్ నియోజకవర్గం నుండి బిజెడి పార్టీకి చెందిన చంద్రాని ముర్ము 25 సంవత్సరాల 11 నెలల తొమ్మిది రోజుల వయస్సులో అతిపిన్న వయస్కురాలిగా, సంభాల్ నియోజకవర్గం నుండి సమాజ్ వాదీ పార్టీకి చెందిన షఫీకర్ రహ్మాన్ బార్క్ 89 సంవత్సరాల వయస్సుతో అతి పెద్ద వయస్సు సభ్యురాలుగా ఉన్నారు. [21] [22] విద్య వారీగా, 43% మంది లోకసభ సభ్యులు గ్రాడ్యుయేట్-స్థాయి విద్యను కలిగి ఉన్నారు, 25% మంది పోస్ట్-గ్రాడ్యుయేట్లు,4% మంది సభ్యులు వివిధ సబ్జెక్టులలో డాక్టరేట్లను కలిగి ఉన్నారు. మొత్తం సభ్యులలో 300 మంది సభ్యులు మొదటిసారి సభ్యులుగా ఎన్నికయ్యారు. 197 మంది సభ్యులు వరుసగా రెండవసారి ఎన్నికయ్యారు. అంటే వారు 16వ లోక్‌సభలో సభ్యులుగా పనిచేసి తిరిగి ఎన్నికైయ్యారు.[20] సుల్తాన్‌పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ సభ్యులు మేనకా గాంధీ, బరేలీ నియోజకవర్గం నుంచి సంతోష్ గంగ్వార్ ఎనిమిదోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు.[23] మతపరంగా 90.4% మంది సభ్యులు హిందువులు కాగా, 5.2% మంది ముస్లింలు, మిగిలిన వారు దాదాపు 4% మందిలో సిక్కులు, క్రైస్తవులు, ఇతర మైనారిటీలకు చెందినవారు ఉన్నారు. [23]
నేరారోపణలు మార్చు
ప్రభుత్వేతర సంస్థ, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) ప్రకారం, 233 మంది సభ్యులు (అంటే 43%) పై నేరారోపణలు ఉన్నాయి.వీటిలో దాదాపు 29% కేసులు అవి అత్యాచారం, హత్య, హత్యాయత్నం లేదా మహిళలపై నేరాలు లాంటివి. కేరళలోని ఇడుక్కి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ డీన్ కురియకోస్‌పై 204 క్రిమినల్ కేసులు ఉన్నాయి.[19]
ఆర్థిక వివరాలు మార్చు
ఆర్థికంగా, కోటీశ్వరులైన సభ్యుల సంఖ్య (అనగా ₹1 కోటి (US$130,000) కంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నవారు) 475 మంది ఉన్నారు. ₹5 కోట్ల (US$630,000) కంటే ఎక్కువ ఆస్తులు కలిగిన సభ్యులు 266 మంది ఉన్నారు. మొత్తం లోక్‌సభ సభ్యుల సగటు ఆస్తులు ₹20.9 కోట్లు (US$2.6 మిలియన్లు) చింద్వారా నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌కు చెందిన నకుల్ నాథ్ దాదాపు ₹660 కోట్లు (US$83 మిలియన్లు) అత్యధిక ఆస్తులు ప్రకటించిన సభ్యుడు. నకుల్ నాథ్ తర్వాతి స్థానంలో కన్యాకుమారి నియోజకవర్గం నుండి హెచ్. వసంతకుమార్ ఉన్నారు, ₹417 కోట్లు (US$52 మిలియన్), బెంగళూరు రూరల్ నియోజకవర్గం నుండి డి. కె. సురేష్ ₹338 కోట్లు (US$42 మిలియన్) ఇద్దరూ కాంగ్రెస్ పార్టీకి చెందినవారే.
బిల్లులు మార్చు
2021 నవంబరు నాటికి, 17వ లోక్‌సభ కాలంలో, 12% బిల్లులు పార్లమెంటరీ కమిటీల పరిశీలనకు పంపబడ్డాయి. [24] [25] [26]
మూలాలు మార్చు
- ↑ "General Election 2019 - Election Commission of India". results.eci.gov.in. Archived from the original on 25 May 2019. Retrieved 23 May 2019.
- ↑ "Congress MP Ravneet Singh Bittu Becomes New Leader of Opposition in Lok Sabha". msn.com. Retrieved 12 January 2022.
- ↑ "After Derek O'Brien, Adhir Ranjan Chowdhury Asks Standing Committee to Discuss 'Tek Fog'". The Wire. 12 January 2022. Retrieved 12 January 2022.
- ↑ "Om Birla unanimously elected as the speaker of Lok Sabha". Economic Times. 20 June 2019. Retrieved 12 August 2019.
- ↑ Kumar Shakti Shekhar (31 July 2019). "Narendra Modi govt yet to appoint Lok Sabha deputy speaker, Congress slams delay". The Times of India. Retrieved 13 September 2019.
- ↑ "Leader of the House". Lok Sabha. Retrieved 12 August 2019.
- ↑ "Senior IAS officer Utpal Kumar Singh named Lok Sabha Secretary General - ET Government". Economic Times (in ఇంగ్లీష్). 30 November 2020. Retrieved 4 March 2021.
- ↑ "General Election 2019 - Election Commission of India". results.eci.gov.in. Archived from the original on 25 May 2019. Retrieved 23 May 2019.
- ↑ "After Rahul Gandhi refuses, Congress names Adhir Ranjan Chowdhury as its leader in Lok Sabha: Reports". Times Now. 18 June 2019. Retrieved 19 June 2019.
- ↑ "Baalu new DMK parliamentary party leader". The Times of India. 26 May 2019. Retrieved 18 June 2019.
- ↑ "TMC designates six MPs for speaking to media". India Today. 4 June 2019. Retrieved 9 August 2019.
- ↑ "Vijayasai Reddy named YSRCP Parliamentary Party leader". Business Standard. 5 June 2019. Retrieved 9 August 2019.
- ↑ "Shiv Sena appoints Vinayak Raut as party leader for Lok Sabha". Hindustan Times. 15 June 2019. Retrieved 9 August 2019.
- ↑ "Rajiv Ranjan Singh is JDU Parliamentary party leader in Lok Sabha". Business Standard. 11 June 2019. Retrieved 9 August 2019.
- ↑ "Pinaki Misra appointed BJD parliamentary party leader in Lok Sabha". The Times of India. 2 June 2019. Retrieved 9 August 2019.
- ↑ "BSP appoints Munquad Ali as UP party chief, Danish Ali removed as leader in LS". India Today. 7 August 2019. Retrieved 9 August 2019.
- ↑ "Nama Nageswara Rao elected TRS leader in Lok Sabha". Business Standard. 13 June 2019. Retrieved 9 August 2019.
- ↑ Mishra, Himanshu (14 June 2021). "Pashupati Paras replaces Chirag Paswan as leader of LJP Parliamentary party in Lok Sabha". India Today (in ఇంగ్లీష్). Retrieved 21 June 2021.
- ↑ 19.0 19.1 "43% newly-elected Lok Sabha MPs have criminal record: ADR". The Hindu. 26 May 2019. Retrieved 28 August 2019.
- ↑ 20.0 20.1 Khanna, Pretika (24 May 2019). "At 14%, 17th Lok Sabha has the highest number of women MPs". Live Mint. Retrieved 13 August 2019.
- ↑ "BJD's Chandrani Murmu, 25, becomes youngest Member of Parliament". MSN. 26 May 2019. Retrieved 28 August 2019.
- ↑ Chaudhary, Anjan Kumar (28 May 2019). "17वीं लोकसभा के सबसे यंग और सबसे बूढ़े सांसद को जानिए". One India. Retrieved 28 August 2019.
- ↑ 23.0 23.1 "From faith to gender and profession to caste: A profile of the 17th Lok Sabha". Hindustan Times. 25 May 2019. Retrieved 28 August 2019.
- ↑ "The Importance of Parliamentary Committees". PRS Legislative Research (in ఇంగ్లీష్). Archived from the original on 2022-07-11. Retrieved 29 November 2021.
- ↑ "Only one bill in monsoon session sent to parliamentary committee". mint (in ఇంగ్లీష్). 13 August 2016. Retrieved 29 November 2021.
- ↑ "Graph". LiveMint (in ఇంగ్లీష్). Retrieved 29 November 2021.